Behind the Chandrayaan 3 Meet Ritu Karidhal the Rocket Woman of India - Sakshi
Sakshi News home page

Ritu Karidhal Srivastava: జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్

Published Fri, Jul 14 2023 7:28 PM | Last Updated on Fri, Jul 14 2023 8:46 PM

Behind the Chandrayaan 3 Meet Ritu Karidhal The Rocket Woman Of India - Sakshi

చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. శుక్రవారం (జూలై 14) మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 తొలిదశ విజయవంతమైంది. అత్యంత ప్రతిష్టాత్మక మూన్‌ మిషన్‌కు చంద్రయాన్‌-3ని చేరువ చేసేందుకుద్దేశించిన బాహుబలి రాకెట్‌ మొత్తం మూడు దశలనూ దాటుకుని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఘనత,  శాస్త్రవేత్తలపై అభినందలు  ప్రకటించారు. (తొలి కంప్యూటర్‌ అందించిన టెక్‌ దిగ్గజం, బిలియనీర్‌ ఎవరో తెలుసా? )

ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయి,చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శుక్రవారం  ప్రకటించారు. చంద్రయాన్-3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. మరోవైపు ఈకీలక ప్రయోగం వెనుక ఉన్న కీలక శక్తి ఒక మహిళగా ఉండటం విశేషంగా నిలుస్తోంది. యూపీలో లక్నోలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. స్పేస్ పట్ల అభిరుచి, అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన వార్తా కథనాలను సేకరించే  ఆసక్తి, వీటన్నింటికీ  సవాల్‌ను స్వీకరించే నైజం ఆమెను విజయ తీరాలను చేర్చింది.  చిన్న వయస్సులోనే అంతరిక్ష శాస్త్రంపై  ఉన్న మక్కువ నవంబర్ 1997లో  ఇస్రోలో చేరడంతో ఆమె కల నెర వేరింది. తాజా విజయంతో  యావద్దేశం గర్వపడేలా చేశారు.

సంబరాల్లో కుటుంబం: చంద్రయాన్ 2  ప్రాజెక్టు  సఫలం కావడంతో రీతు కరిధాల్ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది.  ఈ ఆనంద క్షణాలను స్వీట్లు పంచుతూ సెలబ్రేట్‌ చేసుకుంది. ఇది చాలా సంతోషకరమైన క్షణం, సోదరిని చూసి  చాలా గర్వపడుతున్నాను అంటూ రీతూ కరిధాల్ సోదరుడు రోహిత్ కరిధాల్ ఆనందాన్ని ప్రకటించారు.  (DelhiFloods: మూడు రోజుల్లో రూ.200కోట్లు నష్టం, ఇండస్ట్రీ కీలకహెచ్చరికలు)

రాకెట్ విమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్ శ్రీవాస్తవ, ఇంట్రస్టింగ్‌ సంగతులు 

చంద్రయాన్ 3 మిషన్‌కు ఇస్రో శాస్త్రవేత్త ,  లక్నోకుచెందిన   రీతూ కరిధాల్ శ్రీవాస్తవ  నాయకత్వం వహించారు. 
⇒ చిన్నప్పటినుంచి అంతరిక్షం అంటే ఆసక్తి,  పలు నేషనల్‌, ఇంటర్నేషనల్‌ జర్నల్స్ లో ఆమె 20కి పైగా పేపర్స్ ను పబ్లిష్ చేశారు.
ఇస్రో వర్గాల్లో రాకెట్ విమన్ ఆఫ్ ఇండియాగాపాపులర్‌ లక్నో యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేశారు. ఆ తర్వాత బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో  ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ 
 ⇒ రీతూ 1997 నుండి ISROలో పని చేస్తున్నారు.
 చంద్రయాన్- 2  ప్రాజెక్టుకు మిషన్ డైరెక్టర్‌ కూడా
⇒ మంగళ్ యాన్’ప్రాజెక్టుకు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలు. 
మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా  ‘ ఇస్రో యంగ్ సైంటిస్ట్’ అవార్డు
  మంగళయాన్ ప్రాజెక్టు కోసం చేసిన కృషికి గానూ 2015 లో ఇస్రో టీమ్ అవార్డ్ 
  2017లో విమన్ అచీవర్స్ ఇన్ ఏరోస్పేస్ పురస్కారం
 కరిధాల్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement