ఇక జాబిల్లిపై కోట్లాది భారతీయుల కొత్త కలలు: ఆనంద్‌ మహీంద్ర | ISRO's Chandrayan-3 Grand Success, Anand Mahindra Lauds - Sakshi
Sakshi News home page

ఇక జాబిల్లిపై కోట్లాది భారతీయుల కొత్త కలలు: ఆనంద్‌ మహీంద్ర

Published Wed, Aug 23 2023 6:28 PM | Last Updated on Thu, Aug 24 2023 1:08 PM

ISRO Chandrayan 3 Grand success Anand Mahindra lauds - Sakshi

చంద్రయాన్‌-3 అఖండ విజయంపై సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ అద్బుత,చారిత్రక విజయంపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఈ నేపథ్యంలో బిలియనీర్‌, పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర అద్భుతం అంటూ ట్వీట్‌  చేశారు. 

మానవజాతి ప్రారంభమైనప్పటి నుండి మనం చంద్రుని వైపు చూశాం. మన మనస్సులో జాబిల్లి మాయాజాలం, స్వప్నాలు ఇక నిజం కాబోతున్నాయి.  చంద్రుడిపై కలలు నేడు, మేజిక్ &సైన్స్ సమ్మిళిత కృషితో జాబిల్లి మన చేతికి చిక్కింది. ఇక 1.4 బిలియన్ల భారతీయుల మనస్సుల్లో జాబిల్లిపై సరికొత్త డ్రీమ్స్‌. జై హింద్! అంటూ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌చేశారు. (చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు)

ఈ మిషన్‌ తప్పక విజయం సాధిస్తుందని ముందే బల్లగుద్ది మరీ చెప్పిన నటుడు మాధవన్‌ చంద్రయాన్‌3 సక్సెస్‌తో ఆయన సంతోషానికి అవధుల్లేవు అంటూ మరో ట్వీట్‌ చేశారు. ఐఆర్‌సీటీసీ కూడా చంద్రయాన్‌-3 విజయంపై   సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది.

కాగా అంతరిక్ష పరిశోధనలో భారత్‌ తన దైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 విజయవంత మైం. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండ్‌ కావడంతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement