Chandrayaan 3: Completes Final Lunar Orbit Move Next Stop Moon - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-3: చంద్రుడికి అడుగు దూరంలో ఇస్రో ‘విక్రమ్‌’.. ఇక చివరి ఘట్టం అదే

Published Sun, Aug 20 2023 8:08 AM | Last Updated on Sun, Aug 20 2023 11:06 AM

Chandrayaan 3 Completes Final Lunar Orbital Move Next Stop Moon - Sakshi

సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3లో కీలకఘట్టాలు దాదాపు పూర్తయ్యాయి. రెండో, చివరి డీ-బూస్టింగ్‌ విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు  శనివారం అర్ధరాత్రి దాటాక అధికారిక ప్రకటన చేసింది. దీంతో చంద్రుడి అతిచేరువ కక్ష్యలోకి విక్రమ్‌ మాడ్యూల్‌ చేరింది.

చంద్రుడి నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ ప్రస్తుతం అత్యల్పంగా 25కి.మీ, అత్యధికంగా 134 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. అంటే.. ఈ కీలక ఘట్టం పూర్తికావడంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే మిగిలి ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం కీలక, చివరిదశ అయిన విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌పై దృష్టి పెట్టారు. అన్నీ అనుకూలిస్తే ఇస్రో అనుకున్న తేదీనే చంద్రుడి దక్షిణధ్రువంపై ల్యాండ్‌ కానుంది.

‘‘ రెండో, చివరి డీబూస్టింగ్‌ ఆపరేషన్‌తో ల్యాండర్‌ మాడ్యూల్‌ 25 కి.మీX 134కి.మీ కక్ష్యలోకి చేరింది. మాడ్యూల్‌ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఎంచుకున్న ల్యాండింగ్‌ సైట్‌లో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం. చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుంది’’ అని ఇస్రో ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొంది.

ఇదీ చదవండి: జాబిల్లిపై నీటి జాడ.. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement