సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రుడిపై దాగి ఉన్న రహస్యాలను అధ్యయనం చేయడం కోసం ఇస్రో సైంటిస్టులు చంద్రయాన్–3 ప్రయోగం చేపట్టారు. ఈ మిషన్‌లో 5 ఇస్రో పేలోడ్స్, నాసాకు చెందిన ఒక పేలోడ్‌ను పంపించారు. ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉపరితలంపై దించి పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతంలో సూర్యరశ్మి సోకదని, చీకటిగా ఉంటుందని చెబుతున్నారు.
ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్య (లూనార్ ఆర్బిట్) నుంచి అటు భూమిని, ఇటు చంద్రుడిని అధ్యయనం చేయడానికి ‘ఆర్బిటార్ స్పెక్ట్రోపోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్’అనే ఒక సైంటిఫిక్ పరికరం అమర్చి పంపారు. ఈ సైంటిఫిక్ పేలోడ్‌తో ముఖ్యంగా చంద్రుడి ఉపరితలం నివాసయోగ్యంగా ఉందా? అనేది అధ్యయనం చేస్తారు. అలాగే చంద్రుడిపై జరుగుతున్న మార్పులను తెలుసుకోవచ్చు. జాబిల్లిని అధ్యయనం చేయడానికి ఇది ప్రయోగాత్మక పేలోడ్ కావడం విశేషం.
ల్యాండర్‌లో పేలోడ్స్ ఇవీ...
► ల్యాండర్‌లో మూడు పేలోడ్స్ ఉన్నాయి. ఇందులో లాంగ్‌మ్యూయిన్ ప్రోబ్ (రంభ–ఎల్‌పీ) అనే సైంటిఫిక్ పేలోడ్‌తో చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా, అయాన్లు, ఎల్రక్టాన్లు, చంద్రుడి అంతర్భాగం దాగి ఉన్న ఖనిజాలపై పరిశోధన చేస్తారు.
► చంద్రాస్ సర్వేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పరిమెంట్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
► ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్»ౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్పియర్, అటా్మస్పియర్ అనే పేలోడ్స్‌తో చంద్రుడిపై లాండింగ్ సైట్ చుట్టూ ప్రకంపనలను గుర్తిస్తారు.
రోవర్‌లోని పేలోడ్స్
► చంద్రుడి ఉపరితలం మూలక కూర్పును అధ్యయనం చేయడానికి రోవర్‌లో రెండు సైంటిఫిక్ పరికరాలను అమర్చి పంపారు. ఇందులో అల్ఫా పారి్టకల్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్‌తో చంద్రుడిపై ఖనిజ సంపద, శిలాజాలను శోధిస్తారు. చంద్రుడిపై రసాయనాలుంటే వాటిని కూర్పు చేయడానికి ఉపయోగిస్తారు.
► లేజర్ ప్రేరేపిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనే పేలోడ్‌తో చంద్రుడిపై రాళ్లను అధ్యయనం చేస్తారు. ముఖ్యంగా చంద్రుడిపై నేల స్వభావం ఎలా ఉందో గుర్తిస్తారు.
► గ్యాస్, ప్లాస్మా పర్యావరణాన్ని అధ్యయనం చేయడానికి, చంద్రశ్రేణి అధ్యయనాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ శ్రేణి అనే ఒక సైంటిఫిక్ పరికరాన్ని కూడా రోవర్‌లో అమర్చారు. ఇది కూడా చంద్రుడిపై మరింత అధ్యయనం కోసమే.
Comments
Please login to add a commentAdd a comment