హత్యకు గురైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
సాక్షి, చందుర్తి/వేములవాడ : మండలంలోని మూడపల్లి సర్పంచ్ గోలి శంకర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి హతమార్చడంతో పోలీసులు మూడపల్లి గ్రామంలో అనుమానితులను సోమవారం విచారించినట్లు సమాచారం. ఏడేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన వివాహిత మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆమె ఆత్మహత్యకు శంకర్ బాధ్యుడని సదరు మహిళా మృతదేహంతో గ్రామస్తులు ధర్నాను చేపట్టారు. శంకర్ కుటుంబంతో మరో రెండుమూడు కుటుంబాలకు విరోధం ఉండడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అంతేకాకుండా వేములవాడ పట్టణ శివారు ప్రాంతంలో హంతకులు వెంటాడి హతమార్చడాన్ని పోలీసులు జీర్ణించుకోవడం లేదు.
ఫ్యాక్షన్ కక్షలను తలపించే రీతిలో జరిగిన హత్యోందతాన్ని సవాల్‌గా స్వీకరిస్తున్నారు. హత్య సంఘటన స్థలాన్ని ఎస్పీ రాహూల్ హెగ్డే సందర్శించి ఘటనపై ఆరా తీయడంతో జిల్లాలోనే ఈ ఘటన సంచలనంగా మారింది. చందుర్తి పోలీసులు మాత్రం మూడపల్లిలోని శంకర్‌తో విరోధం, పాత కక్షలు ఉన్న వారందరిపై నిఘా తీవత్రరం చేశారు. అంతేకాకుండా శంకర్ ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో సదరు మహిళ సోదరుడికి, శంకర్‌కు నెల క్రితం గొడవలు తలెత్తాయని అతడి సన్నిహితులు గ్రామంలో చర్చించుకుంటున్నారు. ఈ గొడవలే హత్యకు దా రి తీసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హంతకులు ఎవరన్నది హత్య జరిగి 24గంటలు గడిచినా పోలీసులకు అంతు చిక్కడం లేదు.
మృతుడి కాల్ డేటా సేకరణ?
వేములవాడ పట్టణ శివారులో హత్యకు గురైనా మూడపల్లి సర్పంచ్ గోలి శంకర్ సెల్ ఫోన్ కాల్ డేటాతో పాటు పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్న కొండన్నపల్లి వివాహిత సోదరుడి కాల్‌డేటాపై దృష్టిసారించుతున్నారు. వివాహత సోదరుడు కేరళలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు సోమవారం ఉదయం అతడి లొకేషన్‌ను పోలీసులు స్వీకరించినట్లు తెలిసింది. అనుమానితుడు కేరళలో ఉన్నా కిరాయి హంతకులను ఏర్పాటు చేసి హతమార్చాడా ? వివరాలు సేకరించి పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరగుతోంది. ఏది ఏమైన హత్యను సవాల్‌గా స్వీకరించి నిందితులను సాధ్యమైనంత తొందరలో పట్టుకునేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.
Comments
Please login to add a commentAdd a comment