వాషింగ్టన్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ మనం అనుకున్నంత భద్రమైనదేమీ కాదని నిపుణులు వ్యాఖ్యానించారు. వాట్సాప్ ద్వారా ఒక వ్యక్తి మరో వ్యక్తికి పంపే సందేశాలు ఎన్‌క్రిప్ట్ అయ్యి గోప్యంగా ఉండటం నిజమేకావచ్చని, అయితే వాట్సాప్ కాల్ డేటా సహా ఇతర సమాచారం దుర్వినియోగం అవుతుండొచ్చని అమెరికాకు చెందిన నిపుణుడు వివేక్ వాధ్వా అంటున్నారు. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ 2014లో కొనేసింది.
వినియోగదారులు వాడుతున్న ఫోన్ వివరాలు, గుర్తింపు తదితరాలను ఫేస్‌బుక్‌కు అందజేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించిన విషయాన్ని వివేక్ గుర్తుచేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో భద్రత లేదని, ఏదేనీ గ్రూప్‌లోని వ్యక్తికి ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరి ఫోన్ నంబర్లు తెలిసిపోతుండటంపై వివేక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగమవ్వడం, గూగుల్ వంటి సంస్థలు యూజర్ల సమాచారాన్ని సేకరించి, నిర్వహిస్తుండటం తదితరాల నేపథ్యంలో కొత్త నిబంధనలు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment