no security
-
ఆ వాహనం కాలం చెల్లిందే
సాక్షి, అమరావతి: అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబైతే.. దు ష్ప్రచారానికి మారుపేరు టీడీపీ అనేది మరోసారి నిరూపితమైంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రభుత్వం కలి్పంచిన భద్రతలో బహిర్గతమైన డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలను అస్త్రాలుగా చేసుకుని, దు్రష్ఫచారం చేసే యత్నంలో టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. వైఎస్ జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం(ఏపీ 39పీ 0014) పాతదేనని అంగీకరించడం ద్వారా తన నకిలీ బతుకును బయపెట్టుకుంది. ఆ వాహనంలో పదేళ్లు చంద్రబాబు ప్రయాణించారని.. రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు తిరిగారని ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది.కాలం చెల్లిన ఆ వాహనానికి కనీసం మరమ్మతులు చేయకుండా వైఎస్ జగన్‌కు కేటాయించింది. వినుకొండలో నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్త జిలానీ కత్తితో అత్యంత పాశవికంగా నరికి నరికి చంపారు. ఈ నేపథ్యంలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే తాడేపల్లి నుంచి వినుకొండకు వైఎస్ జగన్ బయలుదేరారు. అత్యంత పాతది.. పైగా మరమ్మతులు చేయకపోవడంతో ఆ వాహనం పదే పదే మొరాయించింది. దాంతో మరో వాహనంలో వైఎస్ జగన్ వినుకొండ చేరుకున్నారు.మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జడ్ ప్లస్ భద్రత ఉంది. జడ్ ప్లస్ భద్రత ఉన్న వారికి ఎవరికైనా కండీషన్లో ఉండే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలన్నది నిబంధన. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. జడ్ ప్లస్ భద్రత ఉన్న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కండీషన్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం తద్భిన్నంగా వైఎస్ జగన్‌కు కాలం చెల్లిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. పదేళ్లపాటు లక్షల కిలో మీటర్లు తిరిగిన ఆ వాహనానికి టీడీపీ సర్కార్ కనీసం మరమ్మతులు కూడా చేయించలేదు. వైఎస్ జగన్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం ఇలా వ్యవహరించిందని స్పష్టమవుతోంది. -
ఎందుకీ విద్వేషపు చిచ్చు ?
ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా కెనడాకు పేరుంది. గతేడాది ప్రపంచ శాంతి సూచిలో ఆరో ర్యాంకు దక్కింది. నేరాలు, ఘర్షణలూ తక్కువే. రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వం. అలాంటి దేశంలో భారతీయులకు భద్రత ఎందుకు లేదు? వారిపై విద్వేష నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? కెనడాలో భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది...? కెనడాలో హిందూ, భారత్ వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయి. ఇటీవల అక్కడ హిందూ దేవాలయాలపై వరసగా జరుగుతున్న దాడులు ఆందోళన పెంచుతున్నాయి. టొరంటోలోని స్వామినారాయణ మందిరంపై కొన్నాళ్ల క్రితం కొందరు దుండగులు దాడులు చేస్తూ ఖలిస్తాన్ జిందాబాద్, హిందూస్తాన్ ముర్దాబాద్ అంటూ చేసిన నినాదాలతో భారతీయులు ఉలిక్కిపడ్డారు. జూలైలో గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని రిచ్మండ్ హిల్‌లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వీటి వెనక ఖలీస్తాన్ ఉగ్రవాదుల హస్తముందని ఆధారాలున్నా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం భారత్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. అధికార లిబరల్ పార్టీ ఎంపీ, ప్రవాస భారతీయుడు చంద్ర ఆర్య వీటిని పార్లమెంటులో లేవనెత్తారు. భారత్‌పై, హిందూ మతంపై విద్వేషం వెళ్లగక్కుతున్నారన్నారు. ఖలిస్తానీల అడ్డా? కెనడా కొన్నేళ్లుగా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత వ్యతిరేక అజెండాతో పని చేస్తున్న వీరంతా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం కోసం కెనడాను వాడుకుంటున్నారు. భారత్ నిషేధించిన సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సెప్టెంబర్ 18న ఖలిస్తాన్ రిఫరెండాన్ని నిర్వహించింది. దీన్ని నిలిపేయాలని భారత్ కోరినా కెనడా పట్టించుకోలేదు. లౌకిక దేశమైన తాము ప్రజాభిప్రాయ సేకరణలను అడ్డుకోబోమని తేల్చి చెప్పింది. ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలైన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ వంటివి కెనడా గడ్డ నుంచి భారత్‌లో మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్నాయి. 2018 నుంచి కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి. బ్రాంప్టన్‌లో గౌరీశంకర్, జగన్నాథాలయం, మిసిసాపలో హిందూ హెరిటేజ్ సెంటర్‌పై దాడులు జరిగాయి. ఇదంతా కెనడాలో ఉంటూ భారత్‌ను అస్థిరపరిచే కుట్రేనని గతేడాది అక్కడ పర్యటించిన జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. కెనడాలో భారతీయం కెనడాలో మొదట్నుంచి భారతీయుల ప్రాబల్యం ఎక్కువే. ప్రస్తుతం అక్కడ 16 లక్షల మంది (4 శాతం) భారతీయులున్నారు. వీరిలో లక్ష మందికి పైగా శాశ్వత పౌరసత్వముంది. ఎక్కువగా పంజాబీలే కెనడా వెళుతుంటారు. ఆ దేశంలో అత్యధికంగా మాట్లాడే 10 భాషల్లో పంజాబీ కూడా ఉంది. చట్టసభల్లోనూ భారతీయులు సత్తా చాటారు. 2015లో 21 మంది భారత సంతతికి వారు ఎంపీలయ్యారు. 2019లో 23కు పెరిగారు. కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సింగ్ సజ్జన్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే! జర భద్రం: కేంద్రం ‘‘కెనడాలో జాతి విద్వేష నేరాలు, వర్గ హింస, భారత్ వ్యతిరేక కార్యక్రమాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి అక్కడి భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ విదేశాంగ శాఖ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే ఒట్టావాలోని భారతీయ హైకమిషన్, టొరంటోలో దౌత్య కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది. ఇటీవలి నేరాలపై సమగ్ర విచారణ జరపాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వాట్సాప్‌లో సమాచారం భద్రం కాదా?
వాషింగ్టన్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ మనం అనుకున్నంత భద్రమైనదేమీ కాదని నిపుణులు వ్యాఖ్యానించారు. వాట్సాప్ ద్వారా ఒక వ్యక్తి మరో వ్యక్తికి పంపే సందేశాలు ఎన్‌క్రిప్ట్ అయ్యి గోప్యంగా ఉండటం నిజమేకావచ్చని, అయితే వాట్సాప్ కాల్ డేటా సహా ఇతర సమాచారం దుర్వినియోగం అవుతుండొచ్చని అమెరికాకు చెందిన నిపుణుడు వివేక్ వాధ్వా అంటున్నారు. వాట్సాప్‌ను ఫేస్బుక్ 2014లో కొనేసింది. వినియోగదారులు వాడుతున్న ఫోన్ వివరాలు, గుర్తింపు తదితరాలను ఫేస్‌బుక్‌కు అందజేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించిన విషయాన్ని వివేక్ గుర్తుచేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ చాట్లలో భద్రత లేదని, ఏదేనీ గ్రూప్‌లోని వ్యక్తికి ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరి ఫోన్ నంబర్లు తెలిసిపోతుండటంపై వివేక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగమవ్వడం, గూగుల్ వంటి సంస్థలు యూజర్ల సమాచారాన్ని సేకరించి, నిర్వహిస్తుండటం తదితరాల నేపథ్యంలో కొత్త నిబంధనలు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. -
ఏపీలో మహిళలకు రక్షణ లేదు
-
సర్కారీ దగాఖానాలు
-
'హైదరాబాద్‌లో మాకు భద్రత లేదు'
-
'హైదరాబాద్‌లో మాకు భద్రత లేదు'
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ ట్యాపింగ్ దారణమని, ఫోన్ ట్యాపింగ్ పై మాకు పక్కా సమాచారం ఉందని స్పష్టం చేశారు. సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాలు అమలు కావడంలేదన్నారు. ఈ అంశాలన్నింటిని ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు వివరిస్తామని చెప్పారు. విభజన సమస్యల పరిష్కారానికి మేము ముందుకు వచ్చినా, తెలంగాణ సర్కారు సహకరించడం లేదన్నారు. -
టీడీపీ హయాంలో దళితులకు రక్షణ లేదు
- వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణలేకుండా పోయిందని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జునఅన్నారు. దళితులపై జరిగిన దాడులు, దళిత ఉద్యోగులపై వేధింపులు, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేసిన ఖర్చులన్నింటిపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ కర్నూలు జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడిని టీడీపీ మద్దతుదారులు చంపించారని, అనంతపురం జిల్లా రాప్తాడు, తాడిపత్రి ప్రాంతాల్లో 9 మంది దళితులపై టీడీపీ వాళ్లు దాడి చేశారని చెప్పారు. శ్రీకాకుళంలో ఒక దళిత ఎస్ఐ మరణానికి ఒక ఎమ్మెల్యే, పొన్నూరు పరిధిలోని సొసైటీ సీఈఓ కూచిపూడి గాంధీ ఆత్మహత్యకు మరో ఎమ్మెల్యే కారణమని ఆయన విమర్శించారు. నర్సారావుపేటలో మరో ఎస్సి ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీడీపీ నేతలేనన్నారు. వీటన్నింటిపైనా కేసులు నమోదు చేశారా? ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రభుత్వాన్ని మేరుగ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో అధికారులందరూ తమ వాళ్లే ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం దారుణమన్నారు. దళితుల ఉద్యోగులను కీలక స్థానాల్లో లేకుండా చేస్తున్నారని, వారిని సస్పెండ్ చేయిస్తూ ఇష్టానుసారం వేధింపులకు గురి చేస్తున్నారని నాగార్జున ఆవేదన వ్యక్తం చే శారు. -
శ్రీవారి సన్నిదిలో సెక్యూరిటీ డొల్లతనం
-
సీనియర్ సిటిజన్స్‌కు ఇచ్చే గౌరవం ఇదా??