'హైదరాబాద్లో మాకు భద్రత లేదు'
హైదరాబాద్: హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ ట్యాపింగ్ దారణమని, ఫోన్ ట్యాపింగ్ పై మాకు పక్కా సమాచారం ఉందని స్పష్టం చేశారు. సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్లో గవర్నర్ అధికారాలు అమలు కావడంలేదన్నారు. ఈ అంశాలన్నింటిని ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు వివరిస్తామని చెప్పారు. విభజన సమస్యల పరిష్కారానికి మేము ముందుకు వచ్చినా, తెలంగాణ సర్కారు సహకరించడం లేదన్నారు.