ఆ వాహనం కాలం చెల్లిందే | YS Jagan has no security provided by the government: Andra pradesh | Sakshi
Sakshi News home page

ఆ వాహనం కాలం చెల్లిందే

Published Sun, Jul 21 2024 5:33 AM | Last Updated on Sun, Jul 21 2024 5:33 AM

YS Jagan has no security provided by the government: Andra pradesh

వైఎస్‌ జగన్‌కు ప్రభుత్వం కల్పించిన భద్రతలో డొల్లతనం బహిర్గతం

దాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ

చంద్రబాబు పదేళ్లు ఆ వాహనంలోనే ప్రయాణించినట్లు వెల్లడి

అదే వాహనంలో వేల కిలోమీటర్లు తిరిగినట్లు అంగీకారం

కనీస మరమ్మతులకు నోచుకోని బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కేటాయింపు

పదే పదే మొరాయించడంతో మరో వాహనంలో వెళ్లిన జగన్‌

సాక్షి, అమరావతి: అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబైతే.. దు   ష్ప్రచారానికి మారుపేరు టీడీపీ అనేది మరోసారి నిరూపితమైంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రభుత్వం కలి్పంచిన భద్రతలో బహిర్గతమైన డొల్లతనాన్ని కప్పి­పుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలను అస్త్రాలుగా చేసుకుని, దు్రష్ఫచారం చేసే యత్నంలో టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. వైఎస్‌ జగన్‌కు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం(ఏపీ 39పీ 0014) పాతదేనని అంగీకరించడం ద్వారా తన నకిలీ బతుకును బయపెట్టుకుంది. ఆ వాహనంలో పదేళ్లు చంద్రబాబు ప్రయాణించారని.. రాష్ట్ర వ్యాప్త­ంగా వేల కిలోమీటర్లు తిరిగారని ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)లో ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది.

కాలం చెల్లిన ఆ వాహనానికి కనీసం మరమ్మతులు చేయకుండా వైఎస్‌ జగన్‌కు కేటా­యించింది. వినుకొండలో నడిరో­డ్డుపై ప్రజలందరూ చూస్తు­ండగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్య­కర్త జిలానీ కత్తితో అత్యంత పాశవికంగా నరికి నరికి చంపారు. ఈ నేపథ్యంలో రషీద్‌ కుటు­ంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఆ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలోనే తాడేపల్లి నుంచి విను­కొండకు వైఎస్‌ జగన్‌ బయలుదేరారు. అత్యంత పాతది.. పైగా మరమ్మతులు చేయకపోవడంతో ఆ వాహ­నం పదే పదే మొరాయించింది. దాంతో మరో వాహ­నంలో వైఎస్‌ జగన్‌ వినుకొండ చేరుకున్నారు.

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు జడ్‌ ప్లస్‌ భద్రత ఉంది. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న వారికి ఎవరికైనా కండీషన్‌లో ఉండే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కేటాయించాలన్నది నిబంధన. వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న­ప్పుడు.. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కండీషన్‌లో ఉన్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కేటా­యించింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం తద్భిన్నంగా వైఎస్‌ జగన్‌కు కాలం చెల్లిన బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాన్ని కేటాయించింది. పదేళ్లపాటు లక్షల కిలో మీటర్లు తిరిగిన ఆ వాహనానికి టీడీపీ సర్కార్‌ కనీసం మరమ్మతులు కూడా చేయించలేదు. వైఎస్‌ జగన్‌పై కక్ష సాధింపు చర్య­ల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం ఇలా వ్యవహరించిందని స్పష్టమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement