ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన కాల్ డేటా వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన కాల్ డేటా వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కాల్ డేటా వివరాలు అందజేయాలన్న విజయవాడ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఆదేశాలను సర్వీసు ప్రొవైడర్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు గురువారం విచారణకు వచ్చే అవకాశముంది.
ఓటుకు కోట్లు కేసులో కాల్ డేటా వివరాలు కీలకం కావడంతో ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కాల్ డేటా వివరాలు కోరుతూ సర్వీసు ప్రొవైడర్లకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులిచ్చి మరీ విచారణకు పిలిపించారు. కాల్ డేటా వివరాలు ఇవ్వాలని సర్వీసు ప్రొవైడర్లపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే.