మత్తయ్యకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ:
సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరుసలేం మత్తయ్యను నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన మత్తయ్య క్వాష్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని మత్తయ్యకు సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపి రేవంత్‌రెడ్డి తోపాటు పలువురు టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు.