Jerusalem Mathaiah
-
స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్లు ఆధారాలు
-
బాబే మాస్టర్ మైండ్.. అంతా ఆ గదిలోనే..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పాత్ర మరోసారి స్పష్టమైంది. ఈ కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ఇటీవల ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ మొత్తం వ్యవహారా నికి మాస్టర్‌మైండ్ చంద్రబాబేనని కుండబద్దలుకొట్టాడు. ఈ కుట్ర ఎప్పుడు, ఎలా జరిగింది? తెలంగాణ ప్రభు త్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు మొదలు పెట్టిన ఎమ్మెల్యేల కొను గోలు విషయంలో ఎవరి పాత్ర ఏమిటన్నది పూసగుచ్చినట్లు వివరించాడు. కుట్రకు తెరతీసింది చంద్రబాబు అని, అమలు చేసింది రేవంత్‌రెడ్డి అని, ఇందుకోసం తనకు రూ.50 లక్షలు ఎరవేసి వాడుకున్నారని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మత్తయ్య ఏమి చెప్పాడంటే.. ‘టీడీపీ తెలుగు యువత నాయకుడు జిమ్మీబాబు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. 2015 మే నెలలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ పాల్గొనే ఓ కార్యక్రమానికి జిమ్మీబాబును ఆహ్వానిద్దామని బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లా. అప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాతో ఏదో రహస్య మంత నాలు జరపాలనుకుంటున్నారని జిమ్మీ నాకు చెప్పాడు. ఇదే విషయమై చంద్రబాబు, రేవంత్‌లతో చర్చించేందుకు హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి రావాలని సూచించాడు. చదవండి: (సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం) జిమ్మీ సూచన మేరకు మర్నాడు హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడుకు వెళ్లా. అక్కడ జిమ్మీబాబు మహానాడు వేదిక వెనుకాల ఉన్న గదికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని సూచించారు. తొలుత నేను భయపడ్డా. తప్పని వారించా. కానీ రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణమని, పైగా వారు నాకు గుడ్‌విల్ కింద రూ. 50 లక్షలు లాభం చేకూరుస్తామని మభ్యపెట్టడంతో సరేనన్నా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్సన్ టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తే రూ. 5 కోట్లు, ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ. 3 కోట్లు చెల్లిస్తామన్నారు. ముందుగా రూ. 50 లక్షలు అడ్వాన్సుగా మిగిలినది తరువాత అందజేస్తామన్నారు’ అని మత్తయ్య మత్తయ్య ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆ గదిలోనే.. ‘‘అప్పుడు.. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాతో ఏదో రహస్య మంతనాలు జరపాలనుకుంటున్నారని జిమ్మీ చెప్పాడు. ఇదే విషయమై వారితో చర్చించేందుకు నన్ను మహానాడు వేదిక వెనుక ఉన్న గది వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని సూచించారు. రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణమని, నాకు గుడ్‌విల్ కింద డబ్బులిచ్చి లాభం చేకూరుస్తామని మభ్యపెట్టడంతో సరేనన్నా’’ తొలుత స్టీఫెన్సన్ నమ్మలేదు... ‘నేను మర్నాడు స్టీఫెన్స్న్ ఇంటికి వెళ్లి బోయిగూడలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించా. కార్యక్రమం అనంతరం డీల్ గురించి చెబితే తొలుత స్టీఫెన్సన్ నమ్మలేదు. రేవంత్‌రెడ్డితో మాట్లాడించాలన్నాడు. లాలాగూడకు చెందిన మాల్కం టేలర్, సీతాఫల్‌మండికి చెందిన ఆంథొనీ ద్వారా స్టీఫెన్సన్ను ఒప్పించే ప్రయత్నం చేశా. ఆయన ఒప్పుకోగానే ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి, జిమ్మీబాబులకు టీడీపీ క్రిస్టియన్ సెల్ ఇన్చార్జి హ్యారీ సెబాస్టియన్ ద్వారా తెలియజేశా. తరువాత మరోసారి అతనికి ఫోన్ చేసినప్పుడు రేవంత్, చంద్రబాబులకు సమాచారం ఇచ్చానని, వారు అదే పనిలో ఉన్నారన్నాడు. పని పూర్తికాగానే నీకివ్వాల్సింది ఇచ్చేస్తారని సెబాస్టియన్ సమాధానమిచ్చాడు. మర్నాడు సెబాస్టియన్‌కు మళ్లీ ఫోన్ చేయగా రేవంత్‌రెడ్డి రెండుసార్లు స్టీఫెన్‌సన్‌ని ఆయన నివాసంలో కలిసినట్లు చెప్పాడు. అంతేకాకుండా చంద్రబాబు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో కూడా మాట్లాడాడని చెప్పాడు. దీంతో వెంటనే నేను జిమ్మీబాబుకు కాల్ చేసి నా వాటా ఏమైంది? అని అడిగా. ప్రస్తుతం చంద్రబాబు వేం నరేందర్‌రెడ్డి ద్వారా స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు రూ. 50 లక్షలు సిద్ధం చేస్తున్నారని, అది అవగానే నాకు ఏర్పాటు చేస్తామని చెప్పాడు. మర్నాడు రేవంత్‌రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసిందన్న విషయం టీవీల ద్వారా తెలుసుకున్నా. నన్ను ఏ–4 నిందితుడిగా చూపడంతో రసహ్యంగా జిమ్మీబాబు సాయంతో వెంటనే టీడీపీ ఆఫీసులోకి వెళ్లా. అక్కడ నారా లోకేశ్‌ను కలిశా. నాతో మాట్లాడిన లోకేశ్.. ఏమీ భయపడొద్దన్నాడు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను మేనేజ్ చేస్తానని అభయమిచ్చాడు. వెంటనే విజయవాడ వెళ్లు, అక్కడ టీడీపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడ రక్షణ ఉంటుందని హామీ ఇచ్చాడు’ అని వాంగ్మూలంలో జెరూసలేం మత్తయ్య పేర్కొన్నాడు. చంద్రబాబును కలిసిన మాట వాస్తవమే..! ఈ కేసుకు సంబంధించి జిమ్మీబాబు, మాల్కం టేలర్, ఆంథొనీ, సెబాస్టియన్లు తనకు పూర్వ మిత్రులని, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను పలు పనులపై కలిశానని మత్తయ్య చెప్పుకొచ్చాడు. అలాగే పలు అధికారిక కార్యక్రమాలతోపాటు ఓటుకు నోటు కుట్ర విషయంలోనూ 2015 మే నెలాఖరులో చంద్రబాబును తాను కలిసిన మాట నిజమేనని అంగీకరించాడు. ఈ కేసు విషయంలో మొదటి నుంచి చంద్రబాబుపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. స్టీఫెన్సన్ ఇంట్లో రేవంత్‌రెడ్డి ఆయనకు రూ. 50 లక్షలిస్తూ మభ్యపెడుతుండగా ఆడియో వీడియోలతో సహా ఏసీబీ రికార్డు చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే రేవంత్, వేం నరేందర్‌రెడ్డి, జెరూసలేం మత్తయ్యను విచారించిన ఈడీ... చంద్రబాబు చుట్టూ ఉచ్చుబిగించే ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారప్రీ కుట్రకు సూత్రధారి చంద్రబాబే అని మొదటి నుంచి వస్తున్న ఆరోపణలకు మత్తయ్య వాంగ్మూలంతో మరింత బలం చేకూరినట్లయింది. ఈ నేపథ్యంలో ఈడీ ఎలా ముందుకు వెళ్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
కీలక పరిణామం; బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశాడు. స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు ఇస్తామని అడ్వాన్స్‌గా రూ.50లక్షలు ఇస్తానని.. చంద్రబాబు తనతో చెప్పారని పేర్కొన్నాడు. టీడీపీ మాజీ నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి నోట్లకట్టలతో కనిపించిన వీడియో, ఈ కేసుకు సంబంధించి పలు ఆడియో రికార్డులను సైతం ఈడీ ముందు ధృవీకరించాడు. అదే విధంగా ఓట్లుకు కేసు విషయంలో తనకేమీ కాకుండా, ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హామీ ఇచ్చారని, వెంటనే విజయవాడకు వెళ్లిపోవాలని తనకు సలహా ఇచ్చినట్లు మత్తయ్య ఈడీకి చెప్పాడు.(చదవండి: ‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం) ఈ మేరకు.. ‘‘నేను చాలాకాలంగా చంద్రబాబుకు తెలుసు. టీడీపీకి అనుకూలంగా పనిచేశాను. పలు సందర్భాలలో చంద్రబాబును కలిశాను. అయితే 2015 మహానాడు సందర్భంగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డి నన్ను కలవాలనుకుంటున్నారని.. జిమ్మీబాబు నాకు చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. కీలకమైన విషయం మాట్లాడటానికి వాళ్లిద్దరు నన్ను రమ్మన్నారు. దీంతో హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడుకు వెళ్లాను. జిమ్మీబాబు నన్ను చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లాడు. మహానాడు జరుగుతుండగానే చంద్రబాబునాయుడిని కలిశాను. అక్కడే ఆయన సమక్షంలోనే రేవంత్‌రెడ్డి నాతో ఈ డీల్ మాట్లాడారు. స్టీఫెన్సన్ టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేవిధంగా ఒప్పించే బాధ్యత నాకు అప్పజెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే.. స్టీఫెన్సన్కు రూ.5కోట్లు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్‌రెడ్డి చెప్పారు. ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ.3కోట్లు ఇస్తామని చెప్పమన్నారు. ఈ ఒప్పందం కుదిరిస్తే నాకు రూ.50లక్షలు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్ చెప్పాడు. డీల్‌కు స్టీఫెన్సన్ ఒప్పుకుంటే.. ముందుగా రూ.50లక్షలు అడ్వాన్స్ ఇస్తామని చంద్రబాబే చెప్పారు. ఈ విషయంలో నేను వెళ్లి స్టీఫెన్‌సెన్‌తో మాట్లాడాలని నాకు చెప్పారు. అతడిని ఒప్పిస్తే నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నేను వెళ్లి స్టీఫెన్‌సన్‌తో చర్చించాను. వాళ్లిద్దరు ఆఫర్ చేసిన డీల్ గురించి స్టీఫెన్సన్కు చెప్పాను, అయితే తాను రేవంత్‌రెడ్డితో నేరుగా కలుస్తానని స్టీఫెన్సన్ నాతో చెప్పారు. ఈ విషయం రేవంత్‌రెడ్డికి చెప్పాలని సెబాస్టియన్‌కు చెప్పాను. చంద్రబాబు ఆదేశాలతో రేవంత్‌రెడ్డి డబ్బులతో స్టీఫెన్సన్ దగ్గరు వెళ్లారు. ఆ తరువాత రేవంత్‌రెడ్డి నేరుగా వెళ్లి స్టీఫెన్సన్కు బ్యాగులో డబ్బులు ఇచ్చారు. రేవంత్‌రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్హాండెడ్గా అరెస్టు చేశారు. రేవంత్‌రెడ్డి అరెస్టు అయిన రెండో రోజు రహస్యంగా బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లాను. హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్‌ను కలిశాను. నీకేమీ కాదని ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడకు వెళ్లిపొమ్మని నాకు సూచించారు’’ అని మత్తయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకూడదు
-
కేసీఆర్ నన్ను ప్రలోభపెట్టారు..
విజయవాడ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జరుసలెం మత్తయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని అన్నారు. మత్తయ్య శనివారం విజయవాడలో మాట్లాడుతూ..ఈ కేసుపై ఎన్నికలకు ముందే దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో తనను బలవంతంగా ఇరికించారని, అంతేకాకుండా రాజకీయంగా తనకు న్యాయం జరగలేదని అన్నారు. హైకోర్టు కూడా తనను నిర్దోషిగా పేర్కొందన్న ఆయన.. సుప్రీంకోర్టులో తాను వేసిన కేసులో ఉదయసింహ ఎలా ఇంప్లీడ్ అవుతారని ప్రశ్నించారు. అయితే ఉదయసింహాతో పాటు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అవ్వాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేశారని మత్తయ్య ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసును సీబీఐ, ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఈ నెల 11వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. -
చిత్తశుద్ధి ఉంటే బాబును దోషిగా నిరూపించు
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు తనను బలిపశువుని చేస్తున్నారని, పావుగా వాడుకుంటున్నారని ఈ కేసులో ఏ–5 ముద్దాయి జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడింది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. మంగళవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి, దమ్మూధైర్యం ఉంటే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి దోషిగా నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో తనను ఏ–5గా చేర్చడం బాధ కలిగించిందన్నారు. తాను సుప్రీంకోర్టులో వేసిన అప్రూవ్ పిటిషన్‌ను కూడా అణగదొక్కే కుట్రలు ఇరు ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు. ‘‘గుంటూరు, విజయవాడ వెళ్లినప్పుడు నాకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీనిపై అక్కడి పోలీసులకు చెబితే వాళ్లు స్పందించారు. అక్కడి పీఎస్‌లో కేసు పెట్టించారు. ‘నిన్ను బెదిరించినట్లు కేసీఆర్‌పై కేసు పెట్టు’అని ఒత్తిడి చేశారు. ఏపీ ప్రభుత్వం, అధికారులు నన్ను ఆర్నెల్లపాటు అండర్‌గ్రౌండ్‌లో ఉంచి వారికి అనుకూలంగా వాడుకున్నారు’’అని మత్తయ్య పేర్కొన్నారు. -
‘ఓటుకు కోట్లు’ కేసులో వాస్తవాలన్నీ చెబుతా
-
‘ఓటుకు కోట్లు’ కేసులో వాస్తవాలన్నీ చెబుతా
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలన్నీ చెబుతానని, ఈ కేసులో తన వాదనలు తానే వినిపించుకుంటానని, ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ జెరుసలేం మత్తయ్య శుక్రవారం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఇన్ పర్సన్ (న్యాయవాదితో సంబంధం లేకుండా)గా ఈ కేసులో హాజరయ్యేందుకు అనుమతి మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను ఈ పిటిషన్ దాఖలు చేయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. వారిద్దరి ప్రతీకారాలకు వాడుకున్నారు... ‘‘నాతో మాట్లాడిన ఏపీ టీడీపీ ప్రభుత్వం, తెలం గాణ పోలీసులు గానీ ఈ కేసు గురించి సమాచారం ఇవ్వలేదు. మీడియాలో తెలుసుకుని ఒకవేళ వాయి దాకు రాకపోతే నాకు అరెస్టు వారెంటు జారీ అవు తుందేమోనని వచ్చా. హైకోర్టులో కేసు ఉన్నప్పుడు గంట గంటకు, రోజు రోజుకు వచ్చి అప్డేట్స్ అన్నీ ఇచ్చి హైకోర్టులో నా కేసు క్వాష్ అయ్యేవరకు నా వెంబడి ఉన్నవాళ్లు ఈరోజు సుప్రీంకోర్టుకు వస్తే నా వాయిదా డేట్ గురించి కూడా చెప్పడం లేదు. వారెంట్ జారీ అయితే నేను, నా కుటుంబ సభ్యులు జైలు పాలు కావడానికి ఏమైనా కుట్ర జరుగుతుందా అని ఆందోళనగా ఉంది. చంద్రబాబు, కేసీఆర్ ఏకమై చేస్తున్నారా అని భయంగా కూడా ఉంది. పార్టీ ఇన్ పర్సన్‌గా నేను హాజరై జరిగిన వాస్తవాలన్నీ చెబుతానని, నాకు జరిగిన నష్టాన్ని చెబుతానని, వారిద్దరూ నన్ను ఏ రకంగా వారి ప్రతీకారాలకు వాడుకున్నదీ, ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టించుకుని నన్ను ఎలా వేదనకు గురిచేస్తున్నారో చెబుతానని ప్రధాన న్యాయమూర్తికి తెలియచేశాను. ఈ కేసులో నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటానని, నాకు, నా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని వేడుకున్నా..’’అని చెప్పారు. ఏపీ పోలీసులు నన్ను సైలెంట్‌గా ఉండమన్నారు.. ‘‘ఓటుకు కోట్లు కేసులో రేవంత్ డబ్బులతో పట్టుబడ్డ నాటి నుంచి మొన్నటివరకు.. అంటే గత 2017 జూన్, జూలై వరకు వాళ్ల లాయర్లు నాతో మాట్లాడారు. ఆరు నెలలుగా ఏ సమాచారం ఇవ్వడం లేదు. 23వ తేదీన వాయిదా ఉందని తెలుసుకుని వచ్చా. వాయిదాకు రాకపోతే ఒక ముద్దాయికి శిక్ష పడుతుందని, వారెంట్ జారీ అవుతుందని వచ్చాను. అప్పుడు కేసులో పట్టుబడ్డవాళ్లు ఒక వర్గం వాళ్లు. ఒక వర్గం వాళ్లు పెట్టిన సాక్ష్యం చెల్లదు కాబట్టి.. తటస్థంగా ఉన్న ఒకరి సాక్ష్యం తీసుకోవాలని చెప్పి నా పేరు పెట్టారని తెలంగాణ ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ చెప్పారు. నన్ను సాక్షిగా తీసుకుని వాళ్లను ఇరికించాలని కుట్రపన్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. నాకు సంబంధం లేదని హైకోర్టు జడ్జి క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లు పన్నిన పన్నాగానికి నేను లొంగలేదని కేటీఆర్ డ్రైవర్, గన్‌మెన్ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించారు. క్లాక్‌టవర్ దగ్గరికి రా.. వచ్చి మాట్లాడు అని ఫోన్ చేశారు. కేసున్నప్పుడు ముగ్గురు దొరికారు. వాళ్లపై కేసు ప్రూవ్ కావాలంటే తటస్థంగా ఉన్నవాడిగా నన్ను పెట్టాలని చూశారు. ఆ సీన్లో నేను లేను. డబ్బులు ఇచ్చినప్పుడు నేను లేను. నేను లొంగకపోవడంతో నన్ను తిట్టారు. నేను విజయవాడకు పోయాక నాకు ఫోన్ వచ్చింది. ఈ ఫోన్‌పై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కాల్‌డేటా తీశారు. ఆ ఫోన్ కాల్స్ కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్ ఫోన్ల నుంచి వచ్చాయని తేలింది. దీంతో ఏపీ పోలీసులు వాళ్లకు నోటీసులు ఇచ్చి తెలంగాణ క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు. ఆ ఆధారాల కోసం వాళ్లు కేసు పెట్టించుకున్నారు. వీళ్ల కోసం వీళ్లు కేసు పెట్టించుకున్నారు. హైకోర్టు వరకు బాగానే ఉన్నారు. నన్ను వేధించారు కదా వాళ్లపై కేసు పెట్టరా అని ఏపీ పోలీసులను అడిగాను. వాళ్లు నన్ను సైలెంట్‌గా ఉండమన్నారు. నా క్రైస్తవ సమస్యల మీద నేనేదో పోరాటం చేసుకుంటుంటే సుప్రీంకోర్టుకు వచ్చారు. అప్పీలుకు వచ్చినప్పుడు హైకోర్టు వరకు ఫాలో అప్ చేస్తున్నవాళ్లు ఇప్పుడు నాకు సమాధానం చెప్పడం లేదు. ఇంతకుముందు ఇంటెలిజెన్స్ వాళ్లు కూడా సమాచారం ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఇవ్వడం లేదు. అందుకే నేను భయపడి ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాను. వ్యక్తిగతంగా హాజరై వాదనలు వినిపిస్తానని వేడుకున్నా’’ అని ఆయన వివరించారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరా... అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ... రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కూడా ప్రధాన న్యాయమూర్తిని కోరానని తెలిపారు. సీబీఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని వివరించారు. ఈ కేసులో తనకు సమాచారం ఇచ్చే వారెవ్వరూ లేకపోవడంతో వాస్తవాలను తెలుసుకునేందుకు తానే స్వయంగా అప్పు చేసి మరీ ఢిల్లీకి వచ్చానని చెప్పారు. ఇదీ కేసు... 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే లంచంగా రూ.ఐదు కోట్లు ఇవ్వడానికి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారంటూ నామినే టెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో రేవంత్‌రెడ్డి, అనుసంధానకర్త జెరుసలేం మత్త య్య, సెబాస్టియన్ తదితరులను నిందితు లుగా పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మత్తయ్య 2015 జూన్ 17న హైకోర్టులో పిటి షన్ దాఖలు చేయగా.. మత్తయ్య అరెస్ట్‌పై స్టే విధించింది. ఆ తరువాత తుది విచారణ జరిపి ఓటుకు కోట్లు కేసులో మత్తయ్యపై ఏసీబీ అధి కారులు నమోదు చేసిన కేసును కొట్టేస్తూ హైకో ర్టు 2016 జూన్ 3న తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ఏసీబీ అధికారులు 2016లో సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు వెబ్సైట్ ప్రకా రం పిటిషన్ ఏప్రిల్ 8న విచారణకు రానున్నది. -
ఆబద్దం ఆడను, నిజాన్ని బయటపెడతా..
న్యూఢిల్లీ : త్వరలోనే వాస్తవాలను బయటపెడతానని ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడుగా ఉన్న జెరూసలెం మత్తయ్య తెలిపారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. కాగా ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ కీలక నిందితుడిగా ఆరోపిస్తున్న జెరూసలెం మత్తయ్య ప్రమేయానికి సంబంధించి సరైన సాక్ష్యాలు లేవని పేర్కొన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆయన పేరును చార్జిషీటు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు నిర్ణయంతో విభేదించిన తెలంగాణ ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌కు కౌంటర్ దాఖలుకు తనకు కొంత సమయం కావాలని మత్తయ్య ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మత్తయ్య తరఫు న్యాయవాది అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా మత్తయ్య ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ప్రాణభయంతో ఢిల్లీ వచ్చానని, అబద్ధం ఆడనని, నిజాన్ని త్వరలో బయటపెడతానని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ద్వారా తాను నమ్మిన దేవుడు న్యాయం చేస్తాడని మత్తయ్య పేర్కొన్నారు. తనకు ప్రాణహాని జరిగితే మొదటి ముద్దాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని , అలాగే కేసీఆర్ కూడా బాధ్యుడేనని ఆయన వ్యాఖ్యానించారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు తనను అవసరానికి వాడుకున్నారని, నీకేం కాదు..తాను ఉన్నానని చెప్పారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని మత్తయ్య ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో తాను అమాయకుడినని ఆయన తెలిపారు. తనను ఎ4 గా చిత్రించి, దేశ ప్రధాన న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టేందుకు ఆంధ్రా,తెలంగాణ ప్రభుత్వాలు, తెలుగుదేశం, టిఆర్ఎస్లు ఆడుతున్న చదరంగంలో జెరుసలెం మత్తయ్య అను నన్ను బలిపశువును చేసి, ఇరు రాష్ట్రాలలో నా కులస్థులకు, మతస్థులకు అర్దం కాని చిక్కుల్లో పడేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బాగోతం , చంద్రశేఖరరావు చలోక్తులు, రాజకీయాలకే పరిమితం కాకుండా, తనలాంటి సామాన్యుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ముద్దాయిగా చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు జోలపడి నీకేం కాదు.. అని ధైర్యం చెప్పినట్లు నటించారని, ఇరువురు తన పరిస్థితిని అగమ్యగోచరం చేశారని, దీనిని ప్రజలే తీర్పు చెప్పాలని ఆయన అన్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని అన్నారు. సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉందని మత్తయ్య అన్నారు. ప్రజాకోర్టులో నిలబడి తనకు న్యాయం జరిగేవరకూ పోరాడతానని తెలిపారు. తనకు, కుటుంబసభ్యులకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ జాతీయ మానవహక్కుల కమిషన్ లో పిటిషన్ వేశానని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టులో కౌంటర్ వేశాక తనలో దాగిన నిజాలు పత్రికా ముఖంగా తెలియచేస్తానని మత్తయ్య చెప్పారు. -
మత్తయ్యకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరుసలేం మత్తయ్యను నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన మత్తయ్య క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని మత్తయ్యకు సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపి రేవంత్‌రెడ్డి తోపాటు పలువురు టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు. -
హైకోర్టులో మత్తయ్యకు ఊరట
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరుసలేం మత్తయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరుసలేం మత్తయ్య దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై విచారణ పూర్తయింది. మత్తయ్యపై ఉన్న ఆరోపణలను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. కాగా కేసు విచారణ నుంచి తనను తప్పించాలని ఆయన పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపి రేవంత్‌రెడ్డి తోపాటు పలువురు టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన మత్తయ్య
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడుగా ఉన్న జెరూసలెం మత్తయ్య సోమవారం... తనకు రక్షణ కల్పించాలంటూ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. సోమవారం ఓటుకు కోట్లు కేసు విచారణ సందర్భంగా ఈ నెల 20 వ తేదీలోపు మత్తయ్య అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఛార్జిషీటు కాపీని హైకోర్టుకు సమర్పించాలని తెలిపింది. కాగా కేసు తదుపరి విచారణను వచ్చే నెల 2 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.