
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు తనను బలిపశువుని చేస్తున్నారని, పావుగా వాడుకుంటున్నారని ఈ కేసులో ఏ–5 ముద్దాయి జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడింది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. మంగళవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి, దమ్మూధైర్యం ఉంటే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి దోషిగా నిరూపించాలని డిమాండ్ చేశారు.
ఈ కేసులో తనను ఏ–5గా చేర్చడం బాధ కలిగించిందన్నారు. తాను సుప్రీంకోర్టులో వేసిన అప్రూవ్ పిటిషన్‌ను కూడా అణగదొక్కే కుట్రలు ఇరు ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు. ‘‘గుంటూరు, విజయవాడ వెళ్లినప్పుడు నాకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీనిపై అక్కడి పోలీసులకు చెబితే వాళ్లు స్పందించారు. అక్కడి పీఎస్‌లో కేసు పెట్టించారు. ‘నిన్ను బెదిరించినట్లు కేసీఆర్‌పై కేసు పెట్టు’అని ఒత్తిడి చేశారు. ఏపీ ప్రభుత్వం, అధికారులు నన్ను ఆర్నెల్లపాటు అండర్‌గ్రౌండ్‌లో ఉంచి వారికి అనుకూలంగా వాడుకున్నారు’’అని మత్తయ్య పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment