హైకోర్టులో మత్తయ్యకు ఊరట | Jerusalem Mathaiah gets relief from Cash for Vote case in high court | Sakshi
Sakshi News home page

హైకోర్టులో మత్తయ్యకు ఊరట

Published Fri, Jun 3 2016 2:54 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

హైకోర్టులో మత్తయ్యకు ఊరట - Sakshi

హైకోర్టులో మత్తయ్యకు ఊరట

హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరుసలేం మత్తయ్యకు హైకోర్టులో ఊరట లభించింది.  తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరుసలేం మత్తయ్య దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్పై విచారణ పూర్తయింది. మత్తయ్యపై ఉన్న ఆరోపణలను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది.

కాగా కేసు విచారణ నుంచి తనను తప్పించాలని ఆయన పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపి రేవంత్‌రెడ్డి తోపాటు పలువురు టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement