సాక్షి, హైదరాబాద్ : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై మహారాష్ట్ర పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. దీంతో ఏ క్షణమైన పూణే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని పుణేకు ఆయనను తరలించేందుకు జారీ అయిన ట్రాన్సిట్ వారెంట్ అమలును ఇటీవల తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ గడవు ముగిసేలోపు పూణే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాగా గృహనిర్భందంలో ఉన్న వరవరరావుకు చికిత్స ఉందించాలని హైకోర్టు అదేశించినా.. ఇప్పటివరకు చికిత్స అందలేదని ఆయన తరుఫున న్యాయవాది న్యాయస్థానంలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment