
మత్తయ్య క్వాష్ పిటిషన్ విచారణ 16కు వాయిదా
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో తన పేరును తొలగించాల్సిందిగా మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్ తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి.
మత్తయ్య వేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని ఏసీబీ తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారని కోర్టుకు తెలియజేశారు. కౌంటర్ దాఖలలకు మత్తయ్య తరపు న్యాయవాది గడువు కోరారు. హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య ఎ-4 నిందితుడిగా ఉన్నాడు.