హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఎ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య తన పేరును ఈ కేసు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. గురువారం మత్తయ్య హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుతో తనకెలాంటి ప్రమేయం లేదని మత్తయ్య హైకోర్టుకు విన్నవించాడు.
ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య ఏ4 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహాలను ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మత్తయ్య ఆంధ్రప్రదేశ్కు వెళ్లి విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఫిర్యాదు చేశాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎప్పటినుంచో అజ్ఞాతంలో ఉంటున్న మత్తయ్య.. ఈ రోజును హైకోర్టును ఆశ్రయించాడు.
హైకోర్టులో మత్తయ్య క్వాష్ పిటిషన్
Published Thu, Jun 18 2015 2:59 PM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM
Advertisement