mathaiah
-
ఏపీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు : మత్తయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓటుకు కోట్లు’కేసులో జెరూసలేం మత్తయ్య పేరును తొలగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. పోలీసు రక్షణ కోరుతూ తెలంగాణ డీజీపీకి మత్తయ్య దరఖాస్తు చేసుకుంటారని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఏపీ సీఎం చంద్రబాబు బృందం కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుల పేర్ల నుంచి మత్తయ్యను హైకోర్టు తొలగించడాన్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 2016లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యను ఆదేశిస్తూ 2017 జనవరి 16న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. తొలుత మత్తయ్య తరఫున తాను వకాల్తా పుచ్చుకున్నానని, 2 వారాల సమయం కావాలని న్యాయవాది సుప్రియ నివేదించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున హరీన్ పి.రావల్ వాదనలు వినిపిస్తూ అనేక కారణాలతో తరచూ వాయిదా అడుగుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తదుపరి తాను తప్పనిసరిగా కౌంటర్ దాఖలు చేయడంతోపాటు వాదనలు వినిపిస్తానని న్యాయవాది నివేదించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. నన్ను పోలీసులు అడ్డుకున్నారు విచారణ ముగిసిన కొద్దిసేపటికి మత్తయ్య కోర్టులోకి వచ్చారు. తనను కోర్టులోకి రానివ్వకుండా ఏపీ పోలీసులు అడ్డుకున్నారని, తన గుర్తింపు కార్డు లాక్కున్నారని, అందుకే లోనికి తొందరగా రాలేకపోయానని, తన కేసులో ఎవరినీ న్యాయవాదిగా పెట్టలేదని, తానే వాదిస్తానని కోరారు. ‘నాకు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదు. ఈ కేసులో నా పాత్ర లేదు. దానిపై నేనే స్వయంగా వాదనలు వినిపించుకుంటానని న్యాయస్థానానికి విన్నవించుకున్నాను’అని తెలుగులో నివేదించారు. అంతకుముందు మత్తయ్య తరపున హాజరైన న్యాయవాదిని జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రశ్నించగా పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్ ఆన్ రికార్డ్ గుంటూరు ప్రభాకర్ ‘ఇదిగోండి.. నిన్న తానే నా చాంబర్‌కు వచ్చి మత్తయ్య సంతకం చేసి ఇచ్చిన కాగితం. నన్నే వాదించమన్నారు’అంటూ నివేదించారు. ‘నేను ఎవరినీ కలవలేదు. నేను అడ్వొకేట్‌ను పెట్టుకునే అవకాశం ఉంటే నేనే పార్టీ ఇన్ పర్సన్‌గా ఎలా వాదించుకుంటానని దరఖాస్తు పెట్టుకుంటాను’అని మత్తయ్య వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ముందుగా వచ్చిన న్యాయవాది వకాల్తాను ధర్మాసనం రద్దు చేసింది. నాకు రక్షణ లేదు.. తాను వాదనలు వినిపించేందుకు కోర్టులోకి వస్తుంటే ఏపీ పోలీసులు అడ్డుకున్నారని, తనకు రక్షణ కావాలని, హైదరాబాద్‌లో కూడా రక్షణ లేదని కోర్టుకు విన్నవించారు. అయితే ఇక్కడ పోలీసులు ఎందుకు ఉంటారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాది హరీన్ రావల్ మాట్లాడుతూ.. ‘ఏపీ పోలీసులు అడ్డుకున్నారని మత్తయ్య చెబుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది. దీనిపై విచారణకు ఆదేశించండి. న్యాయస్థానానికి రాకుండా ఆపడం ఎంతవరకు సమంజసం’అని పేర్కొన్నారు. నాతో ఫిర్యాదు చేయించినవారెవరో చెబుతా: మత్తయ్య విచారణ అనంతరం మత్తయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజకీయ ఎత్తుగడలకు నేను బలయ్యాను. కొన్ని ప్రభుత్వాలు, కొన్ని పార్టీలు వాడుకున్నాయి. ఒక పార్టీలో ఉన్న క్రైస్తవ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ఇంకో పార్టీలోని క్రైస్తవులను బలి పశువులుగా చేసేందుకు కుట్ర చేశారు. మమ్మల్ని పావులుగా వాడుకుంటున్న టీడీపీ పార్టీ గానీ, టీఆర్ఎస్లోని క్రైస్తవులకు గుర్తింపు లేకుండా పోయింది. ఇద్దరు చేసిన తప్పులను, రాజకీయ పార్టీల కుట్రలను ధర్మాసనం ముందు చెబుతా. ఇప్పటికీ నా వెంట పోలీసులు ఫాలో అవుతున్నారు’అని వివరించారు. ‘నాపై తప్పుడు ఆరోపణలు పెట్టారు. ఓటుకు కోట్లు కేసులో డబ్బులు ఇచ్చింది ఒక పార్టీ.. తీసుకున్నది మరో పార్టీ.. నాపై ఎందుకు కేసు పెట్టారు. ఎవరు నా పేరు పెట్టాలని ఒత్తిడి చేశారు? టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎవరు నాతో ఫిర్యాదు చేయించారు.. అన్నీ న్యాయస్థానానికి చెబుతా’అని వివరించారు. చర్యలు తీవ్రంగా ఉంటాయి: ధర్మాసనం కోర్టుకు రాకుండా అడ్డుకోవడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే జోక్యం చేసుకుంటూ ‘మీ రాజకీయాలు ఏమున్నాయో మాకు తెలియదు. కానీ పోలీసులు ఇలా సుప్రీంకోర్టుకు రాకుండా అడ్డుకోవడం చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఎవరైనా నిరోధించినట్లు తేలితే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం’అని పేర్కొన్నారు. మత్తయ్యకు తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను నవంబర్ 22కు వాయిదావేసింది. -
మత్తయ్యకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరుసలేం మత్తయ్యను నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన మత్తయ్య క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని మత్తయ్యకు సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపి రేవంత్‌రెడ్డి తోపాటు పలువురు టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు. -
హైకోర్టులో మత్తయ్యకు ఊరట
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరుసలేం మత్తయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరుసలేం మత్తయ్య దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై విచారణ పూర్తయింది. మత్తయ్యపై ఉన్న ఆరోపణలను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. కాగా కేసు విచారణ నుంచి తనను తప్పించాలని ఆయన పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపి రేవంత్‌రెడ్డి తోపాటు పలువురు టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు. -
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మత్తయ్య
గుంటూరు: ఉభయ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడు మత్తయ్య అనారోగ్యంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం అతనిని పలు సంఘాల నాయకులు పరామర్శించి, ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణా ఎమ్ఎల్సి ఎన్నికల్లో సీట్ల కొనుగోలుకు కోట్ల రూపాయలు డీల్ కుదురుస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా టీడీపీ నేతలు చిక్కిన విషయం విధితమే. ఆ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్తయ్య నరసరావుపేట మీదుగా 2 రోజుల క్రితం ప్రయాణిస్తూ అస్వస్తతకు లోనయ్యాడు. సన్నిహితులు అతన్ని పట్టణంలోని మదర్‌థెరీసా మల్టీ స్పెషాలిటీ హాస్పటల్లో చేర్చారు. అప్పటి నుంచి అతను అక్కడే చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య ముస్లిం క్రైస్తవ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణా ఏసీబీ మత్తయ్యకు నోటీసులు ఇచ్చిన కారణంగా ఆందోళన చెందిన అతను హైబీపీ, షుగర్, హార్ట్ ప్రెజర్‌తో అస్వస్థతకు గురయ్యాడన్నారు. మత్తయ్యకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే తెలంగాణా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. కేసీఆర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, దళితనాయకుడు మత్తయ్యపై పెట్టిన కేసును బేషరతుగా ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మత్తయ్య ఆరోగ్య విషయంపై స్పందించి సత్వరమే వైద్యసహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
మత్తయ్య క్వాష్ పిటిషన్ విచారణ 16కు వాయిదా
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో తన పేరును తొలగించాల్సిందిగా మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్ తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. మత్తయ్య వేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని ఏసీబీ తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని కోర్టుకు తెలియజేశారు. కౌంటర్ దాఖలలకు మత్తయ్య తరపు న్యాయవాది గడువు కోరారు. హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య ఎ-4 నిందితుడిగా ఉన్నాడు. -
‘ఓటుకు నోట్లు’లో ‘బలిదానాలు’
పేద, బడుగువర్గాలు, దళిత బహుజన, మైనారిటీలు ఈ పరిణామాల్ని శ్రద్ధగా గమనించాలి. ‘మేల్కోండి, మేల్కోండి, మేల్కోండి’ అనీ ‘చైతన్యం పొందండి, చైతన్యం పొందండి, చైతన్యం పొందండీ’ అనీ మూడేసిమార్లు అంబేడ్కర్ ఎందుకు ఆదేశించవలసి వచ్చిందో ఆలోచించవలసిన అవసరం ఉంది. ‘వైస్రాయి హోటల్’ తరహా మోసాల నుంచీ, ‘ఫామ్‌హౌస్’ కుట్రల నుంచీ దళిత ప్రతినిధులూ, మైనారిటీ, బహుజన వర్గాల ప్రతినిధులూ బయటపడాలి. రెండోమాట ‘ఓటుకు-నోట్లులో’ కుంభకోణాన్ని ఛేదించడంలో అవినీతివ్యతిరేక సాధి కార బృందం (ఏసీబీ) ఒకవైపున ముందుకు సాగుతున్నప్పటికీ, అవినీతి కేసు లలో శిక్షలుపడిన వారి శాతం మాత్రం ఘోరం! గడచిన మూడేళ్లలోనే ‘ఏసీబీ’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 344 కేసులు నమోదు చేసింది. అంతే-కథ కం చికి వెళ్లింది, ఏసీబీ ఇంటికి చేరింది’. -టైమ్స్ ఆఫ్ ఇండియా (18-6-2015) ‘ఓటుకు-నోట్లు’ తాజా కేసులు కూడా ఉభయ రాష్ట్రాల ప్రజల ప్రయోజ నాలకన్నా ఇద్దరు ప్రధాన నేతల, వారి రాజకీయపక్షాల స్వార్థ ప్రయోజనాలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. విభజనానంతరం తమ అధికారం స్థిరపడ్డానికి పాలకపక్షాలు చేస్తున్న వ్యూహరచనలో బలి పశువులు అవుతున్నది- బడుగు బలహీనవర్గాల వారేనన్నది సత్యం! ఈ కేసులోని నిందితులు నలుగురిలో ఇద్దరు ఆంగ్లో-ఇండియన్లు, ఇద్దరు దళిత క్రిస్టియన్లు. వీరిలో ఒక సాక్షిని ఒక రాష్ట్ర నేత తన పంచన చేర్చుకోగా, మరొక సాక్షిని మరొక నేత తన పంచను చేర్చుకున్నాడు! ఆ గుట్టుమట్టుల చాటున పెద్దలు తలలు దాచుకుంటున్నారు. ఈ రోజు దాకా కేసులకు సంబంధించిన ‘అతిరహస్యం’ ప్రజలకు ‘చెవి పోటు’గా మారింది! కానీ అవినీతి రాజకీయాల నిర్వహణలో ఆరితేరిన ఈ నేతల మధ్య కేంద్ర ప్రభుత్వ ‘పెద్దల’ జోక్యంతోనో లేదా మధ్యవర్తిత్వంతోనో రాజీ కుదిరినా కుదరవచ్చు. పదవుల రక్షణార్థం ఈ పరిణామం చోటు చేసు కోవచ్చునని కొన్ని పత్రికలూ, కొందరు నాయకులూ ఇప్పటికే ప్రకటించారు. ఎటూ తేలకుండా (రెండు రాష్ట్రాల నేతల మధ్య)సాగుతున్న ఈ అధికార స్థాయి అంతర్నాటకంలో- ఇలాంటి వ్యవహారాలలో వాస్తవాలను వెలికి తీయడానికి తోడ్పడవలసిన ఫోరెన్సిక్ లేబొరేటరీలో కూడా ప్రభుత్వాలు పెట్టే కేసుల్లో ఎలాంటి ప్రయోగాలకు అవకాశం ఉంటుందో షాజహాన్‌పూర్ (యూపీ)లో జరిగిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు జాగేంద్రసింగ్ హత్యతో వెల్ల డైంది. మంత్రి రామమూర్తి వర్మ ఇందుకు కారకుడని జాగేంద్రసింగ్ మరణ వాంగ్మూలంలో చెప్పాడు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు సమర్పించిన ఫోరె న్సిక్ నివేదిక వర్మను నిర్దోషిగా ప్రకటించడానికి సాహసించింది! ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అంగన్వాడి కార్మికురాలు కూడా పోలీసులే జర్నలిస్టును కాల్చి చంపారని చెప్పింది. కానీ జర్నలిస్టే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసు కున్నాడని పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్టును సిద్ధం చేశారు! జర్నలిస్టు కుటుం బానికి ‘న్యాయం’ చేస్తాననీ, రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లిస్తాననీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించిన 24 గంటల్లోనే వేరే కథకు కాళ్లువచ్చాయి! ‘ఓటుకు నోట్లు’ కేసులో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిత్ర మైన పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది! ఈ కేసు వివరా లను (ఆడియో, వీడియోలు, టేపులూ, పోలీసుల నివేదిక, కోర్టుకు సమర్పిం చిన అభియోగాల తబిసీళ్లు వగైరా) తనకు వెంటనే అందజేయాలనీ, ఎన్నికల సందర్భంగా జరిగే అవినీతికి సంబంధించిన ఆరోపణలపై విచారణ బాధ్యత తన పరిధిలోకి వస్తుందనీ ఎన్నికల కమిషన్ జూన్ 1వ తేదీన ప్రకటించింది. కానీ ఆ విషయం ‘ది హిందూ’ వెల్లడించేదాకా ఇతర మీడియా మభ్యపెట్టడం విశేషం! ఎప్పటికప్పుడు ‘కీలక సాక్ష్యం’ దొరికిందని చెప్పడమే కాని, అదెంత ‘కీలక’మో తెలుసుకుందామన్న ఆసక్తితో ఉన్న ప్రజలకు మాత్రం అది అంద డం లేదు. ఎన్నికల కమిషన్ జూన్ 1వ తేదీన ఏసీబీని ఆదేశించిన లేఖను స్థానిక పాలకులు నిర్లక్ష్యం చేసినందుననే 24 రోజుల తర్వాత (జూన్ 25న) మరోసారి రిమైండర్ (జ్ఞాపకం) ఇవ్వవలసి రావటం కేసులు ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయో తెలుస్తోంది. అంతేగాదు, అసలు వాస్తవాలు తెలుసుకోవడానికి హార్డ్‌డిస్క్, ఇతర కీలక సాంకేతిక పరికరాలు కూడా తమకు ట్రాన్స్క్రెబింగ్కు విధిగా అవసరమనీ ఫోరెన్సిక్ అధికారులు కోరగా, ‘ఆ బాదరబందీ మీకెందుకు, ఆ పనిని మేమే చూస్తాంలెండి’ అని ఏసీబీ సమాధానమిచ్చినట్టు కూడా ‘ది హిందూ’ సూచనప్రాయంగా వెల్లడించింది. అటూ ఇటూ కక్కుర్తే లోకంలో దొరికినవాడు ‘దొంగ’, దొరకనివాడు ‘దొర’! ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం ఒక ప్రాంతంలోని అధికారపక్షం నేతలు ‘ఓటుకు నోట్ల’తో కక్కుర్తిప డ్డారు. నిజమే. ‘ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన’ వేసుకున్నట్టుగా మరో రాష్ట్రం శాసనసభలో 63 మంది సభ్యులే ఉన్నప్పటికీ, మండలిలో ఐదు సీట్ల కోసం అక్కడి అధికారపక్షం చూపించిన కక్కుర్తి ఎలాంటిది? 63 సంఖ్యను 85కి దేకించాలి కాబట్టి, అవసరమైన 22 మంది ప్రతిపక్షాల (కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ వగైరా) సభ్యులకు ఎరవేయడం అందుకే. అంటే అధికారం నిలబెట్టుకోవడానికి ఏ సంపన్న వర్గ రాజకీయ పక్షమూ సిగ్గూ, లజ్జాభిమా నాలను త్యాగం చేయడానికి వెరవదని మరొకసారి ప్రజల అనుభవంలోకి వచ్చింది! చివరికి - ఏ పార్టీ గుర్తుతో ఎన్నికైనారో ఆ పార్టీల ‘బకెట్’ను కాస్తా తన్నేసి, అధికారపక్షంలో భాగమవుతున్నవారి గుర్తింపును రద్దు చేయాల్సిన లెజిస్లేచర్ సభాపతులు కూడా నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. విచార ణాధికారులు అభియోగాలు మోపిన తరువాత, నిందితుల్ని అరెస్టు చేయవ లసి వస్తే ముందు ప్రాథమిక నివేదిక ఆధారంగా కోర్టు అనుమతిని విధిగా పొందవలసిన కనీస ఆనవాయితీని కూడా విచారణ సంస్థలు పాటించక పోవడం ఏ సంప్రదాయం కింద, ఏ ప్రజాప్రాతినిధ్య చట్టం కింద, ఏ అవినీతి వ్యతిరేక చట్టం కింద, ఏ ఎన్నికల కమిషన్ నిబంధనల కింద నమోదైందో ప్రజలు తెలుసుకోగోరుతున్నారు. బడుగులూ బహుపరాక్! పేద, బడుగువర్గాలు, దళిత బహుజన, మైనారిటీలు ఈ పరిణామాల్ని శ్రద్ధ గా గమనించాలి. కేవలం ధనస్వామ్య ప్రయోజనాలను కాపాడుతున్న శాసన వేదికల్లో ప్రవేశించాలన్న ఆబతో, ఆ చక్రబంధంలో చిక్కుబడిపోకుండా చైత న్యంతో ఉండవలసిన అవసరం గతంలోకన్నా నేడు ఎక్కువగా ఉందని గ్రహించాలి! ‘ఓటుకు నోటు’ లాంటి అవినీతికర ప్రయోగాలకు ‘ఎర’గాకుం డా జాగ్రత్తపడాలి. స్టీఫెన్సన్, సెబాస్టియన్, జెరూసలెం మత్తయ్య లాంటి వారు ఇరు రాష్ట్రాల పాలకశక్తుల కుట్రలకు బలవుతున్న తీరుతెన్నులు ఇతరు లకూ గుణపాఠం కావాలి! నేటికీ ‘నాలుగు పడగల హైందవ నాగరాజులు’ ఏలుతున్న స్వతంత్ర భారతంలో రానున్న పరిణామాల్ని ముందుగానే పసి కట్టగలిగిన మహాకవి జాషువా ధనిక వర్గ వ్యవస్థలో దళిత, మైనారిటీ బహు జన వర్గాలు ఎలా వ్యవహరించాలో హెచ్చరించాడు: ‘‘ఏ నాడు మా జాతి (దళిత బహుజనులు) దృష్టి మాంద్యము బాసి చుట్టు ప్రక్కల తేరిపార చూడగలదొ / ఏనాడు మా బుర్రలీ జుట్టు తలలేని పుక్కిటి కథలలో చిక్కువడదొ/ ఏనాడు మా విద్యలు ఇనుప సంఘమునందు చిలుముపట్టక ప్రకాశింపగలవొ’’ ఆనాడు, అదిగో ఆనాడు మాత్రమే శ్రమైకజీవనం మీద ఆధారపడే బహుజనులందరికీ నిజమైన విమోచన దినం. ఆ లక్ష్యసాధనే డాక్టర్ అంబే డ్కర్కు ఆచరణాత్మకమైన, నిజమైన నివాళి. ‘మేల్కోండి, మేల్కోండి, మేల్కోండి’ అనీ ‘చైతన్యం పొందండి, చైతన్యం పొందండి, చైతన్యం పొం దండి’ అనీ మూడేసిమార్లు అంబేడ్కర్ ఎందుకు ఆదేశించవలసి వచ్చిందో ఆలోచించవలసిన అవసరం ఉంది. ‘వైస్రాయి హోటల్’ తరహా మోసాల నుంచీ, ‘ఫామ్‌హౌస్’ కుట్రల నుంచీ దళిత ప్రతినిధులూ, మైనారిటీ, బహు జన వర్గాల ప్రతినిధులూ బయటపడాలి. (వ్యాసకర్త మొబైల్: 9848318414) ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
ఇక చీఫ్ జస్టిస్ నిర్ణయమే కీలకం
-
'జడ్జి లేకుండా కోర్టు లేదు'
-
'జడ్జి లేకుండా కోర్టు లేదు'
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వేసిన నాట్ బిఫోర్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. స్టీఫెన్సన్ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యాకే మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నారు. ఇక స్టీఫెన్సన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల న్యాయవాదులు భిన్నమైన వాదనలు వినిపించారు. స్టీఫెన్సన్ దాఖలు చేసిన పిటిషన్లో లోపాలు ఉన్నాయని మత్తయ్య తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా, స్టీఫెన్సన్ తరఫు న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఇరువురు న్యాయవాదులు సంయమనం పాటించాలని సూచించారు. ఈ పిటిషన్‌ను ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి దాఖలు చేశారని, ఇటువంటి ఘటనలు జరగకుండా ఆపాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్టీఫెన్సన్ తరపు న్యాయవాది వాదించారు. దేశానికి సిగ్గుచేటుగా మారిన ఇలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ జడ్జి లేకుండా కోర్టు లేదని, కోర్టు గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోమని, నియమ నిబంధనల ప్రకారమే కోర్టు పనిచేస్తుందని, మీడియాలో వచ్చిన కథనాలు కోర్టులను ప్రభావితం చేయలేవని అన్నారు. కాగా స్టీఫెన్సన్ దాఖలు చేసిన పిటిషన్‌తో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ తెలిపారు. పిటిషన్‌లోని అంశాలు స్టీఫెన్సన్ వ్యక్తిగత అభిప్రాయమని, కోర్టు ఇవ్వబోయే తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సందేహాలు, అభ్యంతరాలు ఉండవని పేర్కొన్నారు. -
మత్తయ్య అరెస్టుపై రేపటి వరకు స్టే
-
'ముద్దాయిలకు షెల్టర్‌జోన్‌గా బెజవాడ'
-
మత్తయ్యకు ఏపీ సర్కార్ అండ!
-
మత్తయ్య కోసమేనా బాబు బస్సు నిద్ర?
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు గురువారం రాత్రి విజయవాడలో బస్సులోనే బస చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు సీఎం క్యాంపు కార్యాలయం కారిడార్‌లో బస్సును నిలిపి అందులో నిద్రించడంలోని ఆంతర్యమేంటన్న ప్రశ్న ఉదయిస్తోంది. కేసీఆర్‌పై ఫిర్యాదు చేసిన మత్తయ్య ఆరోజు రాత్రి చంద్రబాబును కలిశారన్న ప్రచారం జరుగుతోంది. విజయవాడలో బస చేయాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన స్థానికంగా ఉన్న ఒక స్టార్ హోటల్లోనే ఉంటున్నారు. ఆరోజు కూడా ఆ హోటల్లోనే సీఎం బస చేస్తారని అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుని ఆయన క్యాంపు కార్యాలయం బయట కారిడార్‌లో బస్సును నిలిపి అందులోనే బస చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం స్టార్ హోటల్లో బస చేసి ఉంటే అక్కడ ఎవరెవరు సంచరిస్తున్నారు? ఎవరెవరు వచ్చిపోతున్నారన్న విషయం ఆ హోటల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డవుతుంది. అయితే క్యాంపు కార్యాలయం ఆవరణలోని బస్సులో బస ఏర్పాటు చేయడం వల్ల, అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో వచ్చిపోయే వారెవరన్న విషయం గమనించడానికి, అవసరమైన పక్షంలో సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించడానికి వీల్లేకుండా పోయింది. అయితే కేసీఆర్‌పై ఫిర్యాదు చేసిన మత్తయ్య ఆ కేసు వ్యవహారంలో గురువారం విజయవాడలో సిట్ అధికారుల ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో చంద్రబాబు మాట్లాడినట్టు ఆడియో రికార్డులు బయటకొచ్చిన రోజు నుంచి మత్తయ్య విజయవాడలో ఉంటున్నారని చెబుతున్నారు. బాబు ఉదంతం తర్వాతే ఆయన విజయవాడ సత్యనారాయణపురంలో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒకరు ఆయనకు ఆశ్రయం కల్పించినట్టు టీడీపీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అదే తరహాలో గురువారం చంద్రబాబును మత్తయ్య బస్సులో కలిశారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. -
మత్తయ్యకు ఏపీ సర్కార్ అండ!
* అందుకే అతని తరఫున హాజరైన ఏపీ పీపీ పోసాని.. న్యాయమూర్తి ముందు కేసు గురించి ప్రస్తావన * ఓ నిందితుని తరఫున హాజరు కావడంపై న్యాయ నిపుణుల విస్మయం సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్ల వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న మత్తయ్యకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోందా? హైకోర్టులో గురువారం జరిగిన పరిణామాలను గమనించిన న్యాయ నిపుణులు అవుననే అంటున్నారు. మత్తయ్య కేసీఆర్, ఆ రాష్ట్ర పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీఐడీకి బదలాయించారు. ఈ నేపథ్యంలో మత్తయ్య నేరుగా హైకోర్టును ఆశ్రయించి తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మత్తయ్య తరఫున పొనకంపల్లి రవికుమార్ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సాధారణంగా ఈ కేసు గురువారం విచారణకు వచ్చే అవకాశమే లేదు. మత్తయ్యను కాపాడుతున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు ఈ కేసును విచారణకు తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వ పెద్దలకు హైకోర్టులో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ‘అధికారిక’ కార్యాలయాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ కార్యాలయం నుంచే ఆ కీలక వ్యక్తి సహాయకుడొకరు తెలంగాణ ఏసీబీ స్పెషల్ పీపీ రవికిరణ్‌రావుకు ఫోన్ చేసి, తాము మత్తయ్య కేసు గురించి న్యాయమూర్తి ముందు ప్రస్తావించి, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరనున్నామని చెప్పారు. ఆ తర్వాత మత్తయ్య తరఫున ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు న్యాయమూర్తి ముందు కేసు గురించి ప్రస్తావించి మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టాలని కోరారు. మత్తయ్య తరఫున ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పోసాని వెంకటేశ్వర్లు హాజరై కేసు గురించి ప్రస్తావించడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ కేసులో రవికుమార్‌కు మత్తయ్య వకాలత్ ఇచ్చారే తప్ప, పోసాని వెంకటేశ్వర్లుకు కాదు. అలాంటప్పుడు న్యాయవాదులు అంత మంది ఉండగా పోసాని ఎందుకు కేసు ప్రస్తావించారనే దానిపై ఇప్పుడు హైకోర్టులో చర్చనీయాంశమైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న వ్యక్తి ఓ నిందితుని తరఫున హాజరు కావడమేంటని విస్మయం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా నిందితుని తరఫున హాజరు కావడమన్నది ఇప్పుడే జరిగింది. ఇంకో విషయమేమింటే మత్తయ్య తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూత్రా హాజరవుతున్నారు. లూత్రా వంటి సీనియర్ న్యాయవాదిని ఫీజుల పరంగా భరించేంత శక్తి మత్తయ్యకు ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మత్తయ్య వాంగ్మూలం నమోదు
తెలంగాణలో నమోదైన 'ఓటుకు కోట్లు' కేసులో నాలుగో నిందితుడిగా, విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో ఫిర్యాదిగా ఉన్న జెరుసలెం మత్తయ్య వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు శుక్రవారం నమోదు చేశారు. ఈ కేసును సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడలో మత్తయ్య నుంచి దర్యాప్తు అధికారి సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం వాంగ్మూలం నమోదు చేశారు. హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో ఆయన సోదరుడు ప్రభుదాస్ వాంగ్మూలాన్ని మరో ప్రత్యేక బృందం నమోదు చేసింది. ప్రాథమికంగా ఈ ప్రక్రియలు పూర్తయిన తరవాత నోటీసులు జారీ చేయడానికి సీఐడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
మత్తయ్యకు హైకోర్టులో కొద్దిపాటి ఊరట
-
మత్తయ్యకు హైకోర్టులో కొద్దిపాటి ఊరట
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు హైకోర్టులో కొద్దిపాటి ఊరట లభించింది. తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఎఫ్ఐఆర్ నుంచి తన పేరు తొలగించాలంటూ మత్తయ్య హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి, ఏసీబీకి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సూచిస్తూ అందుకు ఈనెల 24వ తేదీని గడువుగా విధించింది. కేసు విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఈలోపు తన క్లయింటును అరెస్టు చేయకుండా చూడాలని మత్తయ్య తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దాంతో మత్తయ్య అరెస్టుపై ఈనెల 24వ తేదీ వరకు హైకోర్టు స్టే విధించింది. స్టీఫెన్సన్కు ఇచ్చిన డబ్బులతో గానీ, ఈ కేసుతో గానీ తనకు సంబంధం లేదని, అందువల్ల తనను ఈ కేసు నుంచి తప్పించాలని మత్తయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. -
హైకోర్టులో మత్తయ్య స్క్వాష్ పిటిషన్
-
హైకోర్టులో మత్తయ్య క్వాష్ పిటిషన్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఎ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య తన పేరును ఈ కేసు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. గురువారం మత్తయ్య హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుతో తనకెలాంటి ప్రమేయం లేదని మత్తయ్య హైకోర్టుకు విన్నవించాడు. ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య ఏ4 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహాలను ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మత్తయ్య ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫిర్యాదు చేశాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎప్పటినుంచో అజ్ఞాతంలో ఉంటున్న మత్తయ్య.. ఈ రోజును హైకోర్టును ఆశ్రయించాడు. -
మత్తయ్యకు ఏపీ పోలీసుల అండ
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో నమోదైన కేసులో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న వ్యక్తి పొరుగు రాష్ర్టంలో మాత్రం దర్జాగా తిరుగుతున్నాడు! అంతేకాదు, కేసు నమోదైన రాష్ర్టంలోని సీఎం తనను బెదిరిస్తున్నారని అతను ఫిర్యాదు చేస్తే అక్కడి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇది ఏపీలో జరిగిన విడ్డూరం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులు ఎరజూపిన కేసులో నాలుగో నిందితుడి(ఏ4)గా ఉన్న మత్తయ్య అలియాస్ మాథ్యూస్ జెరూసలేం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. గత నెల 31న ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత మత్తయ్య హైదరాబాద్ నుంచి పరారై విజయవాడలో తలదాచుకున్నట్లు సమాచారం. కాగా, బుధవారం ఆయన విజయవాడలోని సత్యన్నారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు. స్టీఫెన్సన్ను ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యే పదవికి నామినేట్ చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.కోటి తీసుకున్నారంటూ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. తన భార్యాపిల్లలను నిర్బం ధించారని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని, ప్రాణభయం ఉన్నందున రక్షణ కల్పించాలని పోలీసులను అభ్యర్థించారు. ఏపీ సీఎం చంద్రబాబును కేసులో ఇరికించేందుకు సహకరించాలని తెలంగాణ ఏసీబీ నుంచి స్టీఫెన్సన్కు ఒత్తిడి వచ్చిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సత్యన్నారాయణపురం పోలీసులు ‘మానవతా ధృక్పథం’తో ఆగమేఘాల మీద స్పందించి ఐపీసీ 506, 507, 387 సెక్షన్ల కింద కేసులు పెడుతూ కేసీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవద్దా? ఒక రాష్ట్రంలో నిందితుడిగా నమోదైన వ్యక్తిని మరో రాష్ర్టంలో అరెస్ట్ చేయడం సర్వ సాధారణం. దేశంలో ఎక్కడైనా చట్టం ఒకేలా ఉంటుంది. అలాంటిది తెలంగాణలో ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకుని, ఇప్పుడు ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా అక్కడి పోలీసులు స్పందించకపోవడం విడ్డూరం. పోలీసులూ శిక్షార్హులే: లాయర్ శ్రీరంగారావు ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య విజయవాడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వెంటనే ఆ విషయాన్ని తెలంగాణ పోలీసులకు తెలియజేయకపోవడం ఉద్దేశ్యపూర్వకంగా చేసిన నేరమని తెలంగాణ న్యాయవాదుల సంఘం కన్వీనర్ శ్రీరంగారావు అన్నారు. దేశంలో ఏపీ కూడా భాగమేనని, నిందితుడి సమాచారం ఇవ్వకపోవడం కూడా నేరమేనని అన్నారు. నాకు ప్రాణహాని ఉంది పోలీసులకు మత్తయ్య ఫిర్యాదు విజయవాడ (సత్యనారాయణపురం): తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంలో తనకు ప్రాణహాని ఉందని దళిత క్రైస్తవ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి జెరూసలేం మత్తయ్య బుధవారమిక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ టీఆర్ఎస్కు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని మత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఏసీబీకి చెందినవారమని కూడా చెబుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నివసించే తాను ప్రస్తుతం విజయవాడ గాంధీనగర్‌లో ఉంటున్నానని వెల్లడించారు. తాను ఎక్కడుంటే అక్కడికి గుర్తుతెలియని వ్యక్తులు వస్తున్నారని, కొందరు ఫోన్లో బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. -
చంపేస్తానంటూ ఫోన్‌కాల్స్ వస్తున్నాయి..
విజయవాడ: ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయిగా ఉన్న మాథ్యూ జరుసలేం అలియాస్ మత్తయ్య తనకు ప్రాణహాని ఉందంటూ విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనను చంపేస్తానంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మత్తయ్య ఫిర్యాదుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఏసీబీ అధికారులపై 506, 507, 387 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కేసు నమోదుపై స్పందించేందుకు సత్యనారాయణపురం సీఐ నిరాకరించారు.