నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వేసిన నాట్ బిఫోర్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. స్టీఫెన్సన్ పిటిషన్పై విచారణ పూర్తయ్యాకే మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు. ఇక స్టీఫెన్సన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో గురువారం తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల న్యాయవాదులు భిన్నమైన వాదనలు వినిపించారు. స్టీఫెన్సన్ దాఖలు చేసిన పిటిషన్లో లోపాలు ఉన్నాయని మత్తయ్య తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా, స్టీఫెన్సన్ తరఫు న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఇరువురు న్యాయవాదులు సంయమనం పాటించాలని సూచించారు.