
మత్తయ్య వాంగ్మూలం నమోదు
తెలంగాణలో నమోదైన 'ఓటుకు కోట్లు' కేసులో నాలుగో నిందితుడిగా, విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో ఫిర్యాదిగా ఉన్న జెరుసలెం మత్తయ్య వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు శుక్రవారం నమోదు చేశారు. ఈ కేసును సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడలో మత్తయ్య నుంచి దర్యాప్తు అధికారి సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం వాంగ్మూలం నమోదు చేశారు. హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో ఆయన సోదరుడు ప్రభుదాస్ వాంగ్మూలాన్ని మరో ప్రత్యేక బృందం నమోదు చేసింది. ప్రాథమికంగా ఈ ప్రక్రియలు పూర్తయిన తరవాత నోటీసులు జారీ చేయడానికి సీఐడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.