squash petition
-
మత్తయ్య క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో A-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య క్వాష్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదన ప్రారంభమైంది. తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసుతో తనకు సంబంధం లేదని, అందువల్ల తన పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగించేలా చూడాలంటూ మత్తయ్య పిటిషన్ దాఖలు చేసుకున్నారు. గత నెల 28న స్టీఫెన్సన్ ఫిర్యాదు చేస్తే 31న ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దీని వెనుక దురుద్దేశాలున్నాయని మత్తయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. దాంతో ఈ నెల 24 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను హైకోర్టు ఆదేశించిన విషయం విదితమే. -
హైకోర్టులో మత్తయ్య స్క్వాష్ పిటిషన్
-
హైకోర్టులో మత్తయ్య క్వాష్ పిటిషన్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఎ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య తన పేరును ఈ కేసు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. గురువారం మత్తయ్య హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుతో తనకెలాంటి ప్రమేయం లేదని మత్తయ్య హైకోర్టుకు విన్నవించాడు. ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య ఏ4 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహాలను ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మత్తయ్య ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫిర్యాదు చేశాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎప్పటినుంచో అజ్ఞాతంలో ఉంటున్న మత్తయ్య.. ఈ రోజును హైకోర్టును ఆశ్రయించాడు.