‘ఓటుకు కోట్లు’ కేసులో వాస్తవాలన్నీ చెబుతా | Jerusalem Mathaiah letter to CJI on vote for cash case | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’ కేసులో వాస్తవాలన్నీ చెబుతా

Published Sat, Feb 24 2018 2:19 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Jerusalem Mathaiah letter to CJI on vote for cash case - Sakshi

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికే ఓటేయాలంటూ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచంగా ఇస్తున్న రేవంత్‌రెడ్డి (ఫైల్‌)

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలన్నీ చెబుతానని, ఈ కేసులో తన వాదనలు తానే వినిపించుకుంటానని, ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ జెరుసలేం మత్తయ్య శుక్రవారం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. పార్టీ ఇన్‌ పర్సన్‌ (న్యాయవాదితో సంబంధం లేకుండా)గా ఈ కేసులో హాజరయ్యేందుకు అనుమతి మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను ఈ పిటిషన్‌ దాఖలు చేయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. 

వారిద్దరి ప్రతీకారాలకు వాడుకున్నారు...
‘‘నాతో మాట్లాడిన ఏపీ టీడీపీ ప్రభుత్వం, తెలం గాణ పోలీసులు గానీ ఈ కేసు గురించి సమాచారం ఇవ్వలేదు. మీడియాలో తెలుసుకుని ఒకవేళ వాయి దాకు రాకపోతే నాకు అరెస్టు వారెంటు జారీ అవు తుందేమోనని వచ్చా. హైకోర్టులో కేసు ఉన్నప్పుడు గంట గంటకు, రోజు రోజుకు వచ్చి అప్‌డేట్స్‌ అన్నీ ఇచ్చి హైకోర్టులో నా కేసు క్వాష్‌ అయ్యేవరకు నా వెంబడి ఉన్నవాళ్లు ఈరోజు సుప్రీంకోర్టుకు వస్తే నా వాయిదా డేట్‌ గురించి కూడా చెప్పడం లేదు. వారెంట్‌ జారీ అయితే నేను, నా కుటుంబ సభ్యులు జైలు పాలు కావడానికి ఏమైనా కుట్ర జరుగుతుందా అని ఆందోళనగా ఉంది. చంద్రబాబు, కేసీఆర్‌ ఏకమై చేస్తున్నారా అని భయంగా కూడా ఉంది. పార్టీ ఇన్‌ పర్సన్‌గా నేను హాజరై జరిగిన వాస్తవాలన్నీ చెబుతానని, నాకు జరిగిన నష్టాన్ని చెబుతానని, వారిద్దరూ నన్ను ఏ రకంగా వారి ప్రతీకారాలకు వాడుకున్నదీ, ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టించుకుని నన్ను ఎలా వేదనకు గురిచేస్తున్నారో చెబుతానని ప్రధాన న్యాయమూర్తికి తెలియచేశాను. ఈ కేసులో నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటానని, నాకు, నా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని వేడుకున్నా..’’అని చెప్పారు.

ఏపీ పోలీసులు నన్ను సైలెంట్‌గా ఉండమన్నారు..
‘‘ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌ డబ్బులతో పట్టుబడ్డ నాటి నుంచి మొన్నటివరకు.. అంటే గత 2017 జూన్, జూలై వరకు వాళ్ల లాయర్లు నాతో మాట్లాడారు. ఆరు నెలలుగా ఏ సమాచారం ఇవ్వడం లేదు. 23వ తేదీన వాయిదా ఉందని తెలుసుకుని వచ్చా. వాయిదాకు రాకపోతే ఒక ముద్దాయికి శిక్ష పడుతుందని, వారెంట్‌ జారీ అవుతుందని వచ్చాను. అప్పుడు కేసులో పట్టుబడ్డవాళ్లు ఒక వర్గం వాళ్లు. ఒక వర్గం వాళ్లు పెట్టిన సాక్ష్యం చెల్లదు కాబట్టి.. తటస్థంగా ఉన్న ఒకరి సాక్ష్యం తీసుకోవాలని చెప్పి నా పేరు పెట్టారని తెలంగాణ ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌ చెప్పారు. నన్ను సాక్షిగా తీసుకుని వాళ్లను ఇరికించాలని కుట్రపన్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. నాకు సంబంధం లేదని హైకోర్టు జడ్జి క్లీన్‌ చిట్‌ ఇచ్చారు.

వాళ్లు పన్నిన పన్నాగానికి నేను లొంగలేదని కేటీఆర్‌ డ్రైవర్, గన్‌మెన్‌ ఫోన్‌ నుంచి నాకు ఫోన్‌ చేసి నన్ను బెదిరించారు. క్లాక్‌టవర్‌ దగ్గరికి రా.. వచ్చి మాట్లాడు అని ఫోన్‌ చేశారు. కేసున్నప్పుడు ముగ్గురు దొరికారు. వాళ్లపై కేసు ప్రూవ్‌ కావాలంటే తటస్థంగా ఉన్నవాడిగా నన్ను పెట్టాలని చూశారు. ఆ సీన్‌లో నేను లేను. డబ్బులు ఇచ్చినప్పుడు నేను లేను. నేను లొంగకపోవడంతో నన్ను తిట్టారు. నేను విజయవాడకు పోయాక నాకు ఫోన్‌ వచ్చింది. ఈ ఫోన్‌పై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కాల్‌డేటా తీశారు. ఆ ఫోన్‌ కాల్స్‌ కేటీఆర్‌ గన్‌మెన్, డ్రైవర్‌ ఫోన్ల నుంచి వచ్చాయని తేలింది. దీంతో ఏపీ పోలీసులు వాళ్లకు నోటీసులు ఇచ్చి తెలంగాణ క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లారు. ఆ ఆధారాల కోసం వాళ్లు కేసు పెట్టించుకున్నారు. వీళ్ల కోసం వీళ్లు కేసు పెట్టించుకున్నారు. హైకోర్టు వరకు బాగానే ఉన్నారు. నన్ను వేధించారు కదా వాళ్లపై కేసు పెట్టరా అని ఏపీ పోలీసులను అడిగాను. వాళ్లు నన్ను సైలెంట్‌గా ఉండమన్నారు. నా క్రైస్తవ సమస్యల మీద నేనేదో పోరాటం చేసుకుంటుంటే సుప్రీంకోర్టుకు వచ్చారు. అప్పీలుకు వచ్చినప్పుడు హైకోర్టు వరకు ఫాలో అప్‌ చేస్తున్నవాళ్లు ఇప్పుడు నాకు సమాధానం చెప్పడం లేదు. ఇంతకుముందు ఇంటెలిజెన్స్‌ వాళ్లు కూడా సమాచారం ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఇవ్వడం లేదు. అందుకే నేను భయపడి ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాను. వ్యక్తిగతంగా హాజరై వాదనలు వినిపిస్తానని వేడుకున్నా’’ అని ఆయన వివరించారు. 

సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరా...
అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ... రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కూడా ప్రధాన న్యాయమూర్తిని కోరానని తెలిపారు. సీబీఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని వివరించారు. ఈ కేసులో తనకు సమాచారం ఇచ్చే వారెవ్వరూ లేకపోవడంతో వాస్తవాలను తెలుసుకునేందుకు తానే స్వయంగా అప్పు చేసి మరీ ఢిల్లీకి వచ్చానని చెప్పారు.

ఇదీ కేసు...
2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే లంచంగా రూ.ఐదు కోట్లు ఇవ్వడానికి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారంటూ నామినే టెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో రేవంత్‌రెడ్డి, అనుసంధానకర్త జెరుసలేం మత్త య్య, సెబాస్టియన్‌ తదితరులను నిందితు లుగా పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మత్తయ్య 2015 జూన్‌ 17న హైకోర్టులో పిటి షన్‌ దాఖలు చేయగా.. మత్తయ్య అరెస్ట్‌పై స్టే విధించింది. ఆ తరువాత తుది విచారణ జరిపి ఓటుకు కోట్లు కేసులో మత్తయ్యపై ఏసీబీ అధి కారులు నమోదు చేసిన కేసును కొట్టేస్తూ హైకో ర్టు 2016 జూన్‌ 3న తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ఏసీబీ అధికారులు 2016లో సుప్రీంకోర్టు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ ప్రకా రం పిటిషన్‌ ఏప్రిల్‌ 8న విచారణకు రానున్నది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement