ముంబై : కాల్ డేటా రికార్డు స్కామ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజ్‌ద్దీన్ సిద్ధిఖీ న్యాయవాది రిజ్వాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. రిజ్వాన్ ఇంతకు ముందు ప్రముఖ సెలబ్రిటీలకు న్యాయవాదిగా వ్యవహరించడంతో ఈ కేసుకు మరింత ప్రధాన్యత సంతరించుకుంది. కాగా కాల్ డేటా రికార్డు స్కాం కేసు నగరంలో కలకలం రేపుతోంది. నలుగురు ప్రవేటు డిటెక్టివ్స్ అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 11మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న రిజ్వాన్ ను థానే పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. చట్ట విరుద్దంగా ఇతరుల కాల్ డేటాను రికార్డ్ చేస్తోన్న నలుగురు ప్రవేటు డిటెక్టివ్స్‌ను జనవరి 24న అరెస్ట్ చేశాం. లాయర్ రిజ్వాన్ వారి నుంచి నవాజుద్దీన్ తన భార్య కాల్ డేటాను పొందినట్లు అరెస్ట్ అయిన ప్రశాంత్ పాలేకర్ విచారణలో అంగీకరించాడు. కాల్ డేటా కోసం 50వేల రూపాయలు వారికి చెల్లించినట్టు తెలిసింది. ఇదే అంశంపై రిజ్వాన్‌తోపాటు నవాజుద్దీన్ దంపతులకు నోటిసులు పంపాం. శుక్రవారం విచారణకు హాజరైన రిజ్వాన్ కాల్ డేటా పొందినట్టు రుజువు కావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నాం. నవాజుద్దీన్ దంపతులు దీనిపై విచారణకు హాజరు కావాల్సి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment