సాక్షి, విశాఖపట్నం: సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్‌ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది.
ఇటీవల పెద్ద ఎత్తున నగరంలో ఈ-సిగరెట్స్ పట్టుబడ్డాయి. పకడ్బందీ సమాచారంతో టాయిస్ షాపుల్లో వున్న నిషేధిత సిగరెట్టను విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-సిగరెట్లు కూడా పోర్టు నుంచే బయటకు వచ్చినట్టు అనుమానం. కస్టమ్స్ పరిధిని దాటి నిషేధిత సిగరెట్లు బయటకు రావడం, ఇప్పుడు డ్రగ్ కంటైనర్ పట్టుబడటంతో అనుమానాలు బలపడుతున్నాయి.
అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా టెక్స్ బస్సు
కాకినాడ: మూలపేట ఎస్ఈజడ్ కాలనీలో అనుమానాస్పదంగా సంధ్య ఆక్వాటెక్స్‌కు చెందిన బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో యు.కొత్తపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం సీబీఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన బస్సులో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్ మదర్‌బోర్డు గుర్తించారు. బస్సు బ్రేక్ డౌన్ అయ్యిందని డ్రైవర్ చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment