న్యాయస్థానానికి సర్వీస్ ప్రొవైడర్ల వినతి
విజయవాడ లీగల్: ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య తదితరుల కాల్ డేటాను కోర్టులో దాఖలుచేసేందుకు గడువివ్వాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లు న్యాయస్థానాన్ని కోరారు. మే 1 నుంచి జూన్ 20 వరకు మత్తయ్య, ఆయన బంధువుల మొబైల్ ఫోన్‌కాల్ డేటా ఇవ్వాలని ఏపీ సీఐడీ పోలీసులు సర్వీస్ ప్రొవైడర్లను కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
కాల్ డేటాను గోప్యంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం తమకు లేఖ పంపిందని, దాన్ని దాఖలు చేసేందుకు తమకు వ్యవధి కావాలని న్యాయమూర్తిని సర్వీస్ ప్రొవైడర్ల తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో కేసు విచారించిన మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (సీఐడీ) కె.జయకుమార్ ఈ కేసును ఆగస్టు మూడో తేదీకి వాయిదా వేస్తూ కాల్‌డేటా పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
కాల్ డేటా దాఖలుకు గడువివ్వండి
Published Thu, Jul 2 2015 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM
Advertisement
Advertisement