service provider
-
ముగియనున్న ఇన్ఫోసిస్ కాంట్రాక్టు.. కొత్త సర్వీస్ ప్రొవైడర్‌పై జీఎస్టీఎన్ కసరత్తు
న్యూఢిల్లీ: సాంకేతిక సహకారం అందించేందుకు ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు ఇచ్చిన కాంట్రాక్టు 2024 సెప్టెంబర్‌తో ముగియనున్న నేపథ్యంలో కొత్త సర్వీస్ ప్రొవైడర్ ఎంపికపై వస్తు, సేవల పన్నుల నెట్వర్క్ (జీఎస్టీఎన్) దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్ డాక్యుమెంట్లను తయారు చేసే కన్సల్టెన్సీ కోసం అన్వేషణ ప్రారంభించింది. బిడ్డింగ్ ప్రక్రియ, జీఎస్టీఎన్ ఐటీ వ్యవస్థను మరో సర్వీస్ ప్రొవైడర్‌కు బదలాయించడం తదితర పనులను సదరు కన్సల్టెన్సీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుత వ్యవస్థను మదింపు చేసి తదుపరి కాంట్రాక్టు వ్యవధిలో దాన్ని మరింత మెరుగుపర్చేందుకు తగు మార్గదర్శకాలు రూపొందించాలి. దేశీయంగా ప్రత్యక్ష లేదా పరోక్ష పన్నులు లేక ఇతరత్రా ఆర్థిక సంస్థకు ఐటీ కన్సల్టింగ్ సర్వీసులు అందించడం ద్వారా గత మూడేళ్లలో సగటున రూ. 30 కోట్ల వార్షిక టర్నోవరు ఉన్న కన్సల్టెన్సీలు ఇందుకు పోటీపడొచ్చని జీఎస్టీఎన్ తెలిపింది. బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 5. కొత్త కాంట్రాక్టు 2024 అక్టోబర్ 1 నుంచి ఏడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దానికి అవసరమైన సాంకేతిక సేవలు అందించేందుకు 2015లో రూ. 1,320 కోట్ల కాంట్రాక్టును ఇన్ఫోసిస్ దక్కించుకుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్, రిటర్నుల ఫైలింగ్, ఆడిట్ మొదలైన వాటికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఇన్ఫోసిస్ అందిస్తోంది. -
ఎయిర్‌టెల్‌కు షాక్: జియో కొత్త అధ్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగంలో సంచలనం రేపిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. భారతీయ రైల్వేకు సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించింది. 2019, జనవరి 1నుంచి రైల్వేస్‌కు అధికారికంగా జియో తన సేవలను అందించనుంది. టెలికం రంగంలో ప్రధాన ప్రత్యర్థి భారతి ఎయిర్టెల్ షాకిచ్చి మరీ ఈ డీల్‌ను సొంతం చేసింది. రిలయన్స్ జియో రైల్వేలోని ఉన్నతాదికారులు,కార్యదర్శి స్థాయి అధికారులలు, గ్రూప్ సీ సిబ్బంది ఇలా నాలుగు ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంది. 4జీ /3జీ కనెక్షన్లను అందిస్తుంది. వారికి ఉచిత కాలింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. భారతీ ఎయిర్‌టెల్‌తో ఉన్న ఆరు సంవత్సరాల ఒప్పందంలో ఈ డిసెంబర్ 31 న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియోవైపు రైల్వే శాఖ మొగ్గు చూపింది. తాజా ఒప్పందం ద్వారా తమ ఫోన్ బిల్లులు కనీసం 35 శాతం వరకు తగ్గుతాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సుమారు 1.95 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్ల కోసం రైల్వేలు సంవత్సరానికి రూ. 100 కోట్ల బిల్లును చెల్లించినట్టు చెప్పారు. -
మూడు సెట్ల నోటిఫికేషన్ విడుదల
-
సెట్స్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్..!
-
సెట్స్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్..!
సర్వీసు ప్రొవైడర్ ఎంపికపై స్పష్టత - ఇక వరుసగా నోటిఫికేషన్లు, దరఖాస్తుల ప్రక్రియ - రేపు లేదా 13న ఎంసెట్ నోటిఫికేషన్ - 14 నుంచి ఐసెట్ దరఖాస్తుల స్వీకరణకు చర్యలు - రెండు మూడు రోజుల్లో మిగతా ప్రవేశ పరీక్షలపైనా స్పష్టత సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణకు మార్గం సుగమమైంది. దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపు తదితర ఆన్లైన్ పనులను నిర్వహించే సర్వీసు ప్రొవైడర్ ఎంపికపై తలెత్తిన వివాదం పరిష్కారమైంది. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి సమావేశమై చర్చించారు. టెండర్లలో తక్కువ రేటు కోట్ చేసిన సర్వీసు ప్రొవైడర్‌కే పనులను అప్పగించాలని కడియం సూచించారు. దీంతో ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణపైనా సెట్స్ కన్వీనర్లు కసరత్తు ప్రారంభించారు. వీటిపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన జారీ చేసే అవకాశముంది. ప్రవేశ పరీక్షల తేదీల్లో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. 15 రోజుల సమయం వృథా..! సర్వీసు ప్రొవైడర్ ఎంపిక విషయంలో సెట్స్ కన్వీనర్ల కమిటీ నిబంధనలు పాటించలేదంటూ కొందరు సర్వీసు ప్రొవైడర్లు ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దానిపై ప్రభుత్వం ఉన్నత విద్యా మండలిని, సెట్స్ కన్వీనర్ల కమిటీని వివరణ కోరింది. అయితే తాము గతంలో తరహాలోనే సర్వీసు ప్రొవైడర్‌ను ఎంపికకు చర్యలు చేపట్టామని.. ప్రస్తుతం ఎం చేయమంటారో ప్రభుత్వమే తేల్చాలంటూ ప్రభుత్వానికి విద్యా మండలి వివరణ ఇచ్చింది. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడంతో.. గత నెల 27న జారీ కావాల్సిన ఎంసెట్ నోటిఫికేషన్, ఈనెల 3 నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్, ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ, 4న జారీ కావాల్సిన లాసెట్ నోటిఫికేషన్ ఆగిపోయాయి. తాజాగా ఈ సమస్య పరిష్కారమైంది. ఈ నేపథ్యంలో ఈనెల 13న ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎంసెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. 15 లేదా 16వ తేదీ నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తుల స్వీకరణను ఈనెల 14 నుంచి చేపట్టేలా ఐసెట్ కన్వీనర్ ఓంప్రకాష్ చర్యలు ప్రారంభించారు. షరతుతో ఆయుష్కు దరఖాస్తులు ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి, యోగా వంటి ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ ద్వారా ఉంటాయా, ఎంసెట్ ద్వారా చేపడతారా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి లేఖ రాసినా సరైన స్పందన రాలేదు. సీబీఎస్ఈ ఇంకా నీట్ ద్వారా ఆయుష్ ప్రవేశాలకు ప్రకటన జారీ చేయనందున ఎంసెట్‌లో చేర్చాలని మౌఖికంగా సూచించినట్లు సమాచారం. అయితే నీట్ ద్వారా ఆయుష్ ప్రవేశాలు చేపడితే విద్యార్థులు నీట్ రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు షరతులతో ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. -
కాల్ డేటా దాఖలుకు గడువివ్వండి
-
కాల్ డేటా దాఖలుకు గడువివ్వండి
న్యాయస్థానానికి సర్వీస్ ప్రొవైడర్ల వినతి విజయవాడ లీగల్: ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య తదితరుల కాల్ డేటాను కోర్టులో దాఖలుచేసేందుకు గడువివ్వాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లు న్యాయస్థానాన్ని కోరారు. మే 1 నుంచి జూన్ 20 వరకు మత్తయ్య, ఆయన బంధువుల మొబైల్ ఫోన్‌కాల్ డేటా ఇవ్వాలని ఏపీ సీఐడీ పోలీసులు సర్వీస్ ప్రొవైడర్లను కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కాల్ డేటాను గోప్యంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం తమకు లేఖ పంపిందని, దాన్ని దాఖలు చేసేందుకు తమకు వ్యవధి కావాలని న్యాయమూర్తిని సర్వీస్ ప్రొవైడర్ల తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో కేసు విచారించిన మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (సీఐడీ) కె.జయకుమార్ ఈ కేసును ఆగస్టు మూడో తేదీకి వాయిదా వేస్తూ కాల్‌డేటా పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.