డిటెక్టివ్‌ యాక్షన్‌ | Vishal's Thupparivaalan as Detective in Telugu | Sakshi
Sakshi News home page

డిటెక్టివ్‌ యాక్షన్‌

Oct 6 2017 1:22 AM | Updated on Oct 6 2017 1:22 AM

Vishal's Thupparivaalan as Detective in Telugu

మాస్‌ హీరో విశాల్‌ ‘డిటెక్టివ్‌’గా తెలుగు ప్రేక్షకులముందుకొస్తున్నారు. ఆయన హీరోగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘తుప్పరివాలన్‌’.  తమిళ్‌లో భారీ ఓపెనింగ్స్‌ రాబట్టి, విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ‘డిటెక్టివ్‌’ పేరుతో ఈ నెలలోనే తెలుగులో విడుదల కానుంది. నిర్మాత జి. హరి మాట్లాడుతూ– ‘‘మొదటి వారంలోనే ‘తుప్పరివాలన్‌’ 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

విశాల్‌ కెరీర్‌లోనే మొదటివారం హయ్యస్ట్‌ కలెక్షన్‌ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ‘డిటెక్టివ్‌’ తెలుగు ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. విశాల్‌ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయి. తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా, ప్రసన్న, కె.భాగ్యరాజ్, సిమ్రాన్, జాన్‌ విజయ్, అభిషేక్‌ శంకర్, జయప్రకాశ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అరోల్‌ కొరెల్లి, కెమెరా: కార్తీక్‌ వెంకట్రామన్, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement