‘రణరణమున రథము నిలిపి, రుధిర నదిని ఎదురు మలిపి..’’ అంటూ సాగుతుంది ‘డిటెక్టివ్ తీక్షణ’ చిత్రంలోని ‘రేజ్ ఆఫ్ తీక్షణ’ పాట. చిత్ర సంగీత దర్శకుడు పెద్దపల్లి రోహిత్ రాసిన ఈ పాటను హైమత్ మొహమ్మద్, సాయి చరణ్ భాస్కరుని, అరుణ్ కౌండిన్య పాడారు.
ప్రియాంకా ఉపేంద్ర టైటిల్ రోల్‌లో ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహించారు. గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం .బి కోయురు నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీ, ఒరియా భాషల్లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment