Australian Girl Found Alive After 18 Day Hunt viral video - Sakshi
Sakshi News home page

18 రోజుల పాటు గాలింపు.. ఆ పాపను చూసి ఏడ్చిన అధికారులు

Published Wed, Nov 3 2021 7:06 PM | Last Updated on Fri, Nov 5 2021 4:46 PM

Australian Girl Found Alive After 18 Day Hunt - Sakshi

సిడ్ని: ఆస్ట్రేలియాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి క్లియో స్మిత్‌ని చూసి ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. పోలీసులు, డిటెక్టివ్‌లు, చుట్టుపక్కల ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. చిన్నారిని చూసి వారికి కన్నీళ్లు ఆగలేదు. కాకపోతే అవి ఆనందబాష్పాలు. ఎందుకంటే 18 రోజుల కిత్ర కిడ్నాప్‌కు గురైన క్లియో స్మిత్‌(4).. క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఇన్ని రోజులు క్లియో కోసం కన్నీరుమున్నిరుగా విలపించిన వారంతా ఇప్పుడు సంతోషంతో ఏడుస్తున్నారు. క్లియో కిడ్నాప్‌ వ్యవహారానికి వస్తే..

ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతానికి చెందిన క్లియో.. సుమారు 18 రోజుల క్రితం తన తల్లిదండ్రులతో  కలిసి పిక్నిక్‌కు వెళ్లింది. రాత్రి తన టెంట్‌లో నిద్రిస్తుండగా దుండగుడు క్లియోని కిడ్నాప్‌ చేశాడు. ఉదయం నిద్రలేచిన క్లియో తల్లిదండ్రులకు ఆమె కనిపించలేదు. ఆ ప్రాంతం అంత వెదికారు. ఎక్కడా క్లియో జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
(చదవండి: నెల క్రితం కిడ్నాప్‌.. ఇప్పుడు ఎముకల గూడుగా.. )

క్లియో తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ చెప్పాలంటూ సోషల్‌ మీడియా వేదికగా అభ్యర్థించారు. ముక్కుపచ్చలారని పసికందు కిడ్నాప్‌ వ్యవహారం ప్రతి ఒక్కరిని కదిలించింది. క్లియో క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్లియో తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు జనాలు. 

కేసు సీరియస్‌గా మారడంతో పోలీసులు దీన్ని సవాలుగా తీసుకున్నారు. క్లియో పిక్నిక్‌ వెళ్లిన ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రదేశాలను జల్లెడ పట్టారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఆశ వదిలేసుకున్నారు. చివరకు డిటెక్టివ్‌ల సాయం తీసుకున్నారు. అయితే క్లియో ప్రాణాలతో ఉంటుందని ఎవరికి నమ్మకం లేదు. దుర్వార్తే వినాల్సి వస్తుందని భావించారు. 
(చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్‌ ఎక్కడ?)

ఈ క్రమంలో సుమారు 18 రోజుల తర్వాత క్లియోని కిడ్నాప్‌ చేసిన వ్యక్తి గురించి.. అతడి స్థావరం గురించి పోలీసులుకు సమాచారం తెలిసింది. ఎంతో చాకచక్యంగా నిందితుడు ఉండే ప్రాంతాన్ని చుట్టుమట్టారు పోలీసులు. అతడి నివాసంలోకి వెళ్లారు. అక్కడ ఓ గదికి తాళం వేసి ఉండటం గమనించారు. దాన్ని పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. వారి ఎదురుగా క్లియో. 

ఒక్కనిమిషం పాటు అధికారులకు నోటమాట రాలేదు. చిన్నారిని తట్టి.. ‘‘నీ పేరేంటని ప్రశ్నించగా.. నా పేరు క్లియో’’ అని చెప్పింది. వెంటనే హుటాహుటిన క్లియోని అక్కడ నుంచి కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. 18 రోజుల పాటు కిడ్నాపర్‌ చెరలో ఉండటం అంటే మామూలు విషయం కాదు. పెద్దవారే ఎంతో భయపడతారు.
(చదవండి: వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్‌)

కానీ చిన్నారి క్లియో ఏమాత్రం బెదరకుండా.. ధైర్యంగా ఉండటం చూసి పోలీసులు, డిటెక్టివ్‌లు ఆశ్చర్యపోయారు. చిన్నారిని చూసి వారు ఒక్కసారిగా ఏడ్చేశారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఇక క్లియో క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు చిన్నారి తల్లిదండ్రులు. 

చదవండి: 22 ఏళ్ల క్రితం.. పునీత్‌ రాజ్‌కుమార్‌ తండ్రిని కిడ్నాప్‌ చేసిన వీరప్పన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement