మాంసం కోసం.. అమ్మాయిని చంపి..
సాక్షి, మాస్కో: మనిషి మాంసం కోసం యువతిని చంపిన ఘటన రష్యాలోని ఓ పట్టణ వాసులు వణికిపోతున్నారు. నది ఒడ్డున నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని యువతి శవం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ స్థలానికి చేరుకుని వివస్త్రగా పడి ఉన్న అమ్మాయిని చూసి షాక్‌కు గురయ్యారు. ఆమె శరీర భాగాలను కత్తితో కోసి, మాంసాన్ని సేకరించినట్లు నిర్ధారించారు.
ఘటనాస్థలిలో సర్జన్ వినియోగించే గ్లౌజులు దొరకడంతో.. ఓ నేర్పరి అయిన వైద్యుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మాంసం కోసం అమ్మాయిని చంపారనే వార్త రష్యా న్యూస్ చానెళ్లలో ప్రసారం కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒంటరిగా బయటకు వెళ్లేందుకు మహిళలు, పిల్లలు జంకుతున్నారు. మనిషి రక్త మాంసాలకు అలవాటు పడిన మానవ మృగాన్ని త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు. కాగా, రష్యా ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.