అంత్యక్రియలు ఆ కాలంలో అలా ఉండేవా..ప్రజలే తినేసేవారా..! | People Were Eating Them Long Ago Cannibalism Was Normal | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలు ఆ కాలంలో అలా ఉండేవా..ప్రజలే తినేసేవారా..!

Published Tue, Oct 10 2023 4:13 PM | Last Updated on Tue, Oct 10 2023 4:13 PM

People Were Eating Them Long Ago Cannibalism Was Normal - Sakshi

మధ్యయుగం, ప్రాచీన శిలాయుగలలో మానవుడు ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు అనేదాని గురించి నేటికి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఆ కాలంలో వారిలో  ఎవరైన చనిపోతే ఎలా వీడ్కోలు చెప్పేవారు, ఆ మృతదేహాలను ఏం చేశారనే విషయాన్ని చేధించారు శాస్త్రవేత్తలు. నాటి మానవులు చనిపోయిన వాళ్లకి జరిపే అంత్యక్రియ విధానం గురించి చాలా షాకింగ్‌ విషయాలు  వెల్లడించారు.

ఐరోపా అంతటా ప్రాచీన శిలాయుగంలో మానవ అవశేషాలపై శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో నరమాంస భక్షణ గురించి వెల్లడైంది. దాదాపు 15 వేల ఏళ్ల క్రితం ఐరోపాలో ఉన్న ప్రజలను మాగ్డలీనియన్‌లుగా పిలిచేవారు. వారు నరమాంస భక్షణ చేసేవారని తేలింది. అయితే ఎవ్వరైన చనిపోతే ప్రజలు వారికి వీడ్కోలు లేదా అంత్యక్రియలు నిర్వహించడానికి ఇలా చేసేవారని తెలిపారు. ఖననం చేయడానికి బదులుగా ప్రజలే ఆ మృతదేహాన్ని తినేసేవారని చెప్పుకొచ్చారు. అది అక్కడ సర్వసాధారణంగా జరిగే ప్రక్రియగా ఉండేదని అన్నారు. అందుకు సంబంధించన ఎముకలు, పుర్రెలు వంటి ఆధారాలతో సహా వెల్లడించారు.

మాగ్డలీనియన్‌ ప్రజల సంస్కృతి, కళ, వారి సాంకేతికత నిలువెత్తు నిదర్శనం అని, వారు ఉపయోగించిన రాయి, ఎముకలపై చెక్కిన కళఖండాలే అందుకు సాక్ష్యం అని అన్నారు. ఐరోపాలో పురాతన శిలయుగంలో రెండు విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్నట్లు గుర్తించారు. కేవలం మాగ్డలేనియన్లు మాత్రమే కాక వేరే జాతి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక మాగ్డలేనియన్లు ఐరోపాకి వాయువ్యంలో సంచరించగా, ఆగ్నేయంలో ఎపిగ్రావెటియన్ల అనే మరో జాతి ప్రజలు ఉండేవారని. వీరు కూడా తమలో ఎవరైన చనిపోతే నరమాంస భక్షణ చేసేవారని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా వెల్లడించారు.

ఈ ఇరు జాతులు అంత్యక్రియల నిర్వహించడానికి బదులు మృతదేహాలను భక్షించేవారని, అదొక ఆచారంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఐరోపాలోని గోఫ్స్ గుహలో ఉన్న కపాల పాత్రలు, ఎముకలతో చేసిన గిన్నేలు, గ్లాసులు సాక్ష్యం అని చెప్పారు. తొలుత ఎపిగ్రావెటియన్లు చనిపోయిన వారిని పాతిపెట్టేవారని, ఆ తర్వాత మాగ్డలేనియన్లు ఉన్న ప్రాంతానికి వలస వచ్చిన తర్వాత వారి ఆచార పరంపరను ఈ జాతి వారు కొనసాగించనట్లు గుర్తించారు.  నాటి మానవులు ఇంత భయానక రీతిలో అంత్యక్రియలను నిర్వహించడానికి గల కారణాలపై పరిశోధన సాగిస్తున్నట్లు పేర్కొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. 

(చదవండి: వాట్‌! సబ్బు తినడం ఇష్టమా? చివర్లో ట్విస్ట్‌ అదిరిపోలా..!)


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement