koneru
-
జడ్చర్ల కోనేరుకు వెయ్యేళ్ల చరిత్ర
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరుకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి తెలిపా రు. ఆయన ఆదివారం కోనేరును సందర్శించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ఈ కోనేరును కల్యాణ చాళుక్యుల కాలంలో క్రీ.శ.11వ శతాబ్దిలో నిర్మించినట్లు మండపంలోని స్తంభాలు, శిథిల శిల్పాలను బట్టి తెలుస్తోందని వివరించారు. జడ్చర్లలో కల్యాణ చాళుక్యల శాసనం, కందూరు చోళుల శాసనం ఉన్నాయన్నారు. జడ్చర్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న క్రీ.శ.1125, ఫిబ్రవరి 19 నాటి కల్యాణ చాళుక్య చక్రవర్తి భూలోక మల్ల మూడో సోమేశ్వరుడి శాసనంలో.. ఆయన కుమారుడైన మూడో తైలపుడు యువరాజుగా కందూరును పాలిస్తుండగా గంగాçపురంలో ఒక జైన చైత్యాలయాన్ని నిర్మించినట్లుందని తెలిపారు. ఆలయం వెలుపల క్రీ.శ.11వ శతాబ్దికి చెందిన సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని భద్రపరిచారన్నారు. రెండు వైపుల మెట్లు, మండపాలు కదిలిపోయాయని పేర్కొన్నారు. వీటికి మరమ్మతులు చేసి కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావచ్చని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
శరవేగంగా మంగళగిరి పెద్దకోనేరు పూడిక తీత పనులు
-
అయ్యో పాపం
సాక్షి, కోనేరుసెంటర్(కృష్ణా) : మానవత్వం మంట కలచిపోతుంది. అనుబంధం, అపాయ్యతలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలో శుక్రవారం జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. వృద్దాప్యానికి దగ్గరవుతున్న ఆ వ్యక్తి కుటుంబానికి భారమయ్యాడో తెలీదు. ఎక్కడి వాడో తెలీదు. ఎక్కడి నుంచి వచ్చాడో అంతకంటే తెలీదు. తెల్లవారుజామున పట్టణ నడిబొడ్డున ఉన్న ఓ ప్రాంతంలో నేలపై పడుకుని కొనఊపిరితో మూలుగుతున్నాడు. లేవలేనిస్థితిలో నిరాశ నిస్పృహల నడుమ పెదవి దాటి మాట రాని దీనస్థితిలో ఆదుకునే వారి కోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు. అతని దీనస్థితిని చూసి స్థానికులు చలించారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని 108లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం అతడు చికిత్స పొందతున్నాడు. ఆ వ్యక్తిని గురువారం తెల్లవారుజామున కొంత మంది తీసుకువచ్చి బందరు బస్టాండ్ వెనుక వైపు ఉన్న గానుగసెంటర్ సమీపంలో పడేసి వెళ్ళిపోయినట్లు ఆ ప్రాంతానికి చెందిన పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బాధితుడు పేరు జకరయ్యగా వైద్య సిబ్బంది పేర్కొంటుండగా మిగిలిన వివరాలు తేలాల్సి ఉందని అంటున్నారు. -
రూ.15 కోట్లు...కృష్ణార్పణం
సాక్షిప్రతినిధి, కాకినాడ : ప్రజల సొమ్మే కాదు ప్రజలు ఏమైపోయినా సరే పాలకులకు లెక్కేలేకుండా పోతోంది. పాతికవేల మందిని ఇబ్బందుల పాలుజేసి ‘తమ్ముడుంగారి’ బాగు కోసం పురపాలికలు మోకరిల్లుతుండడంతో పట్టణ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందుకు ఉదాహరణ తుని నడిబొడ్డున బాతులు కోనేరును బినామీ పేర్లతో ఆక్రమించేసిన వైనమే. 15 వార్డుల్లో నివసించే పాతికవేల మంది ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆక్రమణలు చేస్తున్నా అడ్డుకోవల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించడమేమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 53 సెంట్లు జిరాయితీ స్థలాన్ని కొనుగోలుచేసి కోట్ల రూపాయల విలువైన కోనేరు స్థలాన్ని కలిపేసుకున్నారు. మున్సిపాలిటీగా ఏర్పాటుకాక మునుపు తుని వీరవరం పంచాయతీగా ఉండేది. మురుగు ఈ బాతుల కోనేరులోకి వచ్చి ముంపు నుంచి రక్షించేది. కోనేరును చదును చేసి స్థలంగా మార్చేయడంతో పాతికవేల మంది నివసిస్తున్న 15 వార్డులు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆక్రమణకు గురైన ఈ కోనేరును తిరిగి స్వాధీనం చేసుకునే ధైర్యం ఎవరికీ లేదు. ఏదైనా తేడా వచ్చినా ‘అన్నయ్య’ (తుని నియోజక వర్గంలో అధికార పార్టీ ముఖ్య ప్రజా ప్రతినిధి) చూసుకుంటారని తమ్ముడు ఇచ్చిన ధైర్యంతో పురపాలికలు కిమ్మనడం లేదు. ఆక్రమణదారులను వదిలేసిన మున్సిపాలిటీ ప్రత్యామ్నాయంగా రూ.38 లక్షల ప్రజధనాన్ని కుమ్మరించి కొత్తగా డ్రై¯ŒSను నిర్మించింది. గట్టిగా వర్షం పడితే చాలు లక్షలు పోసి నిర్మించిన ఈ డ్రై¯ŒS ఎందుకు పనికిరావడం లేదు. వచ్చిన వర్షం నీటిని అదుపు చేయలేకపోవడంతో వరద కష్టాలు తప్పడం లేదు. ఆక్రమణ విలువ రూ.15 కోట్ల పైమాటే... ఆక్రమించుకున్న ఆ స్థలం మార్కెట్ విలువ రూ.15 కోట్ల పైమాటే. అన్ని కోట్లు విలువైన బాతుల కోనేరు కబ్జా చేసినా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. కోనేరుకు ముందు జీఎన్టీటీ రోడ్డును అనుకుని తాలూకా పోలీస్‌స్టేçÙన్, దానికి వెనుక పోలీస్ క్వార్టర్లున్నాయి. ఇవన్నీ పోరంబోకు భూమిలో ఏర్పాటు చేసినవే. వీరవరం పంచాయతీగా ఉండగా సర్వే నంబరు 268/4లో 1.50 ఎకరాల రెవెన్యూ పోరంబోకు ఇది. 1983లో పురపాలక సంఘం జీఎన్టీ రోడ్డులోని సర్వే నంబరు 268/4లో సోమరాజు సినిమా థియేటర్ గోడ అనుకుని 22 సెంట్లు భూమిలో మురుగు కాలువ నిర్మించింది. కాలువ 15 వార్డుల మురుగుకు నీరు పారుదలకు ప్రధాన మార్గం. బినామీ పేర్లతో కొనుగోలు... బాతులు కోనేరు మనుగడలో ఉండగా ఆ స్థలంలో ఎవరూ లేరని స్థానికులు ఎవరినడిగినా ఇట్టే చెబుతారు. తునికి చెందిన ఒక వ్యక్తి సర్వే నంబరు 268/4 లో 1.25 సెంట్లు భూమి కొన్నట్టు డాక్యుమెంట్లు అధికారులకు అందజేశాడు.1995లో రెవెన్యూ సర్వేలో ప్రభుత్వ భూమిగా నిర్థారించారు. దీనిపై 2003లో జేసీ కోర్టును పిటీషనర్ ఆశ్రయించగా, జేసీ ఆదేశాల మేరకు మున్సిపల్ కాలువకు 22 సెంట్లు భూమి విడిచిపెట్టేశారు. జేసీ కోర్టుకు వెళ్లిన వ్యక్తికి తన పేరుతో 53 సెంట్లు 2005లో పట్టా ఇచ్చారు. వెబ్ ల్యాండ్‌లో మాత్రం ఆ భూమి రెవెన్యూ పోరంబోకుగానే ఉంది. అయినా సరే తన అధికార దర్పాన్ని చూపించి కబ్జాకు పాల్పడ్డాడు. కొనుగోలు ఇంత ... ఆక్రమణ అంత... అధికారికంగా కొనుగోలు చేసింది 53 సెంట్లే. కానీ ఆ భూమికి ఆనుకుని మురుగు డ్రై¯ŒSకు చెందిన 22 సెంట్లు, పోలీస్ క్వార్టర్స్ సమీపాన 10 సెంట్లనూ తన ఖాతాలో వేసేసుకున్నాడు.ఈ మొత్తం భూమి 1500 గజాలు పైబడి ఉంది. అక్కడ గజం రూ.లక్ష పలుకుతుంది.అంటే అక్షరాలా రూ.15 కోట్లు విలువైన స్థలం అధికారాన్ని అడ్డంపెట్టుకుని బినామీ పేర్లతో తమ్ముడు చేతుల్లోకి పోయింది. మున్సిపల్ కాలువ ఆనుకుని ఉన్న థియేటర్‌ను కూడా తమ్ముడు బినామీలే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ఆ స్థలం, కబ్జా చేసిన స్థలాన్ని చదును చేసేసి కంచె ఏర్పాటు చేశారు. ప్లాట్లుగా అమ్మకానికి పెట్టినా భూమి రికార్డు విషయం తెలుసుకున్న వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. కాలువ మూసి వేసినా పురపాలకులు మాత్రం తమ్ముడు అడుగులకు మడుగులొత్తుతూనే ఉన్నారు. -
కోనేరు సేవలు చిరస్మరణీయం
టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు సంతాపసభలో నారా లోకేష్ కొత్తగూడెం: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కోనేరు నాగేశ్వరరావు సేవలు చిరస్మరణీయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బుధవారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో జరిగిన కోనేరు నాగేశ్వరరావు సంతాపసభకు హాజరై.. కోనేరు చిత్రపటానికి నివాళి అర్పించి ప్రసంగించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటివరకు కోనేరు టీడీపీలో అంకితభావంతో సేవలందించారని కొనియాడారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పదవుల కోసం అనేకమంది పార్టీలు మారుతున్నప్పటికీ ఆయన చనిపోయేంతవరకు ఒకే పార్టీలో ఉండి సేవలందించడం అభినందనీయమన్నారు. కోనేరు క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రతి కార్యకర్త అలవర్చుకోవాలని సూచించారు. పార్టీకి వెన్నంటి ఉండే కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం పక్కనే కోనేరు విగ్రహాన్ని ఏర్పాటుచేసి విగ్రహావిష్కరణకు ఏపీ సీఎం చంద్రబాబును తీసుకువస్తామని తెలిపారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..: కోనేరు అనుచరులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, పార్టీని నమ్ముకున్న వారిని కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో కోనేరు విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ..: పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్రమంతా పర్యటిస్తానని గతంలో కోనేరు చెప్పారని గుర్తు చేశారు. ఈ సంతాపసభలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సినీ నటుడు నందమూరి తారకరత్న, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, చేకూరి కాశయ్య, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మాళోతు రాందాస్ నాయక్, కోనేరు కుటుంబ సభ్యులు కోనేరు పూర్ణచందర్రావు, కోనేరు సత్యనారాయణ (చిన్ని) తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాయకులకు మరణం లేదు: మంత్రి తుమ్మల నిరంతరం ప్రజా సేవకు అంకితమయ్యే నాయకులకు మరణం ఉండదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శ్రీనగర్ కాలనీలోని కోనేరు నాగేశ్వరరావు స్వగృహంలో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి హాజరై..కోనేరు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నిజాయితీ, నిబద్దతకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి కొనేరని కొనియాడారు. ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని స్మరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
అధికారిక లాంఛనాలతో కోనేరు అంత్యక్రియలు
భారీగా హాజరైన ప్రజలు, అభిమానులు ప్రభుత్వం తరఫున నివాళులర్పించిన జేసీ దివ్య అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ బాలసాని, ఎమ్మెల్యేలు జలగం, సండ్ర కొత్తగూడెం: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు కోనేరు నాగేశ్వరరావు అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో జరిగాయి. కొత్తగూడెం మండలం పెనగడపలోగల ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన అంత్యక్రియలు అభిమానులు, ప్రజల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీలో కోనేరు స్వగృహంలో తొలుత ఆయన మృతదేహంపై కొత్తగూడెం ఆర్డీఓ ఎం.వీ.రవీంద్రనా«థ్ జాతీయ పతాకాన్ని కప్పి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి కోనేరు భౌతిక కాయంతో అంతిమయాత్ర పోలీసు కవాతు, మేళ తాళాలతో ప్రారంభమైంది. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు, ప్రజలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమయాత్ర ఎం.జీ.రోడ్, బస్టాండ్, పోస్టాఫీస్, హెడ్డాఫీస్, రామవరంల మీదుగా పెనగడపలోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది. అడుగడుగునా పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతోపాటు ట్రాఫిక్‌ను నియంత్రించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ దేవరాజన్ దివ్య ఆదేశాల మేరకు కొత్తగూడెం ఆర్డీఓ ఎం.వి.రవీంద్రనా«ద్ అంత్యక్రియల నిర్వహణ ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ క్షేత్రానికి కోనేరు భౌతిక కాయం చేరుకున్న అనంతరం ఇన్చార్జి కలెక్టర్ దివ్య ప్రభుత్వం తరఫున పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పోలీసులు గౌరవ సూచికంగా గాలిలోకి మూడు పర్యాయాలు కాల్పులు జరుపగా కోనేరు పెద్ద కుమారుడు కోనేరు పూర్ణచందర్రావు ఆయన చితికి నిప్పంటించారు. ఈ అంతిమ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, తహసీల్దార్ అశోక చక్రవర్తి, ఎంపీడీఓ మనోహర్‌రెడ్డి, కోనేరు చిన్న కుమారుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని), కుమార్తె వల్లూరిపల్లి ఉషారాణి, ఇతర కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు , ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అంతిమ వీడ్కోలు పలికారు. -
కోనేరుకు పలువురి నివాళి
-
కోనేరు ఇకలేరు.
అనారోగ్యంతో కన్నుమూత నేడు బాలకష్ణ, లోకేష్ రాక కొత్తగూడెం :అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు(78) కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీలో గల తన స్వగృహంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కోనేరు మృతి ఇక్కడి ప్రజలను కలచివేసింది. 1937, ఆగస్టు 30న కృష్ణా జిల్లా మారేడుమాక గ్రామంలో అచ్యుతరామయ్య, సీతమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించిన కోనేరు నాగేశ్వరరావు.. 1954లో ఫారెస్టు కాంట్రాక్టర్‌గా కొత్తగూడెం వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డారు. 1959లో ధనలక్ష్మిని వివాహం చేసుకున్న ఆయనకు కూతురు ఉషారాణి, కొడుకులు పూర్ణచందర్రావు, సత్యనారాయణ ఉన్నారు. 1982 నుంచి టీడీపీలోనే... 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరిన ఆయన.. 1983లో తొలిసారిగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1985, 1994లో ఇదే నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా గెలిచారు. 1988లో ఎన్టీఆర్ కేబినెట్లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 1994 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. 1985లో భద్రాచలం ట్రస్టుబోర్డు చైర్మన్‌గా, పాల్వంచ ఏపీ స్టీల్స్ చైర్మన్‌గా పనిచేశారు. లయన్స్ క్లబ్ గవర్నర్‌గా... సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే కోనేరు.. లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశారు. 13 ఏళ్లుగా లయన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ కన్వీనర్‌గా సేవలందిస్తున్న ఆయన.. ప్రస్తుతం లయన్స్ క్లబ్ 324 డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఉన్నారు. 1981 నుంచి క్లబ్ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేల సంతాపం కోనేరు నాగేశ్వరరావు మరణవార్త తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెంలోని కోనేరు స్వగృహానికి వెళ్లి సంతాపం తెలిపారు. కోనేరు కుమారులు పూర్ణచందర్రావు, సత్యనారాయణను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోనేరు నాగేశ్వరరావు మృతి జిల్లా రాజకీయాలకు తీరని లోటని అన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, పువ్వాడ అజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్, సున్నం రాజయ్య, కోరం కనకయ్య, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కొండబాల కోటేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుల్లూరి బ్రహ్మయ్య, టీడీపీ పాలేరు, వైరా నియోజకవర్గాల ఇన్చార్జిలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, మాళోతు రాందాస్‌నాయక్, కాంగ్రెస్ నాయకుడు ఎడవల్లి కృష్ణ, సౌత్ సెంట్రల్ రైల్వే వినియోగదారుల సంక్షేమ కమిటీ సభ్యుడు జేవీఎస్.చౌదరి తదితరులు కోనేరు భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండేటి యేసుపాదం కోనేరు భౌతికకాయాన్ని సందర్శించి.. సంతాపం తెలిపారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా కోనేరు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. నేడు ‘గూడెం’ బంద్‌కు పిలుపు మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు మృతికి సంతాపంగా శనివారం నియోజకవర్గ బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని తెలంగాణ ప్రైవేటు ఐటీఐ అసోసియేషన్ అధ్యక్షుడు జేవీఎస్.చౌదరి కోరారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు బంద్ పాటించాలని మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండేటి యేసుపాదం, కాంగ్రెస్ నాయకుడు ఎంఏ.రజాక్ పిలుపునిచ్చారు. రేపు పెనగడపలో అంత్యక్రియలు కోనేరు నాగేశ్వరరావు అంత్యక్రియలు కొత్తగూడెం మండలం పెనగడపలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
యాదగిరిగుట్ట కోనేరులో మునిగి వ్యక్తి మృతి
యాదగిరిగుట్ట(నల్లగొండ): శ్రీలక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి ఆలయ కోనేరులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం యాదగిరిగుట్టలో జరిగింది. వివరాలు.. హైదరాబాద్‌లోని ఉప్పుగూడాకు చెందిన బావాబామ్మర్దులు శ్రీలక్ష్మినరసింహస్వామి దర్శనానికి యాదగిరిగుట్టకు వచ్చారు. ఈ క్రమంలో ఉదయం పుణ్యస్నానం ఆచరించడానికి కోనేరు వద్దకు వెళ్లారు. స్నానం చేస్తున్న సమయంలో బావ దుద్దిల రాజు(28)కు ఫిడ్స్ రావడంతో కోనేరులో మునిగి మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పవన్‌కు జై కొడదామా... లేదంటే...