శ్రీలక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి ఆలయ కోనేరులో పడి మృతిచెందాడు.
యాదగిరిగుట్ట(నల్లగొండ): శ్రీలక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి ఆలయ కోనేరులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం యాదగిరిగుట్టలో జరిగింది. వివరాలు.. హైదరాబాద్‌లోని ఉప్పుగూడాకు చెందిన బావాబామ్మర్దులు శ్రీలక్ష్మినరసింహస్వామి దర్శనానికి యాదగిరిగుట్టకు వచ్చారు. ఈ క్రమంలో ఉదయం పుణ్యస్నానం ఆచరించడానికి కోనేరు వద్దకు వెళ్లారు. స్నానం చేస్తున్న సమయంలో బావ దుద్దిల రాజు(28)కు ఫిడ్స్ రావడంతో కోనేరులో మునిగి మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.