బాబు నిలువునా మోసం చేశాడు | YSRCP Leaders takes on chandrababu | Sakshi
Sakshi News home page

బాబు నిలువునా మోసం చేశాడు

Published Thu, Jun 25 2015 1:37 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

బాబు నిలువునా మోసం చేశాడు - Sakshi

బాబు నిలువునా మోసం చేశాడు

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. గురువారం అనంతపురం ఆర్డీవో కార్యాలయం వద్ద రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆగమేఘాలపై పట్టిసీమ నిర్మిస్తున్న చంద్రబాబుకు హంద్రీ - నీవా ప్రాజెక్టు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు.

ఈ ధర్నాలో పాల్గొన్న పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ... ఓటుకు కోట్లు వ్యవహారంలో బిజీగా ఉన్న చంద్రబాబుకు రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని చంద్రబాబును నాగిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ మహాధర్నాలో జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా :

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా:
వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, తెల్లం బాలరాజుతోపాటు పార్టీ నేతలు వంకా రవీంద్రనాథ్, టి. వాసుబాబు, తలారి వెంకట్రావ్, కొఠారు రామచంద్రరావు, కారుమంచి రమేష్, తెల్లం గోళ్ల శ్రీలక్ష్మి, బండి అబ్బులు పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఎడ్ల బండ్లపై వినూత్న ర్యాలీ నిర్వహించారు.
 

వైఎస్ఆర్ జిల్లా :

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలను నెరవేర్చాలని వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం డిమాండ్ చేశారు. అందుకోసం కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి, అంజాద్బాషా, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

విశాఖపట్నం జిల్లా:
ప్రజా సమస్యలపై కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బి ముత్యాల నాయుడు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు ఉషాకిరణ్, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గ ఇంఛార్జ్లతోపాటు పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

శ్రీకాకుళం జిల్లా:
శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, ఎమ్మెల్యేలు వి.కళావతి, కంబాల జోగులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా:
రైతుల సమస్యలపై విజయనగరం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ సీపీ మహాధర్నా నిర్వహించింది. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే రాజేంద్ర దొర, కేంద్ర పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, అప్పలనాయుడుతోపాటు నెల్లిమర్ల, గజపతినగరం కన్వీనర్లు డా.సురేష్ బాఉ, శ్రీనివాసరావు, అరకు నియోజకవర్గ పార్లమెంట్ పరిశీలకురాలు కల్యాణి పాల్గొన్నారు.

కృష్ణాజిల్లా :
విజయవాడ: రైతుల సమస్యలపై సబ్ కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పనతోపాటు పార్టీ నేతలు కె.పార్థసారధి, గౌతంరెడ్డి పార్టీ  కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోచిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సునీల్కుమార్, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, ఆదిమూలంతోపాటు నాయకులు భూమన కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.చిత్తూరు:  5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తన స్వార్ధం కోసం చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. ఏపీని ఓ దొంగ పరిపాలిస్తున్నారన్నారు. అబద్దాలతో సీఎం అయి ఇప్పటికీ రైతుల సమస్యలు తీర్చలేదని విమర్శించారు. 20 శాతం రైతులకు కూడా విత్తనాలు పంపిణీ చేయని ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డ ఘనత చంద్రబాబుదన్నారు.


గుంటూరు జిల్లా :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వరంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ముస్తఫా, డా.గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement