
'సంచి టీడీపీదైతే సరుకు కాంగ్రెస్‌ది'
హైదరాబాద్: చంద్రబాబుకు ఓటేస్తే విభజనకు ఓటేసినట్టేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ నాగిరెడ్డి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ భాగంగానే నాయకుల వలసలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సంచి టీడీపీదైతే సరుకు కాంగ్రెస్‌దని ఆయన ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మీరు టీడీపీ అధ్యక్షుడివా, సీమాంధ్ర కాంగ్రెస్ నేతవా అని ప్రశ్నించారు. 65 ఏళ్ల వయస్సులో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు హామీలు నకిలీ నోట్లలాంటివని అంతకుముందు విమర్శించారు. తన పాలన మళ్లీ తెస్తానని చంద్రబాబు చెప్పగలరా అని నాగిరెడ్డి ప్రశ్నించారు.