మానోళ్లకు పెద్ద పదవులు?
జోగిపేట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా వారికి కీలక పదవు లు దక్కే అవకాశం ఉంది. గజ్వేల్ అసెంబ్లీ నుంచి గెలిచిన టీ ఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో సీఎం పగ్గాలు చేపట్టనున్న విషయం తెల్సిందే. అయితే ప్రభుత్వ పాలనలో ప్రధాన భూ మికను పోషించే ప్రధాన కార్యదర్శి పదవి లేదా సీఎం పేషీలోని ముఖ్యమైన పదవుల కోసం జిల్లాకు చెందిన సీనియర్ ఐఏఎస్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిద్దరు కూడా జోగి పేట డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు కావడం గమనార్హం.
జోగిపేట ప్రభుత్వ కళాశాలలో చదువుకుని ఐఏఎస్ పూర్తి చేసి ఉన్నత పదవుల్లో ఉన్న నర్సింగరావు, నాగిరెడ్డిల కు కొత్తగా ఏర్పడబో యే తెలంగాణ రాష్ట్రంలో కీలక పదవు లు దక్కనున్నట్టు సమాచారం. ప్రస్తుతం నర్సింగరావు కోల్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నా రు. కాగా వి.నాగిరెడ్డి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి గా కొనసాగుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామానికి చెందిన సింగాయిపల్లి నర్సింగ్‌రావు 1976-1979లో జోగిపేట ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.
కాగా అందోల్ ని యోజకవర్గంలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటకు చెందిన నాగిరెడ్డి 1975లో జోగిపేటలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం కావడంతో వీరిద్దరికి ముఖ్యమైన బాధ్యతలను అప్పగించేందుకు టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. వీరిద్దరు కూడా జిల్లా కు చెందిన వారు కావడం విశేషం. ఇటీవల కేసీఆర్ గవర్నర్ వద్దకు వెళ్లిన సమయంలో నర్సింగరావు కూడా వెంట ఉన్న ట్టు సమాచారం. ఆయన్ను రాష్ట్ర సర్వీసులోకి తీసుకొచ్చేం దుకు సాంకేతిక సమస్యలు ఏమైనా ఎదురైతే నాగిరెడ్డి పేరును పరిశీలించనున్నారు. నాగిరెడ్డికి సీఎస్ లేదా సీఎం పేషీలో ఏదైనా ముఖ్య పదవిని కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. జోగిపేట కళాశాలకు చెందిన వీరిద్దరికి రాష్ట్రస్థాయిలో ముఖ్యపదవులు లభించనుండడంతో స్థానికులతోపాటు వారి స్నేహితులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.