bail sanctioned
-
లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్.. శరత్ చంద్రారెడ్డికి బెయిల్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన అరబిందో డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ముంజూరైంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. వివరాల ప్రకారం.. లిక్కర్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి తీహార్ జైలులో ఉన్నారు. అయితే, తన భార్య అనారోగ్యం దృష్ట్యా ఆమెను చూసుకోవాలని, అందుకు ఆరు వారాలు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ దీనిపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. తన నాయనమ్మ అంత్యక్రియల నిమిత్తం బెయిల్ కోరుతూ శరత్‌చంద్రారెడ్డి జనవరి ఆఖరి వారంలో పిటిషన్ దాఖలుచేయగా నాడు ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, తాజాగా తన భార్య అనారోగ్య కారణాల దృష్ట్యా శరత్ చంద్రారెడ్డి విజ్ఞప్తి మేరకు దిల్లీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఢిల్లీ మద్యం కేసులో నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: రేపటి వరకు లాస్ట్.. జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సర్కార్ వార్నింగ్.. -
ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిలు మంజూరు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పులివెందుల పూల అంగళ్ల కూడలి అల్లర్ల కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరైంది. నేడు సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా 2018 నాటి అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్ రవిని ఈ నెల 3న చెన్నై ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 4వ తేదీన పులివెందుల మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా... 14 రోజుల పాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే సోమవారం నాటికి రిమాండ్ గడువు ముగియడంతో బీటెక్ రవికి పులివెందుల కోర్టు బెయిలు మంజూరు చేసింది. (చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్) చదవండి: మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు! -
శశి థరూర్‌కు సాధారణ బెయిలు
న్యూఢిల్లీ: భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీలోని ఓ కోర్టు కాంగ్రెస్ నేత శశి థరూర్‌కు శనివారం సాధారణ బెయిలు మంజూరు చేసింది. ఓ సెషన్స్ కోర్టు జూలై 5నే తనకు ముందస్తు బెయిలు మంజూరు చేసిన విషయాన్ని థరూర్ కోర్టుకు తెలియజేశారు. తర్వాత జడ్జి ముందస్తు బెయిలును సాధారణ బెయిలుగా మారుస్తూ లక్ష రూపాయల బాండు, రూ.లక్ష ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించారు. సునంద 2014లో ఢిల్లీలోని ఓ హోటల్లో మృతి చెందారు. -
నటి నీలాణికి బెయిల్ మంజూరు
పెరంబూరు: నటి నీలాణికి సైదాపేట కోర్టు నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇటీవల తూత్తుక్కుడి కాల్పుల సంఘటనపై నటి నీలాణి పోలీసు దుస్తులు ధరించి వీడియోలో చిత్రీకరించిన విషయం, పోలీసులు ఆందోళన కారులపై కాల్పులు జరిపిన దృశ్యాలతో కూడిన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై వడపళనికి చెందిన రిషీ అనే వ్యక్తి గత మే నెల 22న వడపళని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ వీడియో తీసింది ఎవరని దర్యాప్తు చేయగా స్థానిక సాలిగ్రామం, అష్టలక్ష్మీనగర్కు చెందిన నటి నిలాణి అని తెలిసింది. దీంతో ఆమెను ఈ నెల 19వ తేదీన అరెస్ట్ చేసి సైదాపేట కోర్టులో హాజరు పరిచారు. ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు పుళల్ జైలుకు తరలించారు. కాగా నటి నిలాణి బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకుంది. ఆ పిటిషన్‌ను గురువారం విచారించిన కోర్టు నటి నీలానికి ‘పోలీసులకు సహకరించాలి, నగరం దాటి వెళ్లకూడదు’ లాంటి నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. -
ముంబైకి చేరుకున్న సల్మాన్‌ఖాన్
-
సల్మాన్‌కు బెయిల్
జోధ్‌పూర్: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. కృష్ణ జింకల్ని చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సల్మాన్‌కు జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. గురువారం ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడంతో రెండ్రోజులు జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించిన కండల వీరుడు బెయిల్‌పై విడుదల కాగానే నేరుగా ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. అయితే బెయిల్ మంజూరును రాజస్తాన్ హైకోర్టులో సవాలు చేస్తామని బిష్ణోయ్ తెగ ప్రతినిధి రామ్ నివాస్ తెలిపారు. సల్మాన్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తుపై శుక్రవారమే వాదనలు పూర్తి కాగా తీర్పును సెషన్స్ కోర్టు జడ్జి శనివారానికి వాయిదావేశారు. ఉదయం బెయిల్ పిటిషన్‌పై డిఫెన్స్, ప్రాసిక్యూషన్ న్యాయవాదులు మరోసారి వాదనలు వినిపించారు. తీర్పును న్యాయమూర్తి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం 3 గంటల సమయంలో జడ్జి తీర్పు వెలువరిస్తూ.. బెయిల్ కోసం రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు, అదే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని డిఫెన్స్ న్యాయవాదుల్ని ఆదేశించారు. బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో సల్మాన్ చెల్లెళ్లు అల్విరా, అర్పితలు కోర్టులోనే ఉన్నారు. కోర్టు నుంచి బెయిల్ పత్రాలు అందగానే జైలు అధికారులు సాయంత్రం 5.30 గంటల సమయంలో సల్మాన్‌ను విడుదల చేశారని.. అనంతరం పోలీసు పహారా మధ్య వ్యక్తిగత బాడీగార్డు షేరా వెంటరాగా జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారని పోలీసు అధికారి చెప్పారు. కొంతమంది అభిమానులు ఆయన కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. ట్రయల్ కోర్టు తీర్పును నిలుపుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను మే 7న విచారిస్తామని, అప్పుడు సల్మాన్ కోర్టుకు హాజరుకావాలని జడ్జి రవీంద్ర కుమార్ జోషి ఆదేశించారు. కాగా ఆయనను సిరోహి కోర్టుకు బదిలీ చేస్తూ శనివారం సాయంత్రం రాజస్తాన్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి ఉత్తర్వులు అందాయి. సాధారణ బదిలీల్లో భాగంగా మొత్తం 134 జడ్జీల్ని ట్రాన్స్ఫర్ చేయగా అందులో రవీంద్ర కుమార్ జోషి కూడా ఉన్నారు. 1998 అక్టోబర్‌లో ‘హమ్ సాథ్ సాథ్ ’హై సినిమా షూటింగ్ సమయంలో రెండు కృష్ణ జింకల్ని చంపిన నేరంపై గురువారం ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బాలీవుడ్లో హర్షం బెయిల్ మంజూరైన విషయం తెలియగానే సల్మాన్ స్నేహితులు, సన్నిహితులు, బాలీవుడ్ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. సల్మాన్ నటిస్తున్న ‘రేస్ 3’ చిత్ర దర్శకుడు రెమో డిసౌజా మాట్లాడుతూ.. ‘సల్మాన్‌కు బెయిల్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. నటుడుగా, మానవత్వమున్న వ్యక్తిగా సల్మాన్‌ను అభిమానిస్తా’ అని చెప్పారు. ఆ చిత్ర నిర్మాత రమేష్ తౌరానీ మాట్లాడుతూ.. ‘సల్మాన్ విడుదల కావడం మాకు చాలా ముఖ్యం. మా ప్రార్థనలకు సమాధానం లభించింది. రేస్ 3 సినిమా నిర్మాణం దాదాపుగా పూర్తయింది’ అని చెప్పారు. హీరోయిన్ సోనాక్షి సిన్హా, నటులు సోనూ సూద్, నీల్ నితిన్ ముకేశ్, దర్శకుడు అనీస్ బజ్మీ తదితరులు సల్మాన్‌కు బెయిల్ రావడాన్ని స్వాగతించారు. సల్మాన్ విడుదలతో అహ్మదాబాద్‌లో సంబరాలు చేసుకుంటున్న విద్యార్థినులు -
మాధవన్ నాయర్‌కు బెయిల్
న్యూఢిల్లీ: యాంత్రిక్స్–దేవాస్ ఒప్పందం కేసులో ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. రూ.50 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి సమానమైన 2 పూచీకత్తులపై జడ్జి సంతోష్ స్నేహిమన్ శనివారం బెయిలిచ్చారు. బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను సీబీఐ వ్యతిరేకించింది. నిందితులకు బెయిల్ లభిస్తే వారు దేశం నుంచి పారిపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే నాయర్‌తో పాటు ఇస్రో మాజీ డైరెక్టర్ ఎ.భాస్కర్ నారాయణరావు, యాంత్రిక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఆర్ శ్రీధర్ మూర్తిలకు మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు రాని మరో ముగ్గురికి బెయిల్ నిరాకరించింది. వీడియో, మల్టీమీడియా సేవలందించే ఎస్–బ్యాండ్‌ను దేవాస్ మల్టీమీడియాకు అప్పగించడం ద్వారా యాంత్రిక్స్ కార్పొరేషన్ రూ.578 కోట్ల నష్టానికి కారణమైందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. -
పొలిటికల్ పంచ్ రవికిరణ్‌కు బెయిల్ మంజూరు
-
పొలిటికల్ పంచ్ రవికిరణ్‌కు బెయిల్ మంజూరు
పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌కు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శాసనమండలికి సంబంధించి అసభ్యకరంగా పోస్టు పెట్టారని టీడీపీ నాయకుడు టీడీ జనార్దన్ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు ఫిర్యాదు చేయగా, ఆయన పోలీసులకు అదే విషయంపై ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు తొలుత విచారణ పేరుతో పలుమార్లు వేధించడమే కాక అర్ధరాత్రి వచ్చి ఎవరో కూడా సరిగా చెప్పకుండా ఇంటినుంచి తీసుకెళ్లిపోయారు. చివరకు హైడ్రామా అనంతరం అరెస్టు చేశారు. ఆ తర్వాత పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తనపై అసభ్యకరంగా పోస్టు పెట్టారని రవికిరణ్ మీద ఫిర్యాదు చేయడంతో అక్కడ ఆయనను అరెస్టు చేశారు. ఈనెల 12న తుళ్లూరు పోలీసులు పీటీ వారంటు పెట్టి మంగళగిరి కోర్టులో సరెండర్ చేశారు. దాంతో కోర్టు ఈనెల 28వరకు రవికిరణ్‌కు రిమాండు విధించింది. ఆ తర్వాత రవికిరణ్ తరఫు న్యాయవాది బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు చేసిన కేసులో బెయిల్ వచ్చింది. విశాఖపట్నం కేసులో కూడా బెయిల్ కోసం అప్పీలు చేశారు. ఆ కేసులో ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. -
మాలెగావ్ కేసు: సాధ్వి ప్రజ్ఞకు బెయిల్ మంజూరు
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన 2008 నాటి మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌కు మాత్రం బెయిల్ నిరాకరించింది. వీళ్లిద్దరూ ఈ కేసులో గత ఎనిమిదేళ్లుగా జైల్లో ఉన్నారు. ఇటీవలే చికిత్స కోసం సాధ్వి ప్రజ్ఞను భోపాల్ ఆస్పత్రికి తరలించారు. గత సంవత్సరం వీళ్లిద్దరూ దాఖలుచేసిన బెయిల్ దరఖాస్తులను దిగువ కోర్టు కొట్టేయడంతో ఇద్దరూ బాంబే హైకోర్టులో అప్పీలు చేశారు. 2008 సెప్టెంబర్ 29వ తేదీన ముంబైకి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలెగావ్‌లో మోటార్ సైకిల్‌కు అమర్చిన రెండు బాంబులు పేలి ఏడుగురు మరణించారు, మరో వందమంది గాయపడ్డారు. ఈ కేసులో అదే సంవత్సరం అక్టోబర్‌లో సాధ్వి ప్రజ్ఞను, నవంబర్‌లో కల్నల్ పురోహిత్‌ను అరెస్టుచేశారు. అభినవ్ భారత్‌కు చెందిన వీళ్లిద్దరే పేలుళ్లకు కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే, ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేనందున సాధ్వి ప్రజ్ఞ సహా మరో ఐదుగురిపై ఆరోపణలను జాతీయ దర్యాప్తు సంస్థ ఉపసంహరించుకుంది. కానీ ముంబై ప్రత్యేక కోర్టు మాత్రం ఎన్ఐఏ చర్యను ప్రశ్నిస్తూ బెయిల్ నిరాకరించింది. ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
హైకోర్టు వద్దంది.. కిందికోర్టు ఇచ్చింది..
డీసీ సోదరులకు మాండేటరీ బెయిల్ సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) డెరైక్టర్లు టి.వెంకటరామిరెడ్డి, వినాయక రవిరెడ్డిల బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించినా.. కింది కోర్టులో మాత్రం వారికి మాండేటరీ బెయిల్ లభించింది. 60 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో వీరికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆధారాలను మాయం చేయరాదని, రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించడంతోపాటు దేశం విడిచి వెళ్లరాదని నాంపల్లి ఆరవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భాస్కర్‌రావు షరతు విధించారు. 60 రోజులుగా వీరు రిమాండ్‌లో ఉన్నారని... సీబీఐ దర్యాప్తు పూర్తిచేసి ఛార్జిషీట్ దాఖలు చేయని నేపథ్యంలో నేరవిచారణ చట్టం (సీఆర్సీపీ) సెక్షన్ 167(2) కింద తప్పనిసరిగా బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు న్యాయవాది చంద్రశేఖర్ వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసిం ది. వీరిద్దరినీ ఫిబ్రవరి 13న సీబీఐ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హైకోర్టులో ఏం జరిగిందంటే... తమ బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిందితులు గతం వారం హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరికి బెయిల్ మంజూరు చేయరాదని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రెండు రోజుల కింద రిజర్వు చేశారు. బుధవారం వీరి పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ దుర్గాప్రసాద్ తీర్పునిచ్చారు. -
భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు
భూమాకు బెయిల్ మంజూరు.. మరో 19 మందికి కూడా.. నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ సమావేశంలో జరిగిన సంఘటనపై నమోదైన కేసులో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి శుక్రవారం నంద్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు శివశంకర్, కొం డా రెడ్డి, కృపాకర్, దిలీప్, కరీముల్లా, మాజీ కౌన్సిలర్ ఏవీఆర్ ప్రసాద్, అజ్మీర్‌బాషాతో పాటు మరో 12 మందికి కూడా బెయిల్ మంజూ రు చేసినట్లు వైఎస్సార్సీపీ న్యాయవాదులు సూర్యనారాయణరెడ్డి, మనోహర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాజేశ్వరరెడ్డి తెలిపారు. గత నెల 31న నం ద్యాల పురపాలక సంఘ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మరో 19 మంది తనపై హత్యాయత్నం చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన టూటౌన్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీంతో భూమా నాగిరెడ్డితో పాటు మిగిలిన నిందితులు నవంబర్ ఒకటో తేదీన పోలీసుల సమక్షంలో హాజరవగా కోర్టు రిమాండ్ విధిం చింది. నంద్యాల మూడో అదనపు జిల్లా ఇన్చార్జి జడ్జిగా వ్యవహరిస్తున్న కర్నూలు ఒకటో అదనపు జిల్లా జడ్జి రామలింగారెడ్డి శుక్రవారం కేసును విచారించి బెయిల్ మంజూరు చేశారు. కాగా.. మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన 225/2014 కేసులో భూమా నాగిరెడ్డి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతుండటంతో ఆయనను రిమాండ్‌కు ఇవ్వలేదు. -
భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు