బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. కృష్ణ జింకల్ని చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సల్మాన్‌కు జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. గురువారం ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడంతో రెండ్రోజులు జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించిన కండల వీరుడు బెయిల్‌పై విడుదల కాగానే నేరుగా ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. అయితే బెయిల్ మంజూరును రాజస్తాన్ హైకోర్టులో సవాలు చేస్తామని బిష్ణోయ్ తెగ ప్రతినిధి రామ్ నివాస్ తెలిపారు.