Deer Hunting
-
Photo Feature: కెమెరాకు చిక్కిన వేటగాళ్లు
సాక్షి, అచ్చంపేట: గత నెల 3, 7 తేదీల్లో పది మంది వేటగాళ్లు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో ఉచ్చులు బిగించి.. అందులో చిక్కిన దుప్పి, సాంబార్లను గొడ్డళ్లతో నరికి చంపారు. వాటిని ముక్కలు చేసి తీసుకెళ్లారు. అయితే.. రిజర్వ్ ఫారెస్ట్‌లో బిగించిన కెమెరా ట్రాప్లను నెలకొకసారి అధికారులు పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం కెమెరా ట్రాప్లను పరిశీలిస్తుండగా, అచ్చంపేట గుంపన్‌పల్లికి చెందిన పది మంది వన్యప్రాణుల్ని వేటాడుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. వీరిని అదుపులోకి తీసుకుని ఈనెల 5న అచ్చంపేట కోర్టుకు తరలించగా, సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారని రేంజర్ మనోహర్ తెలిపారు. ఈ చిత్రాలను అటవీ అధికారులు సోమవారం విడుదల చేశారు. చదవండి: కాల్పుల విరమణ దిశగా మావోలు? -
యాదాద్రిలో కలకలం: జింక మాంసంతో విందు
సాక్షి, యాదాద్రి: జింకను వేటాడటమే కాక దాన్ని వండుకుని తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోత్కూర్ మండలంలోని కొండాపురం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. జింకను వేటాడి, వండుకుని తిన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై అధికారులు గురువారం దర్యాప్తు చేపట్టగా జింక మాంసాన్ని ఆరగించిన విందులో రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
ముంబైకి చేరుకున్న సల్మాన్‌ఖాన్
-
సల్మాన్‌కు బెయిల్
జోధ్‌పూర్: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. కృష్ణ జింకల్ని చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న సల్మాన్‌కు జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. గురువారం ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడంతో రెండ్రోజులు జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించిన కండల వీరుడు బెయిల్‌పై విడుదల కాగానే నేరుగా ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. అయితే బెయిల్ మంజూరును రాజస్తాన్ హైకోర్టులో సవాలు చేస్తామని బిష్ణోయ్ తెగ ప్రతినిధి రామ్ నివాస్ తెలిపారు. సల్మాన్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తుపై శుక్రవారమే వాదనలు పూర్తి కాగా తీర్పును సెషన్స్ కోర్టు జడ్జి శనివారానికి వాయిదావేశారు. ఉదయం బెయిల్ పిటిషన్‌పై డిఫెన్స్, ప్రాసిక్యూషన్ న్యాయవాదులు మరోసారి వాదనలు వినిపించారు. తీర్పును న్యాయమూర్తి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం 3 గంటల సమయంలో జడ్జి తీర్పు వెలువరిస్తూ.. బెయిల్ కోసం రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు, అదే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని డిఫెన్స్ న్యాయవాదుల్ని ఆదేశించారు. బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో సల్మాన్ చెల్లెళ్లు అల్విరా, అర్పితలు కోర్టులోనే ఉన్నారు. కోర్టు నుంచి బెయిల్ పత్రాలు అందగానే జైలు అధికారులు సాయంత్రం 5.30 గంటల సమయంలో సల్మాన్‌ను విడుదల చేశారని.. అనంతరం పోలీసు పహారా మధ్య వ్యక్తిగత బాడీగార్డు షేరా వెంటరాగా జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారని పోలీసు అధికారి చెప్పారు. కొంతమంది అభిమానులు ఆయన కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. ట్రయల్ కోర్టు తీర్పును నిలుపుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను మే 7న విచారిస్తామని, అప్పుడు సల్మాన్ కోర్టుకు హాజరుకావాలని జడ్జి రవీంద్ర కుమార్ జోషి ఆదేశించారు. కాగా ఆయనను సిరోహి కోర్టుకు బదిలీ చేస్తూ శనివారం సాయంత్రం రాజస్తాన్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి ఉత్తర్వులు అందాయి. సాధారణ బదిలీల్లో భాగంగా మొత్తం 134 జడ్జీల్ని ట్రాన్స్ఫర్ చేయగా అందులో రవీంద్ర కుమార్ జోషి కూడా ఉన్నారు. 1998 అక్టోబర్‌లో ‘హమ్ సాథ్ సాథ్ ’హై సినిమా షూటింగ్ సమయంలో రెండు కృష్ణ జింకల్ని చంపిన నేరంపై గురువారం ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బాలీవుడ్లో హర్షం బెయిల్ మంజూరైన విషయం తెలియగానే సల్మాన్ స్నేహితులు, సన్నిహితులు, బాలీవుడ్ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. సల్మాన్ నటిస్తున్న ‘రేస్ 3’ చిత్ర దర్శకుడు రెమో డిసౌజా మాట్లాడుతూ.. ‘సల్మాన్‌కు బెయిల్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. నటుడుగా, మానవత్వమున్న వ్యక్తిగా సల్మాన్‌ను అభిమానిస్తా’ అని చెప్పారు. ఆ చిత్ర నిర్మాత రమేష్ తౌరానీ మాట్లాడుతూ.. ‘సల్మాన్ విడుదల కావడం మాకు చాలా ముఖ్యం. మా ప్రార్థనలకు సమాధానం లభించింది. రేస్ 3 సినిమా నిర్మాణం దాదాపుగా పూర్తయింది’ అని చెప్పారు. హీరోయిన్ సోనాక్షి సిన్హా, నటులు సోనూ సూద్, నీల్ నితిన్ ముకేశ్, దర్శకుడు అనీస్ బజ్మీ తదితరులు సల్మాన్‌కు బెయిల్ రావడాన్ని స్వాగతించారు. సల్మాన్ విడుదలతో అహ్మదాబాద్‌లో సంబరాలు చేసుకుంటున్న విద్యార్థినులు -
జింకల మాంసం విక్రయ కేంద్రంపై దాడి
ముస్తాబాద్(సిరిసిల్ల): వన్యప్రాణులను వేటాడి, వధించి విక్రయిస్తున్న కేంద్రంపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా ఒక జింకతో పాటు, మరో రెండు జింకల తలలు, మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఒక వేటగాడిని అదుపులోకి తీసుకోగా, ఇద్దరు పరారయ్యారు. వివరాలు.. ముస్తాబాద్ మండలం మోహినికుంట శివారులో జింక మాంసం విక్రయిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు విక్రయ కేంద్రంపై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ వేటగాళ్లు సూత్రం రాజయ్య(44), వానరాశి ఎల్లయ్య(45), ఉబిది యాదగిరి(30) జింక మాంసం విక్రయిస్తున్నారు. పోలీసులను చూసిన యాదగిరి, ఎల్లయ్య పరారు కాగా, రాజయ్య పోలీసులకు చిక్కాడు. మధ్యాహ్నం సమీప అడవుల నుంచి మూడు జింకలను వేటాడి తెచ్చారు. ఇందులో రెండు పిల్ల జింకలను కోసి మాంసం విక్రయించే క్రమంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. గాయపడ్డ తల్లి జింకతోపాటు, మాంసం, రెండు ద్వి చక్రవాహనాలను స్వా«ధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల చట్టం కింద పరారీలో ఉన్న ఎల్లయ్య, యాదగిరితోపాటు పట్టుబడ్డ రాజయ్యపై కేసులు నమోదు చేసినట్లు అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సరిత తెలిపారు. గాయపడ్డ జింకకు వైద్యం అందించి కరీంనగర్ డీర్ పార్క్‌కు తరలిస్తామన్నారు. -
మంజీరా’ వద్ద జింకల వేట
► నదీ పరీవాహక పరిధిలో పట్టుబడిన వేటగాళ్లు ► నిందితుల వద్ద రైఫిల్, పిస్టల్, కత్తులు స్వాధీనం మనూరు(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మంజీరా పరీవాహకంలో కర్ణాటకలోని బీదర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు వేటగాళ్లు జింకలను, ఇతర వన్యప్రాణులను వేటాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలు.. బీదర్ ప్రాంతం నుంచి డస్టర్ వాహనం (ఏపీ 11ఏఆర్ 3600)లో మోర్గి మీదుగా నాగల్గిద్ద వైపు ఓ వేటగాళ్ల ముఠా వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆ వాహనాన్ని మోర్గి మోడ్ వద్ద పోలీసులు తనిఖీ చేయగా పెద్దఎత్తున ఆయుధాలు లభించాయి. వాహనంలో ముగ్గురు వ్యక్తులతోపాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు. వారిలో బీదర్‌కు చెందిన సయ్యద్ ఓవైసీ ఖాద్రి (31), హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ నజీరుద్దీన్ తాపక్ (48), మహ్మద్ నయీమొద్దీన్ (40)ను విచారించి.. వణ్యప్రాణుల వేటకు వచ్చినట్టు నిర్ధారించారు. వాహనంలో 0.22 రైఫిల్, ఒక మ్యాగ్జిన్ తుపాకీ, పిస్టల్, టార్చిలైట్, రెండు కత్తులు, కటింగ్ ప్లేయర్, తదితర పరికరాలు లభించాయి. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ యాదగిరి రాజు ఆదివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ సైదానాయక్ మాట్లాడుతూ.. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులను వేటాడేందుకు కొందరు యత్నిస్తున్నారన్నారు. కాగా, నాగల్గిద్ద మండలం బీదర్‌కు సమీపంలో ఉండటంతో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
కృష్ణజింకల కళేబరాలు స్వాధీనం
నిందితుల అరెస్టు: చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ సాక్షి, హైదరాబాద్: అంతరించి పోతున్న జంతు జాతికి చెందిన 2 కృష్ణ జింకల (బ్లాక్‌బక్) కళేబరాలు, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ మనోరంజన్ భాంజా వెల్లడించారు. వీటితోపాటు ఆరు బూడిద రంగు కుందేళ్లు, ఆరు కంజు పిట్టలు, 27 బుడక పిట్టలు, పాము మెడ కలిగిన కొంగ, అడవిబాతు (నీటి) కళేబరాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి మాంసాన్ని అమ్ముతున్న పాతబస్తీకి చెందిన సయ్యద్ జమీర్‌ను, సరఫరా చేసిన మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని దండుపల్లికి చెందిన రాజేశ్‌లను సోమవారం రాత్రి పోలీ సులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న కళేబరాలు, నిందితులను మంగళవారం అరణ్యభవన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ట్రాన్సిట్ రిమాండ్ కింద అటవీ అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారని భాంజా తెలిపారు. వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ శంకరన్, హైదరాబాద్ జిల్లా అటవీ అధికారి సీపీ వెంకటరెడ్డితో కలసి ఆయన మీడి యాతో మాట్లాడుతూ... వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ ఒకటిలో ఉన్న కృష్ణజింకలను చంపిన వారికి, కనీస జరిమానా రూ.10వేలు మొదలుకుని ఎంతైనా వేయవచ్చునని, నాన్‌బెయిలబుల్ కేసు కింద మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చని చెప్పారు. భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్న జింకల వేట తదనంతర పరిణామాల పట్ల అటవీశాఖ పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయంలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న జింకలు, ఇతర జంతువుల వేటపై వీసీ, సీఎస్ఓతో చర్చిం చినట్లు ఓఎస్డీ శంకరన్ తెలిపారు. వర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిలో పచ్చగడ్డి, నీటిని ఏర్పాటు చేసి జంతువులను అక్కడకు తరలించాలని వర్శిటీ అధికారులకు సూచించామన్నారు. -
వన్యప్రాణుల వేటపై విచారణ జరిపించాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో మూడేళ్లుగా సాగుతన్న వన్య ప్రాణుల వేటపై సమగ్ర దర్యాప్తు చేసి నేరస్తులను శిక్షించాలని సీఎం కేసీఆర్‌కు బీజేఎల్పీ నేత జి.కిషన్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. దీంతోపాటు రాష్ట్రంలో జరిగిన వన్యప్రాణుల వేట, తదనందర సంఘటనలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సీఎంకు శుక్రవారం రాసిన లేఖలో కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులైన అధికారులు, వ్యక్తులపై కఠినంగా వ్యవహరించి వన్యప్రాణులను సంరక్షించాలన్నారు. గత నెల 19న జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన జింకల వేట విషయాన్ని అసెంబ్లీలో తాను సీఎం దృష్టికి తీసుకొచ్చానని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షిస్తామని సీఎం హామీ ఇచ్చారని, కానీ ఆచరణలో ప్రభుత్వ చర్యలు ఏ మాత్రం ఆశించిన విధంగా లేవని అన్నారు. నేరస్తుల అరెస్టులో తాత్సారం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ వేటలో పాల్గొన్న ముఠా సభ్యులు అటవీ అధికా రులపై దాడి చేసి తుపాకులతో చంపే స్తామని బెదిరించినా వారిపై హత్యా యత్నం కేసు ఎందుకు నమోదు చేయ లేదని ఆయన ప్రశ్నించారు. -
‘నిందితుడు మంత్రికాన్వాయ్‌లో తిరుగుతుంటే...’
హైదరాబాద్: మహాదేవ పురం జింకల వేట కేసులో అధికారపార్టీకి చెందిన నేతలు ఉన్నారని, రెండేళ్ళుగా జింకల వేట సాగుతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారని తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి కాన్వాయ్‌లో నిందితుడు అక్బర్ ఖాన్ తిరుగుతున్నా ఎందుకు ఇంతవరకూ పట్టుకోలేదని అడిగారు. తుపాకులు చూపి దాడులు చేస్తే ఎందుకు కేసులు పెట్టరని ప్రశ్నించారు. తెలంగాణలో వన్య ప్రాణి చట్టం అమలు కావటం లేదని.. సీఎంకు చిత్త శుద్ధి ఉంటే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు దోషులను పక్కన పెట్టి.. కిరాయి దోషులను పట్టుకున్నారని, ప్రభుత్వం న్యాయ విచారణ జరపక పోతే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. -
దుప్పుల వేట కేసులో మరో ఇద్దరు అరెస్టు
భూపాలపల్లి(ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవపూర్ దుప్పుల వేట ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం పరిసరాల్లో అజ్ఞాతంలో ఉన్న ఏ4 నిందితుడు అక్బర్‌ఖాన్, హంటర్ మున్నాలను సీఐ చంద్రభాను నేతృత్వంలో పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మార్చి 19వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటనలో పాల్గొన్న వారి కోసం విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులు కాళేశ్వరం చాకిగుంట వద్ద ఉండగా పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. -
దుప్పులను వేటాడినోళ్లను వదలం: ఈటల
సాక్షి, కరీంనగర్: మహదేవ్పూర్ అడవుల్లో జరిగిన దుప్పుల వేట కేసులో నిందితులను వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ కేసులో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించేది లేదని, అధికారి పార్టీ వారైనా శిక్షార్హులేనన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తమ పార్టీ వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంథనిలో దళిత యువకుడు మధుకర్ సంఘటనపైనా సమగ్ర విచారణకు ఆదేశించామని, వాస్తవాలు త్వరలోనే వెల్లడవుతాయని అన్నారు. ప్రేమించుకున్న ఇద్దరినీ పెద్దలు కాదనడంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో మధుకర్ మృతి చెందినట్లు అతని మేనమామ పాల్ చెబుతున్నారని, ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కులాలు 70 ఏళ్ల కిందటే పోయాయని, దళిత యువకుడిని ప్రేమ, పెళ్లికి దూరం చేయడాన్ని ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. మహదేవ్పూర్, మంథని సంఘటనలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా రబీ ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సారి అంచనాకు మించి ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావించి రాష్ట్ర వ్యాప్తంగా అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ ధాన్యం తడవకుండా, నిల్వ చేసేందుకు సరిపడా గన్నీసంచులు, టార్పాలిన్లు, గోదాములను సిద్దం చేశామని మంత్రి చెప్పారు. కాళేశ్వరం, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు తదితర పుణ్యక్షేత్రాలను భక్తుల దర్శనీయ కేంద్రాలుగా, పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని ఈటల రాజేందర్ అన్నారు. -
దుప్పుల వేట కేసులో మరొకరి అరెస్ట్
మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో జరిగిన దుప్పులవేట కేసులో ఏ5 ముద్దాయి నెన్నెల గట్ట య్యను శుక్రవారం అరెస్టు చేసి మంథని కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ చంద్రభాను తెలిపారు. ఈ కేసు లో ప్రధాన నిందితుడు షికారు సత్యం, అస్రార్ ఖురేషీ, కరీముల్లా ఖాన్ ఇప్పటికే పోలీసులకు లొంగి పోగా, వారిని రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ వేటలో కీలకపాత్ర పోషించిన ఏ4 అక్బర్ ఖాన్‌తోపాటు అతడి అనుచరుడు నెన్నెల గట్టయ్య కోసం పది రోజులు గా పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు గట్టయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నేడు లొంగిపోనున్న అక్బర్‌ఖాన్! దుప్పుల వేట కేసులో ఏ4 నింది తుడు మహదేవపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు హాసీనాభాను భర్త, టీఆర్ఎస్ నేత అక్బర్‌ఖాన్ శనివా రం కోర్టులో లొంగిపోతున్నట్లు అతడి కొడుకు అమీర్‌ఖాన్ వాట్సాప్ లో పోస్టు చేశాడు. ఈ వేటలో అక్బర్ తోపాటు ఓ విలేకరి కూడా ఉన్నట్లు అతడి కొడుకు అమీర్ ఖాన్ మెసేజ్ లో పేర్కొన్నాడు. -
పరారైన వేటగాళ్లు ఒంగోలులో..
♦ ఓ భూస్వామి ఇంట ఆశ్రయం ♦ ఏడుగురికి ఇద్దరు సహాయకులు ♦ ముగ్గురి లొంగుబాటు, పరారీలో మిగిలిన వారు ♦ కరీంనగర్, హైదరాబాద్‌లో గాలిస్తున్న ప్రత్యేక బృందాలు సాక్షి, భూపాలపల్లి: రోజుకో మలుపు తిరుగుతున్న దుప్పుల వేట కేసులో ప్రధాన నిందితులు ఏపీలో ఓ భూస్వామి ఇంట ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు లొంగిపోగా మిగిలిన ఆరుగురు పరారీలో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో దుప్పులను వేటా డిన కేసుకు సంబంధించి తొమ్మిది మందిపై పోలీసు శాఖ అభియోగం మోపింది. అయితే, కేసులో కీలక పాత్ర పోషించిన ఏ 4 నింది తుడు అక్బర్‌ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నా డు. ఘటన జరిగిన తర్వాత ఐదు రోజుల పాటు అతను మహదేవపూర్‌లో స్వేచ్ఛగా తిరిగాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో గత శుక్రవారం రాత్రి నలువాల సత్యనారాయణ, అస్రార్ఖాన్, ఖలీముల్లా ఖాన్లు లొంగిపోయారు. వీరి లొంగుబాటు వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించి అక్బర్ ఖాన్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మహదేవపూర్ ప్రాంతంలో దగ్గరి సంబంధా లున్న ఒంగోలుకు చెందిన భూస్వామి వద్దకు వీరు చేరుకున్నట్లు తెలుస్తోంది. మూడు బృందాలు దుప్పులను వేటాడి చంపిన నిందితులను పట్టుకునేందుకు పోలీసుశాఖ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఫజల్ మహ్మద్ ఖాన్ కోసం ఓ బృందం హైదరాబాద్ లో గాలిస్తుండగా గోదావరిఖని, సెంటినరీ కాలనీకి చెందిన నిందితుల కోసం మరో బృం దాన్ని ఏర్పాటు చేశారు. మున్నా అనే నింది తుడి కోసం ఇంకో బృందం గాలిస్తోంది. పోలీసు రికార్డుల్లో ఏ 1 నిందితుడు సత్యనారాయణతో పాటు అతని బంధువు వేటలో పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు. అదే నంబరుతో అనేక ఇళ్లు.. సంఘటనస్థలంలో లభించిన ఫజల్ మహ్మద్‌ఖాన్ ఆధార్‌కార్డు ప్రకారం అతని అడ్రసు 10–3–292, విజయనగర్ కాలనీ, హైదరాబాద్‌గా ఉంది. ఈ కాలనీలో ఓ పాఠ శాల పక్కన ఇదే నంబరుతో పదుల సంఖ్యలో ఇళ్లు ఉండటం గమనార్హం. పోలీసులు ఇందు లో ఏ ఇంటికి వెళ్లారు... అసలు ఫజల్ మహ్మద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది తేలడం లేదు. చౌటుప్పల్‌లో జింకపిల్ల మార్చి 23న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామం దగ్గర హైవే టోల్గేట్ సమీప పొలాల్లో గాయంతో తిరుగుతున్న జింకపిల్లను రైతులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగిం చారు. 25న జింకపిల్ల చనిపోయింది. మహదేవపూర్ అడవుల్లో మార్చి 19న ఐదు వన్యప్రాణులను చంపగా ఇందులో రెండు దుప్పుల కళేబరాలను అటవీ శాఖ అధికా రులు పట్టుకున్నారు. మిగిలిన వన్యప్రాణు లతో ఏటూరునాగారం మీదుగా హైదరాబా ద్‌కు వేటగాళ్లు పారిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వెళ్లే క్రమంలో వీరు జింకపిల్లను మార్గమధ్యలో విడిచి వెళ్లారా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో అమ్జద్ అరెస్ట్? దుప్పుల వేటలో పాల్గొన్నాడనే అనుమానం తో మహదేవపూర్‌కు చెందిన అమ్జద్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అమ్జద్ కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఏసీ మెకానిక్ గా జీవనం సాగిస్తున్నాడు. అక్బర్ఖాన్కు సన్నిహితుడిగా పేరున్న అమ్జద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వేటగాళ్లను త్వరలోనే పట్టుకుంటాం అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్‌వో రాజశేఖర్ మహదేవపూర్: దుప్పులవేట సంఘటనలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి వేటగాళ్లం దరినీ పట్టుకుంటామని అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్‌వో రాజశేఖర్ చెప్పారు. మహదేవపూర్ లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. వేటగాళ్లు దుప్పులను వేటాడిన పంకెన అడవుల్లోని సంఘ టన స్థలాన్ని పరిశీలించి ఆనవాళ్లు సేకరించా మని, వేటగాళ్ల ముఠాలో చాలామంది ఉన్న ట్లుగా ప్రజలు సమాచారమిచ్చారని చెప్పా రు. ప్రధాన నిందితుడు అక్బర్‌ఖాన్‌ను అరెస్టు చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. వేటగాళ్లలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోందని, హైదరాబాద్, కరీంనగర్, సెంటినరీకాలనీ, మహదేవపూర్, సూరారం గ్రామాలకు చెం దిన వారు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు విచారణలో తెలుస్తోందని పేర్కొ న్నారు. మహదేవపూర్‌లోని తెనుగువాడలో నెన్నెల గట్టయ్య బంధువు ఇంట్లో గట్టయ్య తో పాటు మున్నా షల్టర్ తీసుకున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించామని, తమ రాకను ముందుగానే గమనించిన ఇంటి యజమాని ఆనవాళ్లను మాయం చేసి నట్లు అనుమానాలున్నాయని పేర్కొన్నారు. గట్టయ్య ఇంటివద్ద విచారణ జరుపుతున్న సమ యంలో ఆయన భార్యకు వచ్చిన ఫోన్‌కాల్ డాటాను సేకరించేందుకు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, అలాగే ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాల యంలోని కారు గట్టయ్య ఇంటి సమీపంలో లభించడంతో దానినీ అధీనంలోకి తీసుకున్నట్లు రాజశేఖర్ వివరించారు. వేటగాళ్లకు సహకరిస్తున్న ఇంటి దొంగలపై దృష్టిసారిస్తామని హెచ్చరించారు. -
మొత్తం వేటగాళ్లు ఏడుగురు
మహదేవపూర్ దుప్పుల వేట ఘటన సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దుప్పుల వేటకు సంబంధించి మొత్తం ఏడుగురు వేటగాళ్లు ఉన్నట్లు పోలీసు శాఖ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్, కరీంనగర్‌కు చెందిన వ్యక్తులకు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో వేటాడ టం అలవాటని, వీరికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడం అక్బర్‌ఖాన్ పనని మహదేవ పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రభాను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటవీ జంతువుల ను వేటాడే అలవాటున్న మహదేవపూర్‌కు చెందిన అక్బర్‌ఖాన్ హైదరాబాద్, కరీంనగర్, మహదేవపూర్‌లకు చెందిన ఫజల్ అహ్మద్ ఖాన్, జలాల్, మున్నా మొజిన్, గట్టయ్య, మహమ్మద్ ఖలీమ్, మహమ్మద్ అస్రార్ ఖురేషీలను వేటకు ఆహ్వానించాడు. వీరితో పాటు సత్యనారాయణ అలియాస్ షికారి సత్తన్న, అతని బంధువులు కార్లలో మహదేవ పూర్ చేరుకున్నారు. అక్కడ మద్యం తాగి అందరూ కలసి కారులో వేటకు వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు పలిమెల ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది టాటా ఇండికాను ఆపే ప్రయత్నం చేయగా ఆపకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత మహదేవపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆ వాహనాన్ని ఆపగా దానిలో ఉన్నవారు ఫారెస్టు సిబ్బందిని బెదిరించి ఆ ప్రదేశం వదిలి వెళ్లిపోయారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలి పారు. ఈ కేసులో నిందితులైన నలువాల సత్యనారాయణ, మహమ్మద్ ఖలీమ్, అస్రార్ ఖురేషీలను ఇప్పటికీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. మంత్రుల ఒత్తిడి మాపై లేదు: విజిలెన్స్ మహాదేవపూర్: ‘దుప్పుల వేట ఘటనలో కేసు మాఫీ చేయాలంటూ మంత్రులెవ్వరూ మాపై ఒత్తిడి తేలేదు. వేటగాళ్లు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని అటవీశాఖ విజి లెన్స్ అడిషినల్ పీసీసీఎఫ్వో స్వర్గం శ్రీనివాస్ స్పష్టం చేశారు. వన్యప్రాణుల వేటకు సంబం ధించి వాస్తవాలను పరిశీలించేందుకు ఆయన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌కు వచ్చారు. ఈ కేసులో విచార ణ వేగవంతం చేశామని చెప్పారు. పోలీసుల సహకారంతో ఇప్పటికే ముగ్గురు వేటగాళ్లను పట్టుకున్నామని, త్వరలోనే మిగతావారిని కూడా పట్టుకుంటామని చెప్పారు. అనంతరం నిందితుల ఇళ్లు, జెడ్పీటీసీ సభ్యురాలు హసీనా బాను ఇంటితోపాటు టీఆర్ఎస్ కార్యాలయం లో ఆయన సోదాలు నిర్వహించారు. వేటగాళ్లు ఉపయోగించిన ఇండికా కారును పరిశీలిం చారు. అంబట్‌పల్లిలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. -
జింకల వేట కేసులో ఎవరినీ వదలొద్దు
పీసీసీఎఫ్‌కు బీజేపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లాలో జరిగిన జింకల వేట విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) పీకే ఝాకు బీజేపీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం పీసీసీఎఫ్ కార్యాలయంలో ఝాను వారు కలిశారు. ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని కోరారు. ఇదే అంశంపై డీజీపీ అనురాగ్‌శర్మను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఫారెస్ట్ అధికారులను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో తగిన ఆధారాలున్నందున టీఆర్ఎస్ జెడ్పీటీసీపై చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రుల కుమారులను ఎందుకు వదిలిపెట్టారని ప్రశ్నించారు. -
మంత్రిగారి ఫోన్‌తో మారిన సీన్
♦ వేటగాళ్లను వదిలేయాలంటూ హుకుం ♦ తూచా పాటించిన అటవీశాఖ సిబ్బంది ♦ ఆయుధాలతో పారిపోయిన వేటగాళ్లు ♦ విచారణలో కనుమరుగవుతున్న వాస్తవాలు సాక్షి, భూపాలపల్లి: మహదేవపూర్ అడవుల్లో జరిగిన జింకల వేట కేసులో నిందితులను కాపాడటం వెనుక ఓ మంత్రి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి ఫోన్ కాల్‌తో మొత్తం సీన్ మారిపోయినట్లు సమాచారం. అసలు రాత్రి జరిగిన సంఘటనకు, తెల్లవారిన తర్వాత అధికారులు చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయాయి. రాష్ట్ర కేబినెట్లో ఓ ముఖ్య నేతకు చెందిన వ్యక్తులు 19న పలిమెల మండలం అడవుల్లో వేటాడేందుకు వచ్చినట్లు సమాచారం. పక్కా సమాచారంతో ఫారెస్టు అధికారులు దాడి చేశారు. అంబట్పల్లి వద్ద అధికార పార్టీకి చెందిన స్థానిక నేత ఇంట్లోని పశువుల కొట్టంలో దాక్కున్న వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో ఆదిలాబాద్ జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఓ మంత్రి నుంచి సంఘటన స్థలంలో ఉన్న స్థానిక నేతకు ఫోన్ రాగానే.. అతను సదరు ఫోన్‌ను అటవీ అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. మంత్రి ఏం చెప్పారో గానీ, క్షణాల్లో అటవీ అధికారుల వైఖరి మారిపోయింది. రెండు దుప్పుల కళేబరాలను విస్టా వాహనం డిక్కీలో బలవంతంగా కుక్కారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు కనిపించకుండా పోయాయి. ఈ క్రమంలో విస్టా వాహనం అక్కడే వదిలేసి, ఎర్ర జిప్సీలో వేటగాళ్లు దర్జాగా వెళ్లిపోయారు. ఫోన్‌కు ముందు హైడ్రామా ఫారెస్టు అధికారులు దాడి చేసిన విషయం తెలియగానే సర్వాయిపేటలో దావత్లో ఉన్న అధికార పార్టీకి చెందిన స్థానిక నేత క్షణాల్లో వచ్చేశాడు. వెంటనే ఈ ప్రాంతంలో టేకు దుంగల అక్రమ రవాణాలో ఆరితేరి ‘తూర్పు వీరప్పన్’గా పేరొందిన వ్యక్తికి ఫోన్ చేశాడు. రంగంలోకి దిగిన సదరు వ్యక్తి.. పట్టుకున్న వారిని విడిపించేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ‘తమ వాహనాన్ని ఢీ కొట్టడంతో పాటు.. ఏకంగా తుపాకీ ఎక్కుపెట్టిన వారిని వదిలే ప్రసక్తి లేదం’టూ ఫారెస్టు అధికారులు తెగేసి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక నేతతో పాటు.. సదరు వ్యక్తి తమతో దగ్గరి సంబంధం ఉన్న ఓ శాసనసభ్యుడికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యే నుంచి మంత్రికి ఫోన్ వెళ్లినట్లు సమాచారం. జింకల కళేబరాలకు పోస్టుమార్టం చేస్తున్న వైద్యులు (ఫైల్) గ్రామస్తుల సమక్షంలో.. రాత్రి పది గంటల సమయంలో ఫారెస్టు అధికారులు గ్రామంలోకి రావడంతో అంబట్పల్లి వాసులు మేల్కొన్నారు. అప్పటికీ ఎర్రజిప్సీ అంబట్పల్లిలో ఉంది. దుప్పుల కళేబరాలు నేలపై ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికంగా అధికార పార్టీకి చెందిన నేత రావడం, టేకు దుంగల స్మగ్లర్‌గా భావిస్తున్న వ్యక్తి ఫోన్, ఓ శాసన సభ్యుడి జోక్యం, చివరగా మంత్రి ఫోన్ ఆపై దుప్పుల కళేబరాలు ఇండికా డిక్కీలో ఎక్కించడం చకచకా జరిగిపోయాయి. సంఘటన జరిగి ఐదు రోజులు గడిచినా విచారణ నత్తనడకన సాగుతుండటం అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అదుపులో అనుమానితులు దుప్పుల వేటకు సంబంధించి స్థానికంగా సహకరించినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తుల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు అనుమానితుల ఫొటోలను మహదేవపూర్ రేంజర్ రమేశ్‌కు చూపించిన ట్లు తెలిసింది. వీటి ఆధారంగా ఆయన కొం దరు నిందితులను గుర్తించారు. వీటితో పా టు ఈ కేసులో అందరి నోటానానుతున్న ఎరుపు రంగు జిప్సీ వాహనంతో పాటు మిలిటరీ జీపుతో సంబంధం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసిం ది. మరోవైపు ఫారెస్టు శాఖ విజిలెన్స్ విభాగం సిబ్బంది ఆధార్ కార్డు ఆధారంగా హైదరాబాద్‌లోని ఫజల్ మహ్మద్‌ఖాన్ ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉన్నట్లు సమాచారం. రిపోర్టుల్లో తకరారు.. దుప్పుల వేట కేసు విషయంలో పోలీసు, అటవీ శాఖ అధికారుల విచారణలో ప్రాథమిక అంశాలు వేర్వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. టాటా ఇండికా విస్టా వాహనంతో ఢీ కొట్టిన అనంతరం తుపాకీతో బెదిరించి వేటగాళ్లు పారిపోయినట్లు ఫారెస్టు అధికారులు పేర్కొంటున్నారు. టాటా ఇండికా విస్టా వాహనంలో రెండు దుప్పి కళేబరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఫారెస్టు శాఖ నుంచి ఫిర్యాదు అందుకున్న తర్వాత పోలీసులు అంబట్పల్లికి వెళ్లి గ్రామస్తులను విచారించి.. తొలుత నేలపై దుప్పి కళేబరాలు ఉన్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు దుప్పి కళేబరాలు ఉంచిన స్థలంలో మ్యాపింగ్ చేశారు. ఫారెస్టు శాఖ ప్రైమరీ అఫెన్స్ రిపోర్టులో ఫజల్ మహ్మద్ ఖాన్‌తో పాటు మరో నలుగురు వేటలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. -
వేటాడింది ఐదు.. పట్టుకున్నవి రెండు
♦ మహదేవపూర్ అడవుల్లో జింకల్ని వేటాడింది రెండు బృందాలు ♦ అటవీ సిబ్బందికి దొరికినవి రెండు జింకల కళేబరాలే ♦ మరో మూడింటిని అడవిలోకి విసిరేసి పరారైన వేటగాళ్లు! ♦ ఐదుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు మహాదేవపూర్ (మంథని): భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో ఆదివారం రాత్రి వేటగాళ్లు రెండు కాదు... ఐదు జింకలను వేటాడినట్లు తెలుస్తోంది. రెండు బృందాలు ఈ వేటలో పాల్గొనగా.. ఓ బృందం రెండు జింకలను, మరో బృందం మూడు జింకలను వేటాడినట్లు అనుమానిస్తున్నారు. మూడు జింకల కళేబరాలను అడవిలోనే విసిరేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వేటలో స్థానిక నాయకుడితోపాటు సుమారు 14 మంది పాల్గొనగా.. 4 వాహనాలు వినియో గించినట్లు తెలుస్తోంది. రెండు తుపాకులను వాడినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. పోలీసులు, అటవీశాఖ అధికారుల సహ కారంతో కొన్నేళ్లుగా వేట నడుస్తున్నట్లు సమాచారం. వేట సాగిందిలా.. హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు వేటగాళ్లు ఇండికా కారులో తుపా కులతో ఆదివారం మధ్యాహ్నం స్థానిక నాయకుడి రహస్య స్థావరానికి చేరుకున్నారు. స్థానిక షూటర్లు, వేట తర్వాత జంతువును హలాల్ చేసే వారు, కాపుకాసే వారు వేటలో సహకరించే వారు వీరికి తోడయ్యారు. ఒక మిలట్రీ జీపు, ఒక జిప్సీ క్యాంటర్ వాహనం, స్థానికులకు చెందిన స్విఫ్ట్ కారు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండికా కారులో అంబట్పల్లికి బయల్దేరారు. అంబట్ పల్లిలో ఇండికా కారు వదిలి.. మిగతా మూడు వాహనాల్లో పంకెన ప్రాంతం వైపు పయన మయ్యారు. స్థానిక నాయకుడు అక్కడ కూడా వ్యవసాయం చేస్తుండడంతో.. చూసిన వారు భూముల వద్దకు వెళ్తున్నారనుకున్నారు. పంకెనలో వాగు వద్ద సదరు నాయకుడి సూచన మేరకు రెండు బృందాలుగా విడిపోయి జంతువుల సంచారం ఉన్న వైపు వెళ్లారు. వేటగాళ్ల కదలికలను గమనించిన స్థానికులు కొందరు డీఎఫ్‌వోకు సమాచారం అందజేశారు. ఎర్ర జిప్సీ వాహనంలో వెళ్లిన బృందం.. రెండు జింకలను వేటాడింది. సర్వాయపేటలో ఉన్న మరో బృందం మూడు జింకలను వేటాడినట్లు తెలుస్తోంది. ఎర్ర జిప్సీ బృందం.. వేటాడిన రెండు జింకలతో తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో పెట్రోలింగ్‌లో పలిమెల రేంజ్ అధికారికి సమాచారం అందింది. దీంతో ఆయన లెంకలగడ్డ వద్ద వాహనాన్ని అటకాయించినా ఆపకుండా దూసుకెళ్లారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన మహదేవపూర్ రేంజ్ అధికారి నలుగురు సిబ్బందితో సూరారం పొలిమేరల్లో వాహనాన్ని అడ్డుగా నిలిపారు. రాపెల్లికోట మీదుగా వచ్చిన జిప్సీ వాహనం అటవీ వాహ నాన్ని ఢీకొట్టి అంబట్పల్లి వైపు వెళ్లింది. దీన్ని అటవీ అధికారులు వెంబడిం చారు. వెనుక సర్వాయపేట నుంచి బయల్దేరిన మరో మిలట్రీ జీపులో నుంచి మూడు జింకలను దారిలోనే అడవిలోకి విసిరి వేసినట్లు చెబుతున్నారు. జిప్సీలోని జింకలను అంబట్పల్లిలో ఇండికా కారు నిలిపిన ప్రదేశంలో వేటగాళ్లు గడ్డివాములోకి విసిరేశారు. అనంతరం తుపాకులతో బెదిరించి తప్పించుకునేందుకు ప్రయత్నిం చారు. అయితే అటవీ అధికారులు వారిని చాకచక్యంగా పట్టుకొని కారును, జంతువు లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వేటగాళ్లపై కేసు జింకలను వేటాడిన ఉదంతంలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజర్ రమేశ్ తెలిపారు. రెండు జింకల కళేబరాలతోపాటు స్వాధీనం చేసు కున్న సామగ్రిని మంథని కోర్టులో డిపాజిట్ చేశామన్నారు. కారులో లభిం చిన ఆధార్‌కార్డ్, ఫొటోల ఆధారంగా హైదరాబాద్‌లోని విజయనగర్ కాలనీకి చెందిన అఫ్జల్ అహ్మద్ఖాన్తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు. -
జింకల వేటగాళ్ల అరెస్ట్
మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం రాయికోడ్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో కొన్నాళ్లుగా జింకలను వేటాడుతున్న హైదరాబాద్‌కు చెందిన ఓ ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మంగళవారం వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. వివరాలను ఎస్పీ పి.విశ్వప్రసాద్ తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. రాయికోడ్ గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు కొంతకాలంగా ప్రత్యేక వాహనాల్లో ఇక్కడికి వచ్చి వన్యప్రాణులను వేటాడేవారు. ఈ క్రమంలోనే రహస్య వ్యక్తులు అందించిన సమాచారంతో నర్వ, దేవరకద్ర ఎస్ఐలు తమ సిబ్బందితో ఆకస్మికంగా దాడిచేసి నలుగురు హైదరాబాదీలతో పాటు ఇద్దరు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వేట కోసం తీసుకొచ్చిన రివాల్వర్, ఆరురౌండ్ల బుల్లెట్లు, కారు, పదునైన కత్తి, రూ.1.10లక్షలతో పాటు జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.