
సాక్షి, యాదాద్రి: జింకను వేటాడటమే కాక దాన్ని వండుకుని తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోత్కూర్ మండలంలోని కొండాపురం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. జింకను వేటాడి, వండుకుని తిన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై అధికారులు గురువారం దర్యాప్తు చేపట్టగా జింక మాంసాన్ని ఆరగించిన విందులో రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment