మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో జరిగిన దుప్పులవేట కేసులో ఏ5 ముద్దాయి నెన్నెల గట్ట య్యను శుక్రవారం అరెస్టు చేసి మంథని కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ చంద్రభాను తెలిపారు. ఈ కేసు లో ప్రధాన నిందితుడు షికారు సత్యం, అస్రార్ ఖురేషీ, కరీముల్లా ఖాన్ ఇప్పటికే పోలీసులకు లొంగి పోగా, వారిని రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ వేటలో కీలకపాత్ర పోషించిన ఏ4 అక్బర్ ఖాన్‌తోపాటు అతడి అనుచరుడు నెన్నెల గట్టయ్య కోసం పది రోజులు గా పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు గట్టయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.
నేడు లొంగిపోనున్న అక్బర్‌ఖాన్!
దుప్పుల వేట కేసులో ఏ4 నింది తుడు మహదేవపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు హాసీనాభాను భర్త, టీఆర్‌ఎస్ నేత అక్బర్‌ఖాన్ శనివా రం కోర్టులో లొంగిపోతున్నట్లు అతడి కొడుకు అమీర్‌ఖాన్ వాట్సాప్ లో పోస్టు చేశాడు. ఈ వేటలో అక్బర్ తోపాటు ఓ విలేకరి కూడా ఉన్నట్లు అతడి కొడుకు అమీర్ ఖాన్ మెసేజ్ లో పేర్కొన్నాడు.
దుప్పుల వేట కేసులో మరొకరి అరెస్ట్
Published Sat, Apr 1 2017 1:05 AM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM
Advertisement
Advertisement