వన్యప్రాణుల వేటపై విచారణ జరిపించాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో మూడేళ్లుగా సాగుతన్న వన్య ప్రాణుల వేటపై సమగ్ర దర్యాప్తు చేసి నేరస్తులను శిక్షించాలని సీఎం కేసీఆర్‌కు బీజేఎల్పీ నేత జి.కిషన్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. దీంతోపాటు రాష్ట్రంలో జరిగిన వన్యప్రాణుల వేట, తదనందర సంఘటనలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సీఎంకు శుక్రవారం రాసిన లేఖలో కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులైన అధికారులు, వ్యక్తులపై కఠినంగా వ్యవహరించి వన్యప్రాణులను సంరక్షించాలన్నారు.
గత నెల 19న జయశంకర్ జిల్లా మహదేవ్‌పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన జింకల వేట విషయాన్ని అసెంబ్లీలో తాను సీఎం దృష్టికి తీసుకొచ్చానని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షిస్తామని సీఎం హామీ ఇచ్చారని, కానీ ఆచరణలో ప్రభుత్వ చర్యలు ఏ మాత్రం ఆశించిన విధంగా లేవని అన్నారు. నేరస్తుల అరెస్టులో తాత్సారం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ వేటలో పాల్గొన్న ముఠా సభ్యులు అటవీ అధికా రులపై దాడి చేసి తుపాకులతో చంపే స్తామని బెదిరించినా వారిపై హత్యా యత్నం కేసు ఎందుకు నమోదు చేయ లేదని ఆయన ప్రశ్నించారు.