రైతుల దగ్గరకొస్తే సమస్యలు తెలుస్తాయి
బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్‌రెడ్డి
ఖమ్మం (మామిళ్లగూడెం): సీఎం కేసీఆర్ అధికార నివాసమైన ప్రగతి భవన్‌లో జరిగే సమావేశాలతో రైతు సమస్యలు పరిష్కారం కావని, వ్యవసాయ మార్కెట్లలో ఇబ్బందులు పడుతున్న రైతుల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్‌రెడ్డి అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించడానికి శుక్రవారం ఖమ్మం వచ్చిన కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్, కార్యకర్త లను పోలీసులు అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం కిషన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ అప్రకటిత సెలవు లు ప్రకటించి, రెండురోజులు మిర్చి కొన కుండా కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లనే, రైతులంతా మిర్చి ఒక్కసారిగా ఖమ్మం మార్కెట్‌కు తేవడంతో గిట్టుబాటు ధర దక్కలేదన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించడానికి సీఎల్పీ నేత జానారెడ్డికి అవకాశం ఇచ్చారని, శాసనసభ పక్షనేతనైన నాకు ఎందుకు అవకాశం ఇవ్వ లేదని, జానారెడ్డికో న్యాయం..నాకో న్యాయ మా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగాయ న్నట్లు మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కుక్కలతో పోల్చుతున్నారన్నారు.
కిషన్‌రెడ్డికి బెదిరింపు ఫోన్‌కాల్
ఖమ్మం క్రైం: బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్‌రెడ్డిని హత్య చేస్తామని ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించిన ఘటనపై ఖమ్మం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కిషన్‌రెడ్డి శుక్రవారం ఖమ్మం మిర్చి మార్కెట్‌ను సందర్శించటానికి ఖమ్మం వచ్చారు. స్థానిక బోస్‌సెంటర్ ప్రాంతం నుంచి వస్తుండగా, కిషన్‌రెడ్డి ఓ వ్యక్తి ఫోన్ చేసి మార్కెట్ వస్తే హత్య చేస్తామని బెదిరించాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అరెస్ట్‌లకు బీజేపీ ఖండన
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మార్కెట్ యార్డుకు వెళుతున్న బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి,వంద మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ ఖండించింది. రైతులను బీజేపీ నాయకులు కలుసుకోనీయకుండా చేయడం రాష్ట్ర ప్రభుత్వ దురహంకారానికి నిదర్శనమని ఒక ప్రకటనలో విమర్శించింది. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని, కేంద్ర ప్రభుత్వం మిర్చి పంటకు ప్రకటించిన రేటుకు అదనంగా బోనస్ ప్రకటించి కొనుగోలు చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.