బంగారు తెలంగాణ ఆ నలుగురికే | Kishan Reddy comments on KCR government | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ ఆ నలుగురికే

Published Thu, Feb 23 2017 4:12 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బంగారు తెలంగాణ ఆ నలుగురికే - Sakshi

బంగారు తెలంగాణ ఆ నలుగురికే

బీజేపీ నేత జి.కిషన్‌రెడ్డి

సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ కోసం పోరాడిన వారికి ఎలాంటి న్యాయం జరగడం లేదని, సీఎం కేసీఆర్‌ నిర్మిస్తామంటున్న బంగారు తెలంగాణ కేవలం ఆ నలుగురికే నిర్మితం అవుతోందని బీజేపీ శాసనసభాపక్షనేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితలను ఉద్దేశించి ఈ వ్యాఖ్య లు చేశారు. ఆ నలు గురికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ చేపట్టిన సింగరేణియాత్రలో బుధవారం పెద్దపల్లి జిల్లాలో కొనసాగింది.

రామగిరి మండలం అడ్రియాల ఓపెన్‌ కాస్ట్‌–2బొగ్గు గనులను సందర్శించిన కిషన్‌రెడ్డి అక్కడ కార్మికులతో మాట్లాడారు. సింగరేణి నిర్వాసిత గ్రామాలైన లద్నాపూర్, పెద్దంపేట్‌ గ్రామాల్లో నిర్వాసితులతో సమావేశమయ్యారు. గోదావరిఖనిలో జరిగిన కార్మికుల సభలో మాట్లాడారు.  షరతు లు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కోల్ట్‌బెల్ట్‌ ఏరియాలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటుచేసి కార్మికులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement