జింకల వేట కేసులో ఎవరినీ వదలొద్దు | bjp request to PCCF on deers hunting | Sakshi
Sakshi News home page

జింకల వేట కేసులో ఎవరినీ వదలొద్దు

Published Sun, Mar 26 2017 2:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

జింకల వేట కేసులో ఎవరినీ వదలొద్దు - Sakshi

జింకల వేట కేసులో ఎవరినీ వదలొద్దు

పీసీసీఎఫ్‌కు బీజేపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్‌: భూపాలపల్లి జిల్లాలో జరిగిన జింకల వేట విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) పీకే ఝాకు బీజేపీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం పీసీసీఎఫ్‌ కార్యాలయంలో ఝాను వారు కలిశారు. ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని కోరారు.

ఇదే అంశంపై డీజీపీ అనురాగ్‌శర్మను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఫారెస్ట్‌ అధికారులను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో తగిన ఆధారాలున్నందున టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీపై చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన మంత్రుల కుమారులను ఎందుకు వదిలిపెట్టారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement