austerity measures
-
యుద్ధ నేరాలకు... సాక్ష్యాలివిగో
కీవ్: రైల్వే స్టేషన్‌పై క్షిపణి దాడితో 50 మందికి పైగా అమాయకులను పొట్టన పెట్టుకున్న రష్యాపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ కోరింది. బుచాను తలపించే ఈ మారణకాండకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను బాధ్యున్ని చేసి తీరాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. రష్యా యుద్ధ నేరాలకు కావాల్సినన్ని రుజువులు దొరికాయని చెప్పారు. ‘‘మా పౌరులను ఎలా అపహరించింది, ఎలా నిర్దాక్షిణ్యంగా కాల్చేసిందీ, చేతికందిన వాటినల్లా ఎలా దోచేసిందీ రష్యా సైనికులు తమ కుటుంబీకులకు చెప్తున్న ఫోన్ సంభాషణలను రికార్డు చేశాం. మాకు పట్టుబడ్డ రష్యా పైలట్ల దగ్గర పౌర నివాస ప్రాంతాలున్న మ్యాపులు దొరికాయి కూడా’’ అన్నారు. ప్రధాన కారకుడైన పుతిన్‌తో పాటు ఈ దారుణాలకు ప్లాన్ చేసిన, ఆదేశాలిచ్చిన, వాటిని అమలు చేసిన వారందరిపైనా విచారణ జరిగి కఠినాతి కఠినమైన శిక్షలు పడాల్సిందేనన్నారు. ఈ ఘోరాన్ని వర్ణించేందుకు మాటలే లేవని కీవ్‌లో పర్యటిస్తున్న యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ అన్నారు. రష్యా శాడిజం నానాటికీ పరాకాష్టను చేరుతోందని దుయ్యబట్టారు. అయితే తనను దోషిగా చూపేందుకు ఉక్రెయినే రైల్వేస్టేషన్‌పై దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. బుచాలో పౌరులను రష్యా దళాలు సామూహికంగా పొట్టన పెట్టుకున్న కనీసం మూడు చోట్లను తాజాగా గుర్తించినట్టు నగర మేయర్ చెప్పారు. ఒక చోట సామూహికంగా ఖననం చేసిన 70 శవాలను బయటికి తీశామన్నారు. ఈ మారణకాండలో రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ హస్తముందని జర్మనీ అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా తన సైనిక శక్తిలో కనీసం 20 శాతాన్ని కోల్పోయిందని అమెరికా తాజాగా అంచనా వేసింది. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలిస్తామని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన ఆయన శనివారం కీవ్‌లో జెలెన్స్కీతో భేటీ అయ్యారు. మరోవైపు, ఉక్రెయిన్‌లో తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తున్నట్టు ఆస్ట్రియా ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ కూడా తమ రాయబారిని కీవ్‌కు తిరిగి పంపించింది. ఇటలీ కూడా త్వరలో కీవ్‌లో తమ ఎంబసీని తెరుస్తామని ప్రకటించింది. ఆదుకోండి: ప్రియాంక శరణార్థులను ఆదుకోవాలని నటి, యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా ప్రపంచ నేతలను కోరారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘20 లక్షలకు పైగా ఉక్రెయిన్ చిన్నారులు దేశం విడిచారు. 30 లక్షలకు పైగా స్వదేశంలోనే నిరాశ్రయులుగా మిగిలారు. కనీవినీ ఎరగని సంక్షోభమిది. యుద్ధం మిగిల్చిన ఈ తీరని వేదన వారి మనసుల్లోంచి ఎన్నటికీ పోయేది కాదు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. తన అభిమానులు, ఫాలోవర్లు కూడా వీలైనంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. భద్రతామండలి నుంచి రష్యాను బహిష్కరించలేం: అమెరికా ఐరాస భద్రతా మండలి నుంచి రష్యా బహిష్కరణ సాధ్యం కాదని అమెరికా అభిప్రాయపడింది. రష్యా అందులో వీటో అధికారమున్న శాశ్వత సభ్య దేశమ ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి గుర్తు చేశారు. రష్యాకు భారత్ దూరమవాలి: అమెరికా రష్యాతో జి77 అలీన భాగస్వామ్య బంధం నుంచి భారత్ తప్పుకోవాలని అమెరికా విదేశాంగ ఉప మంత్రి వెండీ షెర్మన్ సూచించారు. అమెరికా–భారత్ మధ్య రక్షణ వాణిజ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ఎం తో అవకాశముందన్నారు. ‘అమెరికా, ఆస్ట్రేలి యా, జపాన్‌లతో కూడిన క్వాడ్ కూటమిలో కూ డా భాగస్వామి అయినా భారత్ వెంటనే రష్యాతో బంధానికి దూరమైతే మేలు’ అన్నారు. -
కోవిడ్-19 : గవర్నర్ కీలక నిర్ణయం
ముంబై : కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి రాజ్‌భవన్ ఖర్చుల్లో భారీ కోత విధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చులను గణనీయంగా తగ్గించాలని రాజభవన్ అధికారులకు సూచించారు. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టరాదని, రాజ్‌భవన్‌లో భారీ నిర్మాణ పనులు, మరమ్మత్తులు నిర్వహించరాదని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులనే చేపట్టాలని సూచించారు. ఆగస్ట్ 15న పుణే రాజ్‌భవన్‌లో తలపెట్టిన స్వాత్రంత్య దినోత్సవ వేడుకలను నిలిపివేయాలని ఆయన నిర్ణయించారు. రాజ్‌భవన్‌లో ఎలాంటి నూతన నియామకాలు చేపట్టరాదని ఆదేశించారు. రాజ్‌భవన్ అవసరాల కోసం కొత్త కారు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను పక్కనపెట్టారు. వీవీఐపీలకు బహుమతులు ఇచ్చే సంపద్రాయాన్ని తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ నిలిపివేయాలని స్పష్టం చేశారు. వీసీలు, ఇతర అధికారులతో సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిర్వహించాలని, ప్రయాణ ఖర్చులపై వ్యయం తగ్గించాలని సూచించారు. ఈ చర్యల ద్వారా రాజ్‌భవన్ బడ్జెట్లో 10 నుంచి 15 శాతం ఆదా చేయవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, గవర్నర్ ఇప్పటికే తన నెల జీతాన్ని కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వగా, తన వార్షిక వేతనంలో 30 శాతం పీఎం కేర్స్ ఫండ్‌కు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. చదవండి : ముస్లిం సోదరులకు ఏపీ గవర్నర్ శుభాకాంక్షలు -
ఉగ్రవాదంపై కఠిన చర్యలు
ఒసాకా: ఉగ్రవాద ముఠాలకు ఆర్థిక సాయం అందకుండా చూడటంతోపాటు, తమ భూభాగాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రపంచ దేశాలన్నీ కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలు శుక్రవారం కోరాయి. ఉగ్రవాదంపై తాము పోరాడతామనీ, అక్రమ నిధుల ప్రవాహాన్ని అడ్డుకుంటామని ఆ ఐదు దేశాలు ప్రతినబూనాయి. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 దేశాల సదస్సు కోసం అక్కడకు వచ్చిన బ్రిక్స్ దేశాధినేతలు ప్రత్యేకంగా ఓ అనధికారిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల అధ్యక్షులు వరుసగా షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, సిరిల్ రమఫోసా, జాయిర్ బోల్సొనారోలు ఆ భేటీలో పాల్గొన్నారు. నల్లధనం, అవినీతి, అక్రమ ఆర్థిక నిధుల ప్రవాహంపై కూడా కలిసికట్టుగా, ఒకరికొకరు సహకరించుకుంటూ పోరాడాలని ఐదు దేశాల అధినేతలు నిర్ణయించారు. ఆర్థిక వ్యవస్థలకూ నష్టమే: మోదీ మానవాళికి ఉగ్రవాదమే అతిపెద్ద ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఒసాకాలో జరిగిన బ్రిక్స్ దేశాధినేతల భేటీలో అన్నారు. ఉగ్రవాదం అనే భయంకర భావజాలం వల్ల అమాయకుల ప్రాణాలు పోవడమే కాకుండా దేశాల ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)ను తక్షణం బలోపేతం చేయడం, రక్షణాత్మక వర్తక విధానాలను గట్టిగా వ్యతిరేకించడం, అందరికీ ఇంధన భద్రత కల్పించడం, ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవడం అనేవి ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యాలని మోదీ పేర్కొన్నారు. పుతిన్, జిన్‌పింగ్‌లతో త్రైపాక్షిక భేటీ ఒసాకాలోనే పుతిన్, జిన్‌పింగ్‌లతో కలిసి మోదీ ప్రత్యేకంగా ఆర్ఐసీ (రష్యా, ఇండియా, చైనా) సమావేశంలోనూ పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు సహా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ‘ప్రపంచపు ఆర్థిక, రాజకీ, భద్రత పరిస్థితులపై మనం చర్చించడం ముఖ్యం’ అని మోదీ పేర్కొన్నారు. -
జింకల వేట కేసులో ఎవరినీ వదలొద్దు
పీసీసీఎఫ్‌కు బీజేపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లాలో జరిగిన జింకల వేట విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) పీకే ఝాకు బీజేపీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం పీసీసీఎఫ్ కార్యాలయంలో ఝాను వారు కలిశారు. ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని కోరారు. ఇదే అంశంపై డీజీపీ అనురాగ్‌శర్మను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఫారెస్ట్ అధికారులను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో తగిన ఆధారాలున్నందున టీఆర్ఎస్ జెడ్పీటీసీపై చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రుల కుమారులను ఎందుకు వదిలిపెట్టారని ప్రశ్నించారు. -
షెల్ కంపెనీలపై కఠిన చర్యలు
• బ్యాంకు ఖాతాల స్తంభన • టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు న్యూఢిల్లీ: పన్నులు ఎగవేసేందుకు, మనీలాండరింగ్ కోసం ఏర్పాటయ్యే డొల్ల కంపెనీలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఆయా సంస్థల ఖాతాలను స్తంభింపచేయడంతో పాటు పలు కఠిన చర్యలు తీసుకోనుంది. షెల్ కంపెనీలపై శుక్రవారం సమీక్ష జరిపిన ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. రెవెన్యూ విభాగం, కార్పొరేట్ వ్యవహారాల విభాగాల కార్యదర్శుల సారథ్యంలోని ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఇతర శాఖలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులు సభ్యులుగా ఉంటారు. ’దేశంలో 15 లక్షల కంపెనీలు నమోదై ఉండగా, కేవలం 6 లక్షల సంస్థలు మాత్రమే వార్షికంగా రిటర్నులు దాఖలు చేస్తున్నాయి. అంటే, చాలా పెద్ద సంఖ్యలో కంపెనీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయి’ అని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించే ఈ తరహా డొల్ల సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, కార్యకలాపాలు సాగించని సంస్థలను రద్దు చేయడం, బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని ప్రయోగించడం తదితర చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. అలాగే ఇలాంటి కార్యకలాపాలకు సహకరించే వృత్తి నిపుణులపై కూడా చర్యలు ఉంటాయని పీఎంవో తెలిపింది. 49 సంస్థలపై ఎస్ఎఫ్ఐవో కేసులు.. గణాంకాల ప్రకారం 54 మంది ప్రొఫెషనల్స్‌తో 559 మంది దాదాపు రూ. 3,900 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తేలిందని పీఎంవో తెలిపింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) 49 షెల్ కంపెనీలపై కేసులు నమోదు చేసింది. డొల్ల సంస్థల తీరుతెన్నులు.. షెల్ కంపెనీల తీరుతెన్నుల గురించి పీఎంవో వివరించింది. నామమాత్రపు పెయిడప్ క్యాపిటల్, షేరుకు అధిక ప్రీమియం కారణంగా ఖాతాల్లో అధిక నిల్వలు.. మిగులు, అన్‌లిస్టెడ్ సంస్థల్లో పెట్టుబడులు, డివిడెండ్ ఆదాయం లేకపోవడం, అత్యధికంగా నగదు నిల్వలుండటం ఈ షెల్ కంపెనీల లక్షణాలని పేర్కొంది. అలాగే ప్రైవేట్ సంస్థలు మెజారిటీ వాటాదారులుగా ఉండటం, టర్నోవరు.. నిర్వహణ ఆదాయాలు తక్కువగా ఉండటం, నామమాత్రపు వ్యయాలు..చెల్లింపులు, అతి తక్కువ స్థిరాస్తులు మొదలైనవి కూడా ఇందులో ఉంటాయని వివరించింది. -
సబ్సిడీ గ్యాస్ కట్టడికి కఠిన చర్యలు
• చమురు శాఖకు రూ.10 లక్షల ఆదాయ వ్యక్తుల సమాచారం • త్వరలో ఐటీ శాఖతో ఒప్పందం న్యూఢిల్లీ: అధిక ఆదాయ వర్గాలకు సబ్సిడీ వంట గ్యాస్ అందకుండా ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ప్రత్యేకించి రూ.10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వ్యక్తుల సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ,చమురు, పెట్రోలియం మంత్రిత్వశాఖకు సమర్పించనుంది. సమాచారం అందజేత, భద్రత ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ), పెట్రోలియం శాఖ మధ్య త్వరలో ఒక అవగాహనఒప్పందం కుదరనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం అధిక ఆదాయ వ్యక్తి పేరు, పాన్ నంబర్, పుట్టినతేదీ, ఈ–మెయిల్ ఐడీ, ఇంటి లేదా ఆఫీస్ ఫోన్, మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలనూ పెట్రోలియం మంత్రిత్వశాఖకు ఐటీ శాఖ ఎప్పటికప్పుడు అందిస్తుంది. ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం 14.2 కేజీల బరువున్న 12 గ్యాస్ సిలిండర్లు ఏటా సబ్సిడీపై పొందే వీలుంది. ధనవంతులుతమకుతాముగా గ్యాస్ సబ్సిడీ వద్దంటూ డిక్లరేషన్లు ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పన్నులకు లోబడి వినియోగదారు లేదా వారి భాగస్వామిగానీ వార్షికంగా రూ.10 లక్షలకుపైగా ఆదాయంపొందుతుంటే, వారికి సబ్సిడీ గ్యాస్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించినట్లు కూడా అప్పట్లో కేంద్రం ప్రకటించింది. -
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
డీఆర్డీఓ శ్రీనివాసకుమార్ రఘునాథపల్లి: ఉపాధి పనుల్లో అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఓ ఆకవరం శ్రీనివాసకుమార్ హెచ్చరించారు. ఉపాధి పనులపై మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం జరిగిన 10వ విడత ఓపెన్ ఫోరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసిస్టెంట్ పీడీ వసంత, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ బానోతు శారద హాజరైన ఈ కార్యక్రమంలో సోషల్ అడిట్ బృందాల తనిఖీ నివేదికలను డీఆర్పీలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఉపాధి పనుల్లో చేసిన పనులకంటే ఎక్కువ బిల్లులు చెల్లించినట్లు తేలడం, పనుల ప్రదేశాలను మార్చి చేయించడం, మస్టర్లలో దిద్దుబాట్లు, ఒకరి పేరు బదలు మరొకరి పేరు, మేట్లే సంతకాలు చేయడం లాంటి లోపాలను గుర్తించారు. దీంతో పలువురు ఎఫ్ఏ, టీఏల నుంచి రికవరీకి అసిస్టెంట్ పీడీ వసంత ఆదేశించారు. చాలా రాత్రి వరకు కొన్ని గ్రామాల నివేదికలు పూర్తి కాలేదు. శ్రీనిధిలో చేతి వాటం మహిళల నిరాక్ష్యరాస్యతను ఆసరా చేసుకొని గ్రామైఖ్య సంఘాల్లో పని చేస్తున్న పలువురు సీఏలు చేతి వాటం ప్రదర్శించారని సోషల్ అడిట్ బృందాలు అయా గ్రామసభలలో వెలుగులోకి తెచ్చారు. ముఖ్యంగా మాదారంలో సీఎ కర్ల పద్మ శ్రీనిధి రుణాలు పొందిన ప్రతీ మహిళ నుంచి రూ.1000 చొప్పున తీసుకున్నట్లు గ్రామసభలో సోషల్ అడిట్ బృందాలు బహిర్గతం చేశారు. కాగా, ప్రజావేదికకు ప్రజలు పెద్దగా హాజరు కాలేదు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్కపురం లక్ష్మయ్య, ఎంపీడీఓ బానోత్ సరిత, జిల్లా విజిలెన్స్ అధికారి ప్రభాకర్, ఎస్టీఎం వేణు, ఎస్సార్పీలు రవి, మహేశ్వర్, అజయ్, ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్, క్వాలిటీ కంట్రోల్ అధికారి సుధాకర్, ఏపీఓ ప్రేమయ్య, ఏపీఎం భవా ని, సర్పంచ్‌లు జోగు గట్టయ్య, ఎండీ యాకుబ్ అలీ, మినుకూరి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వాతలు పెట్టి.. ఫొటోలు తీసి
ఆరేళ్ల బాలుడిపై తల్లి కర్కశత్వం హిమాయత్‌నగర్: అభం శుభం తెలియని ఆరేళ్ల బాలుడికి స్వయంగా అతని తల్లి వాతల పెట్టడమేగాక ఫొటోలను స్నేహితులకు పంపి ఆనందం పొందుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు నారాయణగూడ కార్యాలయంలో ఇందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన కిరణ్ అనే వ్యక్తి తన భార్య తన కుమారుడిని కొడుతోందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అల్లరి చేస్తున్నాడన్న కారణంగా అట్లకర్ర కాల్చి శరీరంపై వాతలు పెట్టడమేగాక, గాయాలను సెల్ఫోన్లో ఫొటోలు తీసి తన స్నేహితులకు పంపుతోందన్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘాన్ని కోరారు. తక్షణం బాలుడి తల్లిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
డ్రంకన్ డ్రైవర్లపై సైబరాబాద్ పోలీసుల చర్యలు
► వారం రోజుల్లో 358 మందిపై కేసులు, ► తొమ్మిది మందికి జైలు సాక్షి, సిటీబ్యూరో: తాగి వాహనం నడుపుతున్న వారిపై సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత నెల 30 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌ల్లో 358 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి రూ. 3,49,500ల జరిమానా వసూలు చేయగా, అతిగా మద్యం తాగి డ్రైవింగ్ చేసిన తొమ్మిది మందికి జైలు శిక్ష పడిందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 12,892 మందిపై కేసులు నమోదు కాగా, 537 మందికి జైలు శిక్ష పడింది. మరోవైపు అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై నిబంధనలు అతిక్రమించిన వారిపై పెట్రోలింగ్ పోలీసులు కొరడా జుళిపించారు. గత నెల 30 నుంచి ఈ నెల 5వ తేదీ వరకూ 638 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, రూ. 4,68,700 జరిమానా వసూలు చేశారు. -
ప్రమాణస్వీకారానికి ముందే పొదుపు చర్యలు
కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. విజయన్ మంత్రివర్గంలో మొత్తం 19 మంది సభ్యులుండే అవకాశం కనిపిస్తోంది. వీళ్లలో సీపీఎంతో పాటు భాగస్వామ్య పక్షాలైన సీపీఐ, ఎన్సీపీ సభ్యులు కూడా ఉంటారు. అత్యంత కీలకమైన హోం, విజిలెన్స్ శాఖలను విజయన్ తనవద్దే ఉంచుకున్నారు. సీపీఎం నుంచి ఈపీ జయరాజన్, థామస్ ఇజాక్, కేకే శైలజ, ఏకే బాలన్, టీపీ రామకృష్ణన్, జి సుధాకరన్, కడకంపల్లి సురేంద్రన్, సి.రవీంద్రనాథ్ తదితరుల పేర్లు మంత్రుల జాబితాకోసం వినిపిస్తున్నాయి. పొదుపు చర్యలలో భాగంగా మంత్రుల అధికారిక నివాసాలకు ఎలాంటి మార్పుచేర్పులు చేయబోమని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ముందే ప్రకటించారు. అలాగే మంత్రుల వ్యక్తిగత సిబ్బంది సంఖ్యను కూడా 30 నుంచి 25కు తగ్గించారు. పాత ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చేసినట్లుగా సీఎం కార్యాలయం, చాంబర్ నుంచి లైవ్ వెబ్స్ట్రీమింగ్ ఏమీ ఇవ్వబోమన్నారు. -
ఇసుక జోలికొస్తే ఊరుకోం
♦ వీఆర్ఓ, వీఆర్‌ఏలదే బాధ్యత ♦ కలెక్టర్ హెచ్చరిక నర్సాపూర్: జిల్లాలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఎంపీపీ కార్యాలయంలో అభివృద్ధి, ఇతర అంశాలపై ఆయన సమీక్షించారు. అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఇసుకను అక్రమంగా రవాణ చేసే వాహనాలను సీజు చేస్తామని, రూ. లక్ష వరకు జరిమానా విధిస్తామన్నారు. ఇసుక రవాణాను వీఆర్ఓ, వీఆర్ఏలు అడ్డుకోవాలని, అక్రమ రవాణా జరిగితే వీరే బాధ్యత వహించాలన్నారు. వాల్టా చట్టం అమలులో భాగంగా కేసులు నమోదు చేయాలని అక్కడే ఉన్న సీఐ తిరుపతిరాజును కలెక్టర్ ఆదేశించారు. ఇసుక ఇష్టానుసారంగా తీయడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, ఇసుక ఉన్న వాగులను అధికారులు గుర్తించారని ఆయా వాగులలో అధికారుల సూచనల ప్రకారం ఇసుకను తీయాలని ఆయన ప్రజలకు సూచించారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్నారని కితాబునిచ్చారు. వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా డిసెంబరు 31 నాటికి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో నల్లాల ద్వారా మంచి నీరు సరఫరా చేస్తామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ విజయప్రకాష్ మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పథకం అమలును వివరించారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణిమురళీయాదవ్, జెడ్పీ సీఈఓ వర్షిణి, మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్, ఎంపీపీలు శ్రీనివాస్‌గౌడ్, హరికృష్ణ, పద్మ, జెడ్పీటీసీలు కమల, జయశ్రీ పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషిద్ధం. మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. వీటిని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కడా ప్రచారం చేయడం, గుర్తులు, బ్యానర్లు ప్రదర్శించకూడదు. ఈ నాలుగు కేటగిరీలకే అనుమతి పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోకి విధుల్లో ఉండే అధికారులతో పాటు కేవలం నాలుగు కేటగిరీల వారినే అనుమతిస్తారు. ఓటర్లు, ఆ డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. వీరు మినహా ప్రజాప్రతినిధులను సైతం ఈ ప్రాంతంలోకి అనుమతించరు. రెండు వరుసలే... పోలింగ్ కేంద్రం వద్ద క్యూ నిర్వహణకూ పటిష్ట నిబంధనలు ఉన్నాయి. ప్రతి కేంద్రం వద్ద పురుష, స్త్రీ ఓటర్ల కోసం వేర్వేరుగా రెండు క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మినహా మరో వరుసలో రావడాన్ని నిషేధించారు. అతిక్రమిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. -
మంత్రుల క్వార్టర్స్ మరమ్మతు నిధులకు ‘టెండర్’
ముందు టెండర్... ఆ తర్వాత నామినేషన్‌కు బదలాయింపు లెస్‌కు టెండర్లు దాఖలైనావింత ధోరణి అన్ని క్వార్టర్లకూ ఒకే మొత్తానికి ప్రతిపాదనలు రోడ్లు, భవనాల శాఖలో ఇష్టారాజ్యం హైదరాబాద్: రోడ్లు భవనాల శాఖ అంటేనే ఇష్టారాజ్యానికి చిరునామా. నిబంధనలు, పొదుపు చర్యలు, నాణ్యతకు అక్కడ అంత ప్రాధాన్యం ఉండదు. సొంత కార్యాలయం కోసం నిర్మిస్తున్న భారీ భవనం విషయంలో అడ్డగోలుగా అంచనాలు పెంచేసి రూ.20 కోట్ల పనిని రూ.67 కోట్లకు చేర్చిన అధికారులు.. తాజాగా మంత్రుల నివాసాల్లో మరమ్మతుల విషయంలో వింతగా వ్యవహరించారు. అడ్డగోలు విధానాల్లో తమకు హద్దే లేదని నిరూపించారు. ఇదీ సంగతి... మంత్రులకు కేటాయించిన కొన్ని క్వార్టర్లలో మరమ్మతులు జరపాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 16, 17 తేదీల్లో రోడ్లు, భవనాల శాఖ సెంట్రల్ బిల్డింగ్ డివిజన్ ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ఆన్లైన్ టెండర్లు పిలిచింది. మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి, నాటి డిప్యూటీ సీఎం రాజయ్య, శాసనసభ ఉప సభాపతి పద్మా దేవేందర్, సీఎల్పీ నేత జానారెడ్డిల క్వార్టర్లకు మరమ్మతు జరుపుతున్నట్టు టెండర్లో పేర్కొం ది. సాధారణంగా ఆయా క్వార్టర్లలో ఉండే సమస్యల ఆధారంగా పనులు జరుపుతారు. వెరసి పనులు వేరువేరుగా ఉంటాయి. కానీ విచిత్రమేంటంటే... ఈ అన్ని పనులకు రూ.7,10,720 చొప్పున ప్రతిపాదించారు. అన్నింటికి పైసల్లో కూడా తేడా లేకుండా ఒకేమొత్తం ఎలా అవసరమవుతుందో అధికారులకే తెలియాలి. వీటిల్లో దాదాపు అన్ని పనులకు కొందరు కాంట్రాక్టర్లు లెస్‌కు కొటేషన్లు దాఖలు చేశారు. ఆ ప్రకారం తక్కువ మొత్తం కోట్ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఆ తర్వాత పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. విచిత్రమేంటంటే... ఇందులో కొన్ని క్వార్టర్ల టెండర్లను ‘అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్’ పేరు చెబుతూ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ పనులను తోచిన వ్యక్తులకు నామినేషన్‌పై ఇచ్చేసుకున్నారు. అత్యవసర పనులైనందున, నామినేషన్ కింద కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచిత్రమేంటంటే కొన్ని పనుల నామినేషన్ ఉత్తర్వు గత ఫిబ్రవరి 2న వెలువడితే, కొన్నిం టిది నిరుడు నవ ంబరులో విడుదలైంది. వీటన్నిటికీ టెండర్లు ఒకేసారి పిలిచారు అయినా.. కొన్ని అత్యవసరమెలా అవుతాయి, వాటికి గడువు లేని పరిస్థితి ఎలా ఉత్పన్నమవుతుందో అధికారులే చెప్పాలి. టెండర్ల సమయంలోనే ఆరోపణలు ఎక్కువ మొత్తం లెస్‌కు కోట్ చేసి కాంట్రాక్టర్లు రింగుగా మారి టెండర్లు దక్కించుకున్నారని ఆదిలోనే ఆరోపణలు వచ్చాయి. వాటిని రద్దు చేసి మళ్లీ పిలవాలంటూ కొందరు కాంట్రాక్టర్లు చీఫ్ఇంజనీర్కు ఫిర్యాదు చేశారు. విచిత్రమేంటంటే 30 శాతం, 28 శాతం లెస్‌కు టెండర్లు దాఖలైన వాటిని కొనసాగిస్తూ 16 శాతం లెస్‌కు దాఖలైన వాటిని రద్దు చేసి నామినేషన్ పేర అప్పగించారు. అయితే ఈ పనుల్లో కొన్ని పూర్తయిన తర్వాత నామినేషన్ డ్రామాకు తెర తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అధికారులకు ఫస్ట్‌క్లాస్ విమానయానం కట్
దేశ ఖజానా పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అందువల్ల దుబారాను వెంటనే తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశించింది. ప్రభుత్వాధికారులు ఇకమీదట పొదుపు చర్యలు పాటించి తీరాల్సిందేనని కుండ బద్దలుకొట్టింది. ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయడం, ఫస్ట్ క్లాస్ విమానాల్లో ప్రయాణించడం ఇక మానుకోవాలని స్పష్టం చేసింది. ప్రణాళికేతర వ్యయాన్ని కనీసం 10 శాతం మేర తగ్గించాలన్న లక్ష్యాన్ని ఆర్థిక శాఖ విధించింది. జూలై నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 12.19 లక్షల కోట్ల ప్రణాళికేతర వ్యయం అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో, అనవసర వ్యయాలను కచ్చితంగా తగ్గించాలని ఓ మెమోలో తెలిపింది. విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రభుత్వాధికారులు ఫస్ట్ క్లాస్ విమానాల్లో ప్రయాణించకూడదని, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయకూడదని.. వీటిపై నిషేధం ఉందని తెలిపారు. అలాగే ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు, సదస్సులు కూడా నిర్వహించకూడదన్నారు. వాస్తవానికి సీనియారిటీ ప్రకారం వివిధ తరగతుల్లో ప్రయాణించేందుకు అధికారులకు అర్హత ఉన్నా.. ప్రస్తుత పరిస్థితిని బట్టి వాటిని మానుకోవాలన్నారు.