పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషిద్ధం. మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. వీటిని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కడా ప్రచారం చేయడం, గుర్తులు, బ్యానర్లు ప్రదర్శించకూడదు.
ఈ నాలుగు కేటగిరీలకే అనుమతి
పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోకి విధుల్లో ఉండే అధికారులతో పాటు కేవలం నాలుగు కేటగిరీల వారినే అనుమతిస్తారు. ఓటర్లు, ఆ డివిజన్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. వీరు మినహా ప్రజాప్రతినిధులను సైతం ఈ ప్రాంతంలోకి అనుమతించరు.
రెండు వరుసలే...
పోలింగ్ కేంద్రం వద్ద క్యూ నిర్వహణకూ పటిష్ట నిబంధనలు ఉన్నాయి. ప్రతి కేంద్రం వద్ద పురుష, స్త్రీ ఓటర్ల కోసం వేర్వేరుగా రెండు క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మినహా మరో వరుసలో రావడాన్ని నిషేధించారు. అతిక్రమిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
Published Tue, Feb 2 2016 4:38 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement