వాతలు పెట్టి.. ఫొటోలు తీసి | Photos taken in shares.. | Sakshi
Sakshi News home page

వాతలు పెట్టి.. ఫొటోలు తీసి

Published Mon, Sep 12 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

గాయాలను చూపుతున్న బాలుడు

గాయాలను చూపుతున్న బాలుడు

ఆరేళ్ల బాలుడిపై తల్లి కర్కశత్వం


హిమాయత్‌నగర్‌: అభం శుభం తెలియని ఆరేళ్ల బాలుడికి స్వయంగా అతని తల్లి వాతల పెట్టడమేగాక ఫొటోలను స్నేహితులకు పంపి ఆనందం పొందుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు  నారాయణగూడ కార్యాలయంలో ఇందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన కిరణ్‌ అనే వ్యక్తి తన భార్య తన కుమారుడిని కొడుతోందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అల్లరి చేస్తున్నాడన్న కారణంగా అట్లకర్ర కాల్చి శరీరంపై వాతలు పెట్టడమేగాక, గాయాలను సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి తన స్నేహితులకు పంపుతోందన్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘాన్ని కోరారు. తక్షణం బాలుడి తల్లిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement