► వారం రోజుల్లో 358 మందిపై కేసులు,
► తొమ్మిది మందికి జైలు
సాక్షి, సిటీబ్యూరో: తాగి వాహనం నడుపుతున్న వారిపై సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత నెల 30 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌ల్లో 358 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి రూ. 3,49,500ల జరిమానా వసూలు చేయగా, అతిగా మద్యం తాగి డ్రైవింగ్ చేసిన తొమ్మిది మందికి జైలు శిక్ష పడిందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 12,892 మందిపై కేసులు నమోదు కాగా, 537 మందికి జైలు శిక్ష పడింది. మరోవైపు అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై నిబంధనలు అతిక్రమించిన వారిపై పెట్రోలింగ్ పోలీసులు కొరడా జుళిపించారు. గత నెల 30 నుంచి ఈ నెల 5వ తేదీ వరకూ 638 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, రూ. 4,68,700 జరిమానా వసూలు చేశారు.
డ్రంకన్ డ్రైవర్లపై సైబరాబాద్ పోలీసుల చర్యలు
Published Tue, Aug 9 2016 12:20 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement
Advertisement