దుప్పుల వేట కేసులో మరో ఇద్దరు అరెస్టు
భూపాలపల్లి(ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవపూర్ దుప్పుల వేట ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
కాళేశ్వరం పరిసరాల్లో అజ్ఞాతంలో ఉన్న ఏ4 నిందితుడు అక్బర్‌ఖాన్, హంటర్ మున్నాలను సీఐ చంద్రభాను నేతృత్వంలో పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మార్చి 19వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటనలో పాల్గొన్న వారి కోసం విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులు కాళేశ్వరం చాకిగుంట వద్ద ఉండగా పట్టుకున్నట్లు సీఐ తెలిపారు.